Jr Ntr Help To Kalyanram: టాలీవుడ్ అగ్రహీరోలు తమ సినిమాలకు నిర్మాతల నుంచి భారీగా రెమ్యూనరేషన్ తీసుకునేవారు. కాని ఇటీవల రూట్ మార్చారు టాప్ హీరోలు. సినిమాపై నిర్మాతలకు వచ్చే లాభాల్లో కొంత వాటా తీసుకుంటున్నారు. ఇటీవల కాలంలో వచ్చిన పెద్ద సినిమాల్లో నటించిన హీరోలంతా అలానే చేశారు. అందుకే మహేష్ బాబు, రామ్ చరణ్ లు తాము నటించిన సినిమాలకు ప్రచార సామాగ్రిపై తమ సొంత నిర్మాణ సంస్థ పేర్లు పెట్టుకుంటున్నారు. ఆ సినిమా నిర్మాతతో ముందుగానే చేసుకున్న ఒప్పందంలో భాగంగానే ఇలా చేస్తున్నారు. సినిమా లాభాల్లో వాటా వస్తుంది కాబట్టి.. తమ సొంత సంస్థ పేర్లను వాడేసుకుంటున్నారు. తాజాగా మహేష్ బాబు, రామచరణ్ బాటలోనే కళ్యాణ్ రామ్ సంస్థ సినిమా తెరపై కనిపించబోతంది.
తన అన్న కళ్యాణ్ రామ్ కు ఆర్థికంగా సాయం చేయబోతున్నారు జూనియర్ ఎన్టీఆర్. తన సినిమాలకు ప్రెజెంటర్ గా కళ్యాణ్ రామ్ పేరును చేర్చారు. జూనియర్ రాబోయే రెండు సినిమాలకు ప్రెజెంటర్ గా కళ్యాణ్ రామ్ ఉండబోతున్నారు. గతంలో అల్లు అర్జున్ తన కొన్ని సినిమాలకు సమర్పకుడిగా నాగబాబుని నియమించారు. ఆ విధంగా అల్లు సినిమాకు వచ్చిన లాభాల్లో వాటా తీసుకోవడం ద్వారా నాగబాబు కొంచెం లాభపడ్డారు. ఇప్పుడు కళ్యాణ్ రామ్ #NTR30 మరియు #NTR31 చిత్రాలకు ప్రెజెంటర్‌గా ఉండబోతున్నారు. అల్లు అర్జున్ సినిమాలకు సమర్పకుడిగా నాగబాబు లాభపడినట్లే.. తన సోదరుడికి తారక్ పెద్ద సహాయం చేస్తున్నారనే వార్తలు చక్కర్లు సినిమా వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి.
అయితే జూనియర్ సినిమాల్లో కళ్యాణ్ రామ్ పేరు చేర్చడంపై మరో వెర్షన్ కూడా వినిపిస్తోంది. సినిమాకి లింక్ చేయడానికి మహేష్ బాబు, రామ్ చరణ్‌లకు వారి స్వంత బ్యానర్‌లు ఉన్నాయి.దీంతో సొంత సంస్థల ద్వారా సినిమా నికర లాభాల్లో వాళ్లు వాటాలు తీసుకున్నారు. కాని మహేష్, రామ్ చరణ్ లా జూనియర్ ఎన్టీఆర్‌కి సొంత బ్యానర్ లేదు. ఇప్పుడు తానే సొంత బ్యానర్ ప్రారంభించడం కంటే.. తన అన్నను ప్రొడక్షన్ హౌస్ లో చేర్చుకుని.. అతనికి అండగా నిలవాలని జూనియర్ ఎన్టీఆర్ నిర్ణయించుకున్నారని సమాచారం. మొత్తంగా కొరటాల శివ మరియు ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ రెండు పెద్ద చిత్రాలతో కళ్యాణ్ రామ్ పేరుతో ఎన్టీఆర్ ఆర్ట్స్‌కి ఖచ్చితంగా భారీ పేరు తెచ్చుకోబోతున్నారనే టాక్ వినిపిస్తోంది.
READ ALSO: Revanth Reddy: కొత్త నియోజకవర్గంపై రేవంత్ రెడ్డి ఫోకస్.. పోటీ అక్కడి నుంచేనా?
READ ALSO: Janhvi Kapoor Night Dress: నైట్ డ్రస్సులో డిన్నర్ కు వెళ్లిన జాన్వీ కపూర్.. నెట్టింట ట్రోల్స్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook