Jr Ntr movie: జూనియర్ ఎన్టీఆర్ 30వ చిత్రం కొరటాల శివతోనే..విడుదల తేదీ కూడా ఖరారు

Jr Ntr movie: ఆర్ఆర్ఆర్. మచ్ ఎవైటెడ్ మూవీ ఫర్ జూనియర్ ఎన్టీఆర్. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత జూనియర్ ఎన్టీఆర్ సినిమా ఏంటనేది ఖరారైంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన నటించేది ఎవరంటే..  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Apr 14, 2021, 01:47 PM IST
Jr Ntr movie: జూనియర్ ఎన్టీఆర్ 30వ చిత్రం కొరటాల శివతోనే..విడుదల తేదీ కూడా ఖరారు

Jr Ntr movie: ఆర్ఆర్ఆర్. మచ్ ఎవైటెడ్ మూవీ ఫర్ జూనియర్ ఎన్టీఆర్. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత జూనియర్ ఎన్టీఆర్ సినిమా ఏంటనేది ఖరారైంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన నటించేది ఎవరంటే..

తెలుగు సినీ పరిశ్రమలో(Tollywood) జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ నటిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా(RRR Movie)పై అందరి ఆశలు నెలకొన్నాయి.రాజమౌళి నిర్మిస్తున్న ఈ సినిమాపై చాలా అంచనాలున్నాయి. ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత జూనియర్ ఎన్టీఆర్ పరిస్థితి ఏంటి..మరో సినిమా సైన్ చేశారా లేదా అనేది ఆసక్తిగా  మారింది. ఇప్పుడీ ప్రశ్నకు సమాధానం ఖరారైంది. కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ సినిమా ఉంటుందని ఉగాది సందర్భంగా అధికారిక ప్రకటన వెలువడింది. ఎన్టీఆర్ 30వ చిత్రం( Jr Ntr 30th Movie) కొరటాల శివ ( Koratala siva)దర్శకత్వంలో రానుంది. యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై ఈ చిత్రం నిర్మాణం జరుపుకోనుంది. సినిమా సెట్స్‌పై వెళ్లకుండానే విడుదల తేదీ ప్రకటించేశారు. 2022 అంటే వచ్చే యేడాది ఏప్రిల్ 29న ఈ సినిమా విడుదలవుతుందట.

గతంలో జూనియర్ ఎన్టీఆర్( Junior Ntr), కొరటాల శివ కాంబినేషన్ మూవీ జనతా గ్యారేజ్( Janata Garrage) సూపర్ హిట్‌గా నిలిచింది. దాంతో కొత్త సినిమాపై కూడా భారీ అంచనాలున్నాయి. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ భామ కియారా అద్వానీ ( Kiyara Advani) నటించనుంది. ఇప్పటికీ కియారా అద్వానీ భరత్ అనే నేను, వినయ విధేయ రామ చిత్రాల్లో నటించి..అభిమానుల్ని సంపాదించుకుంది. 

Also read: Malaika Arora Engagement: మలైకా అరోరా, అర్జున్ కపూర్ ఎంగేజ్‌మెంట్ జరిగిందా, హాట్ టాపిక్‌గా మారిన డైమండ్ రింగ్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News