Jr NTR Response on Name Change: ఎన్టీఆర్ వర్సిటీ పేరు మార్పు.. కర్ర విరక్కుండా పాము చావకుండా జూ.ఎన్టీఆర్ స్పందన.. మండిపడుతున్న టీడీపీ ఫాన్స్!

Jr NTR Response on Vijayawada DR NTR Health Univeristy Name Change: విజయవాడలో ఉన్న మెడికల్ హెల్త్ యూనివర్సిటీకి డాక్టర్ ఎన్టీఆర్ అంటూ ఇప్పటివరకు ఉన్న పేరు తొలగించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధినేత వైఎస్ జగన్ తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరు పెట్టడం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇదే విషయం మీద తాజాగా జూనియర్ ఎన్టీఆర్ స్పందించారు,

Written by - Chaganti Bhargav | Last Updated : Sep 22, 2022, 03:19 PM IST
Jr NTR Response on Name Change: ఎన్టీఆర్ వర్సిటీ పేరు మార్పు.. కర్ర విరక్కుండా పాము చావకుండా జూ.ఎన్టీఆర్ స్పందన.. మండిపడుతున్న టీడీపీ ఫాన్స్!

Jr NTR Response on Vijayawada DR NTR Health Univeristy Name Change: ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడలో ఉన్న మెడికల్ హెల్త్ యూనివర్సిటీకి డాక్టర్ ఎన్టీఆర్ అంటూ ఇప్పటివరకు ఉన్న పేరు తొలగించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధినేత వైఎస్ జగన్ తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరు పెట్టడం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇదే విషయం మీద తాజాగా జూనియర్ ఎన్టీఆర్ స్పందించారు, ‘’NTR, YSR ఇద్దరూ విశేష ప్రజాదరణ సంపాదించిన గొప్ప నాయకులు.

ఈ రకంగా ఒకరి పేరు తీసి ఒకరి పేరు పెట్టడం ద్వారా తెచ్చే గౌరవం YSR స్థాయిని పెంచదు, NTR స్థాయిని తగ్గించదు. విశ్వవిద్యాలయానికి పేరు మార్చడం ద్వారా NTR సంపాదించుకున్న కీర్తిని, తెలుగు జాతి చరిత్రలో వారి స్థాయిని, తెలుగు ప్రజల హృదయాలలో ఉన్న వారి జ్ఞాపకాలను చెరిపివేయలేరు.’’ అంటూ ఆయన ట్వీట్ చేశారు. ఆయన ట్వీట్ మీద భిన్న స్పందనలు వ్యక్తం అవుతున్నాయి.

అయితే జూనియర్ ఎన్టీఆర్ ఈ విషయం మీద తెలుగుదేశాన్ని డిఫెండ్ చేస్తూ వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తారని, విమర్శల వర్షం కురిపిస్తారని టీడీపీ అభిమానులు భావించారు. కానీ ఎన్టీఆర్ అటు వైసీపీ అభిమానులను నొప్పించకుండా పేరు మార్చినంత మాత్రాన ఆయన స్థాయి పెరగదు,  ఎన్టీఆర్ స్థాయి తరగదు అనే విధంగా ట్వీట్ చేయడంతో టీడీపీ అభిమానులు ఎన్ఠీఆర్ వైఖరి పై మండి పడుతున్నారు. నిజానికి దీనికి సంబంధించి ఎన్టీఆర్ కుమారుడు నందమూరి రామకృష్ణ కూడా స్పందించారు.

హెల్త్ యూనివర్సిటీ పేరు తొలగించడం నేను తీవ్రంగా ఖండిస్తున్నామని, అదే పేరు కొనసాగించాలని రామకృష్ణ ఒక వీడియో విడుదల చేశారు. ఈ యూనివర్సిటీకి మూల కారకుడు వ్యవస్థాపకుడు మన అన్న నందమూరి స్వర్గీయ తారక రామారావు గారని, అన్ని మెడికల్ కాలేజీలు ఒకే పాలసీతో నడవాలనేది వారి భావన అని ఆయన చెప్పుకొచ్చారు. అదే ఉద్దేశంతో 1986వ సంవత్సరంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు స్థాపించిన మెడికల్ హెల్త్ యూనివర్సిటీని అందరూ, అన్ని రాజకీయ పార్టీలు, ఆయా పార్టీల నాయకులు, వారి వారి మద్దతు ఇచ్చి హర్షం వ్యక్తం చేశారని చెప్పుకొచ్చారు.

అది స్థాపించిన పదేళ్లకు అంటే 96 లో అన్నగారు స్వర్గస్తులయ్యారని అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు దానిని ఎన్టీఆర్ స్థాపించారు కాబట్టి ఎన్టీఆర్ అనే పదాన్ని సమకూర్చి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీగా నామకరణం చేశారని ఆయన చెప్పుకొచ్చారు. రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఎన్టీఆర్ మీద ఉన్న అభిమానంతో దాన్ని డాక్టర్ అనే పదాన్ని యాడ్ చేసి డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీగా నామకరణం చేశారని ఆయన గుర్తు చేశారు.

అదే పేరును ఇప్పుడు ఆయన కుమారుడు వైఎస్ జగన్ మార్చడం దురదృష్టకరమని రామకృష్ణ చెప్పుకొచ్చారు. ఎన్టీఆర్ పేరు తొలగించడం అంటే యావత్ తెలుగు జాతిని అవమానించినట్లేనని రామకృష్ణ వీడియోలో పేర్కొన్నారు. అన్ని పార్టీలకు, ప్రాంతాలకు, కులాలకు చెందిన మహా నాయకుడు యుగపురుషుడు ఎన్టీఆర్ అని మన తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని కాపాడి పునర్జింపజేసిన మహానాయకుడు, తెలుగు ముద్దుల బిడ్డ మన ఎన్టీఆర్ పేరును మెడికల్ హెల్త్ సైన్సెస్ యూనివర్సిటీగా కొనసాగించాలని రామకృష్ణ డిమాండ్ చేశారు. ఇదే విషయం మీద నందమూరి బాలకృష్ణ కూడా స్పందించారు ఇలా పేరు మార్చడం కరెక్ట్ కాదు అని డాక్టర్ ఎన్టీఆర్ పేరును కొనసాగించాలని ఆయన డిమాండ్ చేశారు.

Also Read:  Bandla Ganesh - Sivaji Raja Donation: ఎఫ్ఎన్సీసీ ఎన్నికల్లో ఆసక్తికర పరిణామం.. ఐదు లక్షల 16 వేల బండ్ల సాయం.. బరి నుంచి వైదొలిగిన శివాజీరాజా

Also Read: 44 Years Of Undisputed Megastar:44 ఏళ్ల ప్రాణం ఖరీదు.. పాలేరు వేషంలో షూట్.. హీరోయిన్ ను అతుక్కుపోయిన చిరు.. మొదటి సినిమాకే బలుపంటూ కామెంట్స్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

 

Trending News