Devara Trailer: జనతా గ్యారేజ్ వంటి సూపర్ హిట్ సినిమా తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్.. కొరటాల శివ కాంబినేషన్ లో ప్రేక్షకుల ముందుకి రాబోతున్న సినిమా దేవర. ఈ సినిమాపై ప్రేక్షకులకు భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాకి సంబంధించిన ప్రతి అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.
ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన చుట్టమల్లే, దావుడి పాటలు ఒక రేంజ్ లో హిట్ అయ్యాయి. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ పాటలు మారుమ్రోగి పోతున్నాయి. ఈ సినిమా థియట్రికల్ ట్రైలర్ కోసం ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈనెల 27వ తేదీన భారీ స్థాయిలో సినిమా విడుదల కాబోతోంది.
అయితే తాజా సమాచారం ప్రకారం ఈ చిత్ర బృందం ఈ సినిమా రన్ టైం విషయంలో తర్జనభర్జన అవుతున్నట్లు వార్తలో వినిపిస్తున్నాయి. నిజానికి ఈ సినిమా కథ ఎక్కువగా ఉండడంతో కొరటాల శివ సినిమాని రెండు భాగాలుగా విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. ఇప్పుడు విడుదల అవుతున్నది సినిమాలోని మొదటి భాగం. అయితే ఫైనల్ కట్ తర్వాత సినిమా రామ్ టైం 3 గంటల 10 నిమిషాలు వచ్చిందట.
మరి మూడు గంటలకు పైగా సినిమా అంటే ప్రేక్షకులకు అంత ఆసక్తి ఉండదు అని.. సినిమాలోని కొన్ని అనవసరమైన సన్నివేశాలను తీసేసి రన్ టైంలో రెండు గంటల 50 నిమిషాలకు కుదించబోతున్నట్లు తెలుస్తోంది. దానికోసమే చిత్ర బృందం ఎప్పుడూ కసరత్తులు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే దావుడి పాటను సినిమాలోంచి కట్ చేసి.. రోలింగ్ టైటిల్స్ సమయంలో వేసేశారు. అలా ఒక నాలుగైదు నిమిషాలు నిడివి తగ్గిపోయింది.
పోనీ మొదటి భాగం లోని సన్నివేశాలు కట్ చేసి రెండవ భాగంలో పెట్టాలంటే.. స్టోరీ జంప్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అయినా అసలు కథ ఎక్కువగా ఉంది అంటూ రెండు భాగాలుగా సినిమాని విడుదల చేస్తూ కూడా.. వన్ టైం కూడా ఇంత దాదాపు మూడు గంటలు పెట్టడం ఏంటి అని ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. ఇక ఈ సినిమా ఫైనల్ రన్ టైం గురించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడనుంది.
Also Read: Actor Vinayakan: వినాయక చవితి రోజే 'జైలర్' నటుడు వినాయకన్ అరెస్ట్..
Also Read: AP Floods Damage: ఆంధ్రప్రదేశ్‌కు కోలుకోలేని దెబ్బ.. వరదలతో రూ.6,880 కోట్ల నష్టం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.