Jr NTR Remunaration: రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ మూవీ తర్వాత ఎన్టీఆర్ ఇమేజ్ గ్లోబల్ లెవల్ కు పెరిగింది. ముఖ్యంగా ఈ సినిమాలో ఎన్టీఆర్ నటనకు మంచి మార్కులే పడ్డాయి. కొమరం భీమ్ గా తారక్ నటనకు ఫిదా కానీ వారు ఎవరు లేరు. ఈ సినిమా కోసం దాదాపు రూ. 40 కోట్ల వరకు పారితోషికం తీసుకున్న ఎన్టీఆర్.. ‘దేవర’కోసం భారీ ఎత్తున పారితోషికం తీసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా కోసం దాదాపు ఎన్టీఆర్ దాదాపు రూ. 90 కోట్ల నుంచి రూ. 100 కోట్ల వరకు తీసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. మన దేశంలో ప్రభాస్, విజయ్ తరహాలోనే ఎన్టీఆర్ కూడా ఒక్కో సినిమా కోసం దాదాపు రూ. 100 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకోబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి.
హిందీలో హృతిక్ రోషన్ తో చేస్తోన్న భారీ మల్టీస్టారర్ మూవీ ‘వార్ 2’ కోసం దాదాపు రూ. 100 కోట్ల వరకు భారీ పారితోషికం తీసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇక ‘దేవవ’ కోసం ఎన్టీఆర్ ముంబై, చెన్నై, బెంగళూరుల్లో జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఇక మన దేశంలోనే పాపులర్ అయిన ‘కపిల్ శర్మ’ షో లో పాల్గొన్నాడు. దానికి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. బాలీవుడ్ లో ఎంత పెద్ద తోపు హీరో అయిన కపిల్ శర్మ షోలో పాల్గొనాల్సిందే. ఆ షోకు వెళితే.. ‘దేవర’కు మంచి మైలేజ్ వస్తుంది.
మరోవైపు చెన్నై ప్రీ రిలీజ్ ఈవెంట్ లో వెట్రిమారన్ తో సినిమా చేయాలని ఉంది అని చెప్పి అక్కడ ప్రజల మనసు దోచుకున్నాడు. మరి వెట్రిమారన్ వంటి డిఫరెంట్ డైరెక్టర్ దర్శకత్వంలో నిజంగానే ఎన్టీఆర్ నటిస్తాడా అనేది చూడాలి. ఆ సంగతి పక్కన పెడితే.. ఈ సినిమా రిలీజ్ కు ముందే పలు రికార్డులను బ్రేక్ చేస్తోంది. ఇప్పటికే నార్త్ అమెరికాలో ప్రీ రిలీజ్ సేల్స్ లో $2 మిలియన్ యూఎస్ డాలర్స్ కలెక్ట్ చేసి ఔరా అనిపించింది. మరోవైపు హిందీలో ఈ సినిమా రూ.35 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. అక్కడ హిట్ అనిపించుకోవాలంటే దాదాపు రూ. 70 కోట్ల నెట్ వసూళ్లను రాబట్టాలి.
మొత్తంగా ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ కు బాలీవుడ్ లో తొలి లిట్మస్ టెస్ట్. అందుకే ఈ సినిమా కోసం బాలీవుడ్ హీరోయిన్, బాలీవుడ్ విలన్ ను తీసుకున్నాడు. ఆ తర్వాత ఎన్టీఆర్ డైరెక్ట్ గా పలు బాలీవుడ్ చిత్రాల్లో నటిస్తున్నాడు. మొత్తంగా ‘దేవర’ సినిమాతో తారక్ బాలీవుడ్ లో పాగా వేస్తాడా లేదా అనేది చూడాలి. ఏది ఏమైనా ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ ఇమేజ్ పెరగడంతో ఆయన రెమ్యునరేషన్ రేంజ్ కూడా పెరిగింది. మొత్తంగా తెలుగు నుంచి రూ. 100 కోట్ల రెమ్యునరేషన్ తీసుకునే రేంజ్ కు దిగడం మాములు విషయం కాదు.
ఇదీ చదవండి: ‘భోళా శంకర్’సహా చిరు కెరీర్ లో రాడ్ రంబోలా మూవీస్ ఇవే..
ఇదీ చదవండి: పవన్ కళ్యాణ్ మూడో భార్య అన్నా లెజ్నెవా ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ తెలుసా..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.