NTR - Ram Charan: ఎన్టీఆర్, రామ్ చరణ్ లకు అరుదైన గౌరవం.. టాలీవుడ్ లో మరెవెరూ దరిదాపుల్లో కూడా లేకుండా!

Junior NTR and Ram Charan in Top 10 Eastern Eye’s Asian celebrities: అనూహ్యంగా రామ్ చరణ్ తేజ, జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరికీ మరో అరుదైన గౌరవం దక్కింది, యూకే సౌత్ సెలబ్రిటీ లిస్టులో వీరిద్దరూ టాప్ ప్లేసు సంపాదించారు.

Written by - Chaganti Bhargav | Last Updated : Dec 15, 2022, 07:44 PM IST
NTR - Ram Charan: ఎన్టీఆర్, రామ్ చరణ్ లకు అరుదైన గౌరవం.. టాలీవుడ్ లో మరెవెరూ దరిదాపుల్లో కూడా లేకుండా!

Junior NTR and Ram Charan in Top 10 Eastern Eye’s Asian celebrities: జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ తేజ్ ఇద్దరు ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ గుర్తింపు దక్కించుకుంటున్నారు. ఒక్క ఆర్ఆర్ఆర్ సినిమా మాత్రమే కాదు ఆ సినిమాలో నటించిన మిగతా స్టార్లందరూ కూడా ఇంటర్నేషనల్ లెవెల్ లో అందరి మన్ననలు పొందుతున్న పరిస్థితి కనిపిస్తోంది. నిజానికి ఆర్ఆర్ఆర్ సినిమా విడుదలైన సమయంలో పాన్ ఇండియాలో రచ్చ రచ్చ లేపింది.

తర్వాత నెట్ఫ్లిక్స్ లో ఎప్పుడైతే విడుదలైందో అది అంతర్జాతీయ స్థాయికి చేరి అందరి చేత మన్ననలు అందుకుంటుంది. ముఖ్యంగా హాలీవుడ్ ప్రముఖులందరూ సినిమాని మెచ్చుకోవడమే కాక ఎన్టీఆర్, రామ్ చరణ్ నటన అద్భుతం అంటూ కొనియాడుతున్నారు. ఇక ఇటీవలే ఈ సినిమా గోల్డెన్ క్లోబ్ అవార్డుకు కూడా నామినేట్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు అనూహ్యంగా రామ్ చరణ్ తేజ, జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరికీ మరో అరుదైన గౌరవం దక్కింది.

అది ఏమిటంటే యూకే సౌత్ సెలబ్రిటీ లిస్టులో వీరిద్దరూ స్థానం సంపాదించారు. ఇద్దరు ఆ లిస్టులో స్థానం సంపాదించడమే కాదు టాప్ ప్లేస్ లు సంపాదించడం గమనార్హం. యూకే బేస్డ్ ఈస్టర్న్ న్యూస్ పేపర్ అనే ఒక న్యూస్ పేపర్ ప్రచురించే ఈ లిస్టులో ఈ ఇద్దరు సెలబ్రిటీలు ఏషియన్ సెలబ్రిటీల జాబితాలో టాప్ ప్లేస్ సంపాదించారు. ఇక వీరు మాత్రమే కాకుండా ఈ సినిమాలో నటించిన అలియా భట్ కూడా ఈ లిస్టులో స్థానం సంపాదించింది.

ఆమె ఈ లిస్టులో నాలుగవ స్థానం దక్కించుకుంది. ఇక ఇదే లిస్టులో కన్నడ స్టార్ హీరో యష్ ఆరవ స్థానం సంపాదించగా అల్లు అర్జున్ పదవ స్థానం సంపాదించుకున్నాడు. ఇక మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ లిస్టులో బిగ్ బాస్ ఫ్రేమ్ తేజస్వి ప్రకాష్ కూడా ఎంట్రీ ఇచ్చింది.

ఇక అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప సినిమాతో సూపర్ హిట్ అందుకుని దానికి సీక్వెల్ తెరకెక్కించే పనిలో బిజీగా ఉన్నారు. రామ్ చరణ్ తేజ తన రామ్ చరణ్ 15వ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతుంటే జూనియర్ ఎన్టీఆర్ మాత్రం కొరటాల శివ సినిమా షూటింగ్ పట్టాలెక్కించడంలో ఎందుకో మీనమేషాలు లెక్కిస్తున్నారు. మొత్తం మీద ఈ ఇద్దరు సెలబ్రిటీలకు మంచి గుర్తింపు దక్కడం అనేది గర్వించాల్సిన విషయమే అంటున్నారు సినీ విమర్శకులు.

Also Read: Dhamaka Telugu Trailer: దుమ్ము రేపిన మాస్ 'ధమాకా'.. ఆ హీరోలు అందరికీ కౌంటరేసిన రవితేజ!

Also Read: Nara Lokesh- Yash: పాన్ ఇండియా స్టార్ యష్ తో నారా లోకేష్ భేటీ.. అందుకేనా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

 
 

Trending News