RRR movie shooting: ఆర్ఆర్ఆర్ మూవీ షూటింగ్ ముగించుకుని వెళ్తున్న Jr Ntr, Ram Charan

Jr Ntr, Ram Charan leaving RRR movie set: ఆర్ఆర్ఆర్ సినిమాలో చివరి షాట్ ముగించుకున్న తారక్, చెర్రీ ఇద్దరూ సినిమా షూటింగ్ (RRR movie shooting) జరుగుతున్న లొకేషన్ సెట్స్ నుంచి తమ తమ కార్లలో వేగంగా వెళ్లిపోతున్న దృశ్యాన్ని ఆర్ఆర్ఆర్ మూవీ యూనిట్ తమ అధికారిక ట్విటర్ హ్యాండిల్ ద్వారా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Aug 26, 2021, 07:48 PM IST
RRR movie shooting: ఆర్ఆర్ఆర్ మూవీ షూటింగ్ ముగించుకుని వెళ్తున్న Jr Ntr, Ram Charan

Jr Ntr, Ram Charan leaving RRR movie set: ఆర్ఆర్ఆర్ మూవీ షూటింగ్‌లో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌లకు సంబంధించిన షూటింగ్ పార్ట్ ముగిసింది. సినిమాలో చివరి షాట్ ముగించుకున్న తారక్, చెర్రీ ఇద్దరూ సినిమా షూటింగ్ (RRR movie shooting) జరుగుతున్న లొకేషన్ సెట్స్ నుంచి తమ తమ కార్లలో వేగంగా వెళ్లిపోతున్న దృశ్యాన్ని ఆర్ఆర్ఆర్ మూవీ యూనిట్ తమ అధికారిక ట్విటర్ హ్యాండిల్ ద్వారా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. 

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌లను టైగర్, చిరుతలతో పోలుస్తూ ఆర్ఆర్ఆర్ మూవీ (RRR movie) నిర్మాతలు ఈ ట్వీట్ పోస్ట్ చేయగా.. ఆర్ఆర్ఆర్ మూవీ విడుదల కోసం ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ ఆ ట్వీట్‌ కింద తమ కామెంట్స్‌ని జోడిస్తున్నారు. 

ఈ ఆప్‌డేట్ వీడియోతో పండగ చేసుకుంటున్న వాళ్లు కొందరైతే.. ఈ సంగతి సరే కానీ ముందుగా ఆర్ఆర్ఆర్ సినిమా విడుదల (RRR movie release date) తేదీ ఎప్పుడో చెప్పండి అంటూ ఇంకొందరు ప్రశ్నిస్తున్నారు. 

Also read : Tollywood Drugs Case: మళ్లీ తెరపైకి డ్రగ్స్ కేసు.. సెలబ్రిటీలను విచారించనున్న ఈడీ

అంతేకాదు... కొంచెం వేగం తగ్గించుకుని సేఫ్‌గా ఇంటికి వెళ్లండి అంటూ తమ అభిమాన హీరోల హితం కోరుతున్న వాళ్లు కూడా లేకపోలేదు. అన్నింటికి మించి హీరోల మోడ్రన్ కార్లు (Jr Ntr's car, Ram Charan's car) సెంటరాఫ్ ఎట్రాక్షన్‌గా నిలిచాయి.

Also read : MAA Elections 2021: 'మా' ఎన్నికల తేదీ వచ్చేసింది..ఎప్పుడో తెలుసా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News