Devil 2: డెవిల్ సీక్వెల్.. రెండు కాలాలకు సంబంధించిన కథ..ఇంట్రెస్టింగ్ విషయాలు బయటపెట్టిన కళ్యాణ్ రామ్

Devil Collections: వైవిద్యమైన కథలు ఎంచుకోవడంలో కళ్యాణ్ రామ్ ఎప్పుడు ముందుంటారు. తాజాగా ఈ హీరో మరో కొత్త ప్రయత్నంతో మన ముందుకి వచ్చిన సినిమా డెవిల్. నిన్న విడుదలైన ఈ సినిమా పర్వాలేదు అనిపించుకుంటుంది. కాగా ఇంతలోనే ఈ సినిమాకి సీక్వెల్ ఉంది అని ప్రకటించారు ఈ చిత్ర యూనిట్.

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 30, 2023, 09:03 AM IST
Devil 2: డెవిల్ సీక్వెల్.. రెండు కాలాలకు సంబంధించిన కథ..ఇంట్రెస్టింగ్ విషయాలు బయటపెట్టిన కళ్యాణ్ రామ్

Kalyan Ram Devil Sequel: డిసెంబర్ 29న విడుదలైన కళ్యాణ్ రామ్ సినిమా డెవిల్ మొదటి షో నుంచి పర్వాలేదు అనిపించుకునే టాక్ తెచ్చుకుంది. మొదటినుంచి ఈ సినిమాలో ట్విస్టులు అదిరిపోతాయి అని చిత్ర యూనిట్ చెప్పుకు వచ్చిన సంగతి తెలిసిందే. అందుకు తగ్గట్టే ఈ సినిమాలో కావాల్సినన్ని ట్విస్టులు పెట్టారు. కానీ మధ్యలో దర్శకుడు మారడం వలన ఏమో తెలియదు కానీ.. కొన్ని దగ్గర్ల మాత్రం సినిమాని అనుకున్న రేంజ్ లో తీయలేకపోయారు. అయితే మొత్తం పైన చిత్రం థ్రిల్లర్ కథలు నచ్చే ప్రేక్షకులకు వన్ టైం వాచబుల్ మూవీ గా నిలవనుంది. కాగా బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ చిత్రం ఎలా నడుస్తుందో తెలియాలి అంతే మాత్రం మరి కొద్ది రోజులు వేచి చూడాలి.

ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఈ చిత్రం సీక్వెల్ గురించి వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. స్వతంత్రం ముందు సుభాష్ చంద్రబోస్, అతని అనుచరులని బ్రిటిష్ వాళ్ళు పట్టుకోవడానికి చేసే ప్రయత్నాలు, మరో వైపు హత్య కేసు ఛేదించడం.. ఇలా డెవిల్ లో ఎన్నో ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఉన్నాయి. కాగా డెవిల్  చిత్రయూనిట్ నిన్న సక్సెస్ సెలబ్రేషన్స్ చేసుకుంది. ఇక ఆ సెలబ్రేషన్స్ లోనే అనగా ఈ సినిమా విడుదలైన రోజే ఈ చిత్రం సీక్వెల్ ప్రకటించారు కళ్యాణ్ రామ్.

కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ.. డెవిల్ 2 సినిమా కచ్చితంగా ఉంటుంది అని చెప్పుకొచ్చాడు. అంతేకాదు ఈ సినిమా డెవిల్ చిత్రం తీసిన  నీటితోనే ఉంటుందని... 2024లో డెవిల్ 2 సినిమా మొదలుపెట్టి 2025లో రిలీజ్ చేస్తాం అని క్లారిటీ ఇచ్చారు.

 ‘ఈ సినిమా షూట్ మొదలైన 10 రోజులకే శ్రీకాంత్ పార్ట్ 2 కథ కూడా నాకు చెప్పుకొచ్చారు.. సీక్రెట్ సర్వీస్ తో కథని ముందుకి తీసుకెళ్లొచ్చు. ఆ లైన్ నాకు బాగా నచ్చింది. డెవిల్ 2 సినిమా 1940 సమయంలో ఉంటుంది. అలాగే 2000 సమయంలో కూడా ఉంటుంది. రెండు కాలాలకు సంబంధించి కథ సాగుతుంది’ అని ఇంట్రెస్టింగ్ విషయాలు బయట పెట్టారు కళ్యాణ్ రామ్.

Also Read: Kalki 2898 AD :కల్కి లో ఇండియా ఫ్యూచర్ చూస్తారు.. ట్రైలర్ విడుదల అప్పుడే: నాగ్ అశ్విన్

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News