Kalki 2898 AD: కల్కి మూవీ ఖాతాలో మరో రికార్డు.. రిలీజ్ కు ముందే ప్రభాస్ రికార్డుల జాతర..

Kalki 2898 AD: రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ ‘కల్కి 2898 AD’. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 27న విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా విడుదలకు ముందే పలు రికార్డులను బ్రేక్ చేస్తూ దూసుకెళుతోంది.  

Written by - TA Kiran Kumar | Last Updated : Jun 18, 2024, 12:06 PM IST
Kalki 2898 AD: కల్కి మూవీ ఖాతాలో మరో రికార్డు.. రిలీజ్ కు ముందే ప్రభాస్ రికార్డుల జాతర..

Kalki 2898 AD: బాహుబలి సిరీస్ తర్వాత ప్రభాస్ గతేడాది ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘సలార్ పార్ట్ -1 సీజ్ ఫైర్’ సినిమాతో మళ్లీ బ్యాక్ బౌన్స్ అయ్యారు. ఈ సినిమా మొత్తంగా రూ. 700 కోట్ల గ్రాస్ వసూళ్లతో దుమ్ము రేపింది. ఈ సినిమా తర్వాత ప్రభాస్.. ‘కల్కి 2898 AD’ మూవీతో పలకరించబోతన్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన టీజర్, ఓ ట్రైలర్, పాట మాత్రమే రిలీజయ్యాయి. కానీ ఈ సినిమా యూఎస్ లో అపుడే అడ్వాన్స్ బుకింగ్ రూపంలో వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ఇప్పటికే ఫాస్టెస్ట్ 1 మిలియన్ తో పాటు 1.5 $ యూఎస్ డాలర్స్ ను కలెక్ట్ చేసిన ఈ సినిమా రిలీజ్ కు 10 రోజుల ముందే మరో రికార్డును బ్రేక్ చేసింది. తాజాగా ఈ సినిమా ప్రీ సేల్స్ లో 2$ యూఎస్ మిలియన్ డాలర్స్ కలెక్ట్ చేసి మరో రికార్డును క్రియేట్ చేసింది.

అసలు పెద్దగా ప్రమోషన్స్ గట్రా చేయని కల్కి సినిమాకు ఈ రేంజ్ వసూళ్లను రాబట్టడం చూసి ట్రేడ్ వర్గాలు ఔరా అంటున్నాయి. అంతేకాదు రిలీజ్ వరకు ఈ సినిమా ప్రీ సేల్స్ విషయంలో 3 మిలియన్ యూఎస్ డాలర్స్ కలెక్ట్ చేసినా పెద్ద ఆశ్యర్యపోవాల్సిన పనిలేదు. ఇప్పటికే తెలుగు సహా పలు భాషల్లో ఈ సినిమాను ప్రమోట్ చేయకుండానే  ఈ రేంజ్ వసూళ్లు వస్తున్నాయి. ఒకవేళ టాక్ బాగుంటే మాత్రం కల్కి వసూళ్లు ఆకాశమే హద్దుగా సాగుతుందనే చెప్పాలి.

ప్రస్తుతం కల్కి చిత్ర యూనిట్ ముందుగా ముంబైలో ఓ ఈవెంట్ ను ప్లాన్ చేసింది. దాంతో పాటు చెన్నైలో కూడా ఓ పెద్ద ఈవెంట్ ను ఆర్గనైజ్ చేయబోతుంది. ఆ తర్వాత హైదరాబాద్, విశాఖ పట్నంలలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారు. అవి తప్పితే..మీడియా ఇండర్వ్యూలు గట్రా ఏమి ప్లాన్ చేయలేదు. మొత్తంగా ప్రభాస్ స్టార్ డమ్ తోనే ఈ సినిమాకు ఈ రేంజ్ వసూళ్లు వచ్చి పడుతున్నాయి. ఒకవేళ పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే ఈ సినిమా ఈజీగా వెయ్యి కోట్ల టార్గెట్ ను రీచ్ కావడం పెద్ద విషయం కాదంటన్నారు ట్రేడ్ పండితులు.

Read more: Video viral: వామ్మో... ప్రైవేటు పార్ట్ ను కరిచిన పాము.. షాకింగ్ వీడియో వైరల్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News