Pushpa Pre Release Event Issue: పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్‌పై పోలీసుల ఆగ్రహం, కేసు నమోదు

Pushpa Pre Release Event Issue: అల్లు అర్జున్ అప్ కమింగ్ మూవీ పుష్ప వివాదంలో చిక్కుకుంది. సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌పై పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ..కేసు నమోదు చేశారు. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Dec 13, 2021, 02:28 PM IST
Pushpa Pre Release Event Issue: పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్‌పై పోలీసుల ఆగ్రహం, కేసు నమోదు

Pushpa Pre Release Event Issue: అల్లు అర్జున్ అప్ కమింగ్ మూవీ పుష్ప వివాదంలో చిక్కుకుంది. సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌పై పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ..కేసు నమోదు చేశారు. 

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్నా నటించిన పుష్ప సినిమా త్వరలో విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమా పాటలు ఒక్కొక్కటిగా విడుదలై వైరల్ అయ్యాయి. తాజాగా నిన్న జరిగిన పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్ వివాదానికి దారి తీసింది. ఈ ఈవెంట్‌పై జూబ్లీహిల్స్ పోలీసులు మండిపడుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్వహించారంటున్నారు. 5 వేల పాస్‌లకు అనుమతి తీసుకుని ఇంకా ఎక్కువ జారీ చేశారని నిర్ధారించిన పోలీసులు శ్రేయాస్ క్రియేషన్స్ మీడియాతో పాటు ఈవెంట్ ఆర్గనైజర్‌పై కేసు నమోదు చేశారు. ఈవెంట్ ఆర్గనైజర్ కిశోర్‌పై ఐపీసీ సెక్షన్ 143, 341, 290 కింద కేసు నమోదు చేశారు. 

నిన్న సాయంత్రం యూసఫ్ గూడలోని పోలీసు గ్రౌండ్స్‌లో పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్(Pushpa Pre Release Event)అత్యంత ఘనంగా జరిగింది. భారీ అంచనాలున్న సినిమా కావడంతో పెద్దఎత్తున జనం తరలివచ్చారు. బ్యారికేడ్లు దాటుకుని జనం రావడంతో తొక్కిసలాట జరిగింది. ఈ నేపధ్యంలో ఈవెంట్ మేనేజర్స్ ..జనాన్ని అదుపు చేసే ప్రయత్నం చేసినా ప్రయోజనం లేకపోయింది. తొక్కిసలాట నేపధ్యంల పోలీసులు రంగప్రవేశం చేశారు. ఈవెంట్‌కు ఎంతమంది వచ్చారనేది ఆరా తీసినప్పుడు పాస్‌ల సంగతి బయటపడింది.ఈవెంట్ నిర్వాహకులపై కేసు నమోదు చేశారు. 

Also read; Harnaaz Sandhu: మోడలింగ్​ నుంచి మిస్​ యూనివర్స్​ వరకు హర్నాజ్ సంధూ ప్రయాణం ఇలా..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News