Devara: ఎన్టీఆర్‌ మూవీలో ఆ హీరో భార్య…. ఇంట్రెస్టింగ్ పాత్రలో కనిపించనున్న నటి

Jr NTR: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో వరుస హిట్లతో క్రేజీ ప్రాజెక్ట్ చేస్తూ దూసుకుపోతున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఆర్ఆర్ఆర్ మూవీ సక్సెస్ తర్వాత ఎన్టీఆర్ కు వరల్డ్ వైడ్ ఫ్యాన్ బేస్ ఏర్పడింది. దీంతో అతని నెక్స్ట్ ప్రాజెక్ట్ పై అంచనాలు భారీగా పెరిగాయి. ఈ నేపథ్యంలో కొరటాల శివ డైరెక్షన్లో జూనియర్ ఎన్టీఆర్ చేస్తున్న దేవర మూవీ లో ఓ పాత్ర గురించిన అప్డేట్ వైరల్ అయింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 11, 2024, 08:49 AM IST
Devara: ఎన్టీఆర్‌ మూవీలో ఆ హీరో భార్య…. ఇంట్రెస్టింగ్ పాత్రలో కనిపించనున్న నటి

Marathi Actress in Devara: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మరి ఏ ఇతర హీరోకి సాధ్యం కానీ విధంగా వరుసహిట్లతో రికార్డు పై రికార్డు నమోదు చేస్తున్న హీరో ఎన్టీఆర్. ఇంటర్నేషనల్ రేంజ్ గుర్తింపు తెచ్చుకున్న ఈ స్టార్ హీరో ఖాతాలో క్రేజీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ లైన్ లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఫుల్ జోష్ తో అతను తన మూవీస్ పై కాన్సెంట్రేట్ చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ మోస్ట్ అవైటెడ్ దేవర చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. భారీ బడ్జెట్ తో అంతకంటే భారీ తారాగణంతో తెరకెక్కుతున్న ఈ మూవీకి సంబంధించి ఓ కీలకమైన పాత్ర గురించిన న్యూస్ వైరల్ అయింది.

జూనియర్ ఎన్టీఆర్ హీరోగా.. కొరటాల శివ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న కోస్టల్ బ్యాక్ డ్రాప్ యాక్షన్ మూవీ దేవర. ఈ మూవీ తో బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ టాలీవుడ్ ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయం కాబోతుంది. ఈ మూవీ మొదలైన దగ్గర నుంచే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఫాన్స్ అంచనాలకి ఏ మాత్రం తీసుకొని విధంగా కొరటాల ఎంతో పకడ్బందీగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. రీసెంట్ గా మూవీ నుంచి విడుదలైన గ్లింప్స్ వీడియో చిత్రంపై మరింత హైప్ ను పెంచింది.

ఈ వీడియోలో ఎన్టీఆర్ లుక్స్ కి ఫాన్స్ ఫిదా అయ్యారు. ఎన్టీఆర్ రేంజ్ వైల్డ్ యాక్షన్ సన్నీ వేషాలతో విడుదలైన ఈ వీడియో గూస్ బంప్స్ తెప్పించే విధంగా ఉంది. ఇప్పటికే చిత్రానికి సంబంధించిన షూటింగ్ చాలా వరకు పూర్తయింది. 80 శాతం వరకు టాకీ పార్టీ కూడా కంప్లీట్ చేసినట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 5న సమ్మర్ కి విడుదల కావలసిన ఈ చిత్రం..సెట్స్ లో సైఫ్ అలీ ఖాన్ కి జరిగిన యాక్సిడెంట్ కారణంగా వాయిదా పడే అవకాశం ఉంది. అయితే ఈ విషయం గురించి ఇంకా చిత్ర బృందం నుంచి స్పష్టత రాలేదు.

అయితే క్రేజీ కాంబోలో వస్తున్న ఈ మూవీలో మరొక హీరోయిన్ పాత్ర గురించి టాక్ నడుస్తోంది. మొదట్లో ఈ పాత్ర కోసం మృణాల్ ఠాకూర్, కృతి శెట్టి లాంటి హీరోయిన్ల పేర్లు వినిపించాయి. అయితే ఇప్పటివరకు ఈ పాత్ర ఎవరు చేస్తారు అన్న విషయం పై క్లారిటీ రాలేదు. ఈ నేపథ్యంలో తాజాగా దేవర మూవీలో సెకండ్ హీరోయిన్ గా ఓ సరికొత్త పేరు తెరమీదకు వచ్చింది. ఆ హీరోయిన్ ఎవరో కాదు.. ప్రముఖ గుజరాతి నటి శృతి మరాఠీ. ఈమె భర్త గౌరవ ఘట్నేకర్ ప్రముఖ సీరియల్ హీరో. దేవర మూవీలో శృతి..ఎన్టీఆర్ పక్కన ఓ ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ ద్వారా ఇక టాలీవుడ్ లో కూడా ఈ అమ్మడి పేరు మారుమోగిపోవడం ఖాయం.

Also Read: Transgender: అవమానాలనే మెట్లుగా చేసుకుని ఎదిగిన ట్రాన్స్‌జెండర్‌.. ఈ కథ స్ఫూర్తిదాయకం

Also Read: Bir Billing Dog Loyal: కన్నీటి గాథ.. యజమాని బాడీ వద్ద 48 గంటలు కాపలా కాసిన పెంపుడు కుక్క

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News