NTR 30 Launch: నిరీక్షణలకు సెలవు.. రేపే ఎన్టీఆర్ లాంచ్.. చీఫ్ గెస్ట్ ఎవరంటే?

NTR 30 Launch : ఎన్టీఆర్ 30 సినిమాకి సంబంధించిన లాంచ్ ప్రోగ్రాం రేపు జరుగుతున్నట్లు తెలుస్తోంది. రేపు ఉదయం హైదరాబాదులో ఎనిమిది గంటల 30 నిమిషాలకు ఈ సినిమాకి సంబంధించిన పూజా కార్యక్రమాలు జరగబోతున్నాయి.  

Last Updated : Mar 22, 2023, 08:11 PM IST
NTR 30 Launch: నిరీక్షణలకు సెలవు.. రేపే ఎన్టీఆర్ లాంచ్.. చీఫ్ గెస్ట్ ఎవరంటే?

NTR 30 Launch Muhurtham Time: సుదీర్ఘకాలంగా ఎన్టీఆర్ అభిమానులు ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న విషయం ఏదైనా ఉందా అంటే అది ఎన్టీఆర్ 30 సినిమాకి సంబంధించిన అప్డేట్. ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమా విడుదల ఏడాది పైగానే అవుతున్నా ఇంకా తదుపరి సినిమా ప్రారంభించలేదని బాధ ఆయన అభిమానుల్లో ఉంది. ఈ సినిమా ఎప్పుడు ప్రారంభోత్సవం జరపాలి అని భావిస్తున్న ఏదో ఒక రకంగా అవాంతరాలు ఎదురవుతూ వస్తున్నాయి.

ఇక ఎట్టకేలకు ఈ సినిమాకు సంబంధించిన లాంచ్ ప్రోగ్రాం రేపు జరుగుతున్నట్లు తెలుస్తోంది. రేపు ఉదయం హైదరాబాదులో ఎనిమిది గంటల 30 నిమిషాలకు ఈ సినిమాకి సంబంధించిన పూజా కార్యక్రమాలు ఘనంగా జరగబోతున్నాయి. ఈ కార్యక్రమాలకు తారక్, జాన్వీ కపూర్ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచందర్ వంటి వారు హాజరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ముందు నుంచి ఈ సినిమా పూజా కార్యక్రమాలకు ఒక బాలీవుడ్ హీరో ముఖ్యంగా సైఫ్ అలీఖాన్ హాజరయ్యే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరిగింది.

సైఫ్ అలీఖాన్ ఈ సినిమాలోని విలన్ పాత్రలో నటిస్తున్న నేపథ్యంలో ఆయన కచ్చితంగా ఈ ప్రారంభోత్సవానికి రాబోతున్నారని ప్రచారం జరిగింది. కానీ అది నిజం కాదు అని తెలుస్తోంది. కేవలం సినిమా యూనిట్ మాత్రమే హాజరవుతున్నారని అందులో ఎలాంటి బాలీవుడ్ హీరోలు మాత్రం లేరని తెలుస్తోంది. ఇక ఈ సినిమాని ఒకపక్క కొరటాల శివకు చెందిన స్నేహితుడు మిక్కిలినేని సుధాకర్ యువ సుధా ఆర్ట్స్ మీద మరోపక్క నందమూరి కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ మీద ఆయన బావమరిది కొసరాజు హరికృష్ణ సంయుక్తంగా నేర్పి  నిర్మిస్తున్నారు.

ఈ సినిమాతో సూపర్ హిట్ అందుకోవాలని ఎన్టీఆర్ కొరటాల శివ ఇద్దరు ఎదురుచూస్తున్నారు. ఆచార్య లాంటి డిజాస్టర్ ఇచ్చిన తర్వాత కొరటాల శివ ఈ సినిమా చేస్తుండడం ఎన్టీఆర్ అభిమానులకు కాస్త టెన్షన్ గానే ఉంది. ఎందుకంటే రాజమౌళి సెంటిమెంట్ ఎలాగూ ఉండనే ఉంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ఎలా ఉండబోతోంది అనే అంశం మీద రకరకాల చర్చలు జరుగుతున్నాయి.

Also Read: Blast at Tamilnadu: పండుగ పూట పెను విషాదం.. ఎనిమిది మంది సజీవ దహనం?

Also Read: Modi Htao Desh Bachao : కలకలం రేపుతున్న మోదీ హఠావో దేశ్ బచావో పోస్టర్లు.. ఆరుగురు అరెస్ట్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి  TwitterFacebook

 
 

Trending News