RRR movie release date: ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ రిలీజ్‌ డేట్ ఫిక్స్..వచ్చే ఏడాది రానున్న మూవీ

RRR movie new release date: రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌ ప్రధాన పాత్రల్లో రాజమౌళి తెరకెక్కిస్తోన్న ఆర్‌ఆర్‌ఆర్‌ (RRR) (రౌద్రం రణం రుధిరం) మూవీ రిలీజ్‌ డేట్ ఫిక్స్ చేసింది మూవీ యూనిట్. కొవిడ్‌ కారణంగా ఈ సినిమా విడుదల వాయిదా పడుతూ వస్తోంది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 2, 2021, 07:10 PM IST
  • ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ రిలీజ్‌ డేట్ విషయంలో క్లారిటీ
  • రిలీజ్‌ డేట్ ఫిక్స్ చేసిన మూవీ యూనిట్
  • సంక్రాంతి బరిలో నిలవనున్న ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ
RRR movie release date: ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ రిలీజ్‌ డేట్ ఫిక్స్..వచ్చే ఏడాది రానున్న మూవీ

Jr NTR, Ram Charans RRR movie new release date announced: ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ విషయంలో ఒక క్లారిటీ వచ్చేసింది. పరిస్థితులు బాగుంటే ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ ఇప్పటికే విడుదలై ఉండేది. కానీ ఈ క్రేజీ మల్టీస్టారర్‌ (multi starrer) చిత్రానికి అడుగడుగునా బ్రేకులుపడ్డాయి. రామ్‌చరణ్‌, (Ram Charan) జూ.ఎన్టీఆర్‌ (Jr NTR) ప్రధాన పాత్రల్లో రాజమౌళి (SS Rajamouli) తెరకెక్కిస్తోన్న ఆర్‌ఆర్‌ఆర్‌ (RRR) (రౌద్రం రణం రుధిరం) మూవీ రిలీజ్‌ డేట్ ఫిక్స్ చేసింది మూవీ యూనిట్. కొవిడ్‌ కారణంగా ఈ సినిమా విడుదల వాయిదా పడుతూ వస్తోంది. మొదట ఈ వేసవిలో ఆర్‌ఆర్‌ఆర్‌ (RRR) మూవీ విడుదల అవుతుంది అనుకున్నారు అంతా. అయితేకరోనా, లాక్‌డౌన్‌ కారణంగా ఈ అక్టోబరు 13కి ఆర్‌ఆర్‌ఆర్‌ (RRR) విడుదల వాయిదా పడింది.

చాలాసార్లు నిరాశకు గురికావాల్సి వచ్చింది

అయితే పరిస్థితులు ఇంకా చక్కబడకపోవడం, ఆర్‌ఆర్‌ఆర్‌ (RRR) నిర్మాణానంతర కార్యక్రమాలు ఇంకా పూర్తి కాకపోవడంతో ఈ మూవీ విడుదల వాయిదా వేసింది చిత్ర బృందం. దీంతో ఫ్యాన్స్ చాలాసార్లు నిరాశకు గురికావాల్సి వచ్చింది. అయితే ఆర్‌ఆర్‌ఆర్‌ (RRR) మూవీ రిలీజ్‌ డేట్ ఎప్పుడు ఫిక్స్ చేస్తారా అని ఎదురుచూస్తున్న అభిమానులకు శుభవార్తని వినిపించింది ఆర్‌ఆర్‌ఆర్‌ యూనిట్. జనవరి 7, 2022న ఆర్‌ఆర్‌ఆర్‌ (RRR) మూవీ విడుదల చేస్తున్నట్టు ప్రకటించింది.

 అలియాభట్‌ తెలుగులోకి ఎంట్రీ 

పాన్‌ ఇండియన్‌ స్థాయిలో రూపొందుతోన్న ఈ చిత్రంలో రామ్‌చరణ్‌.. అల్లూరి సీతారామరాజుగా, (alluri sitarama raju) ఎన్టీఆర్‌ కొమురం భీమ్‌గా (komaram bheem) కనిపించనున్న విషయం తెలిసిందే. బాలీవుడ్‌ బ్యూటీ అలియాభట్‌ ఈ సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఎన్టీఆర్‌కి జోడీగా హాలీవుడ్‌ భామ ఒలీవియా మోరీస్ (olivia morris) నటిస్తున్నారు. ఇక అలిసన్‌ డూడీ, రే స్టీవెన్‌ సన్‌, అజయ్‌ దేవ్‌గణ్‌, శ్రియ కీలకపాత్రలు పోషించారు ఈ మూవీలో. డీవీవీ దానయ్య నిర్మాణంలో వస్తోన్న ఆర్‌ఆర్‌ఆర్‌ (RRR) మూవీ ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. మొత్తానికి వచ్చే ఏడాది జనవరి 7న ఆర్‌ఆర్‌ఆర్‌ (RRR) మూవీని మనం చూడొచ్చు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News