RRR Movie: ఆర్‌ఆర్‌ఆర్‌ టికెట్లపై వారి పేర్లు.. గొడవకు దిగిన మెగా, నందమూరి ఫాన్స్! టికెట్స్ చించేస్తూ..!!

Fans fight for RRR Movie Tickets in Kuppam. చిత్తూరు జిల్లా కుప్పంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ అభిమానుల మధ్య సినిమా టికెట్లకు సంబంధించిన పెద్ద గొడవ జరిగింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 25, 2022, 08:03 AM IST
  • ఆర్‌ఆర్‌ఆర్‌ టికెట్లపై వారి పేర్లు
  • గొడవకు దిగిన మెగా, నందమూరి ఫాన్స్
  • థియేటర్స్ వద్ద అభిమానులు హంగామా
RRR Movie: ఆర్‌ఆర్‌ఆర్‌ టికెట్లపై వారి పేర్లు.. గొడవకు దిగిన మెగా, నందమూరి ఫాన్స్! టికెట్స్ చించేస్తూ..!!

Jr NTR and Ram Charan fans beaten for RRR Movie Tickets in Kuppam: దర్శక ధీరుడు ఎస్‌ఎస్ రాజమౌళి దర్శకత్వంలో యంగ్​ టైగర్​ ఎన్టీఆర్​, మెగా పవర్​స్టార్​ రామ్ ​చరణ్​ కలిసి నటించిన భారీ​ మల్టీస్టారర్​ ​చిత్రం 'ఆర్ఆర్​ఆర్​'. రూ. 500కోట్ల భారీ బడ్జెట్​తో తెరకెక్కిన ఈ సినిమా కరోనా లాక్​డౌన్​, టికెట్​ రేట్ల సమస్యల లాంటివి ఎన్నో సవాళ్లను ఎదుర్కొని ఎట్టకేలకు ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అర్ధరాత్రి నుంచే బెన్‌ఫిట్ షోలు పడడంతో ఫాన్స్ సినిమా చూసి ఎంజాయ్ చేస్తున్నారు. థియేటర్స్ వద్ద అభిమానులు హంగామా చేస్తున్నారు. 

అయితే చిత్తూరు జిల్లా కుప్పంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ అభిమానుల మధ్య సినిమా టికెట్లకు సంబంధించిన పెద్ద గొడవ జరిగింది. కుప్పంలో మూడు థియేటర్లలో ఆర్ఆర్​ఆర్​ బెనిఫిట్ షోలకు రామ్ చరణ్, ఎన్టీఆర్ ఫొటోలతో కూడిన 3 వేల టికెట్లు అభిమానులు సిద్ధం చేశారు. ఈ టికెట్లపై కొంతమంది అభిమాన సంఘం నేతల పేర్లు ఉన్నాయి. ఇది చూసిన మరో హీరో అభిమానులు కోపోద్రిక్తులు అయ్యారు. ఆవేశంతో టికెట్లను కొన్నింటిని చించేశారు. దాంతో మెగా, నందమూరి అభిమానుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. 

గొడవ కారణంగా చివరకు మెగా, నందమూరి అభిమానులు కుప్పంలోని థియేటర్లను పంచుకున్నారు. ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోల ఫ్యాన్స్ వేరు వేరుగా థియేటర్లను పంచుకుని సినిమా చూడాలని నిర్ణయించుకున్నారు. ఈ ఘటన గురువారం చోటుచేసుకుంది. కుప్పం బీసీయన్ సినీ కాంప్లెక్స్ వద్ద ఈ గొడవ జరిగినట్టు సమాచారం తెలుస్తోంది. 

ఆర్ఆర్​ఆర్ సినిమాలో సీతారామరాజుగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, కొమరం భీంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ కనిపించారు. ఇద్దరి యోధుల మధ్య ఏదైనా బంధం మొదలయ్యుంటే ఎలా ఉండేది అనే ఒక కల్పిత ఆలోచనపై ఈ సినిమాని తెరకెక్కించారు. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అలియా భట్, హాలీవుడ్ హీరోయిన్ ఒలివియా మోరీస్‌ నటించారు. అజయ్ దేవగణ్, శ్రియా శరన్, సముద్రఖని తదితరులు కీలక పాత్రలలో నటించారు. 

Also Read: RRR Twitter Review: థియేటర్స్ బాక్సులు బద్దలు కాకుంటే ఒట్టు.. ఔట్ ఆఫ్ ది వరల్డ్ రాంపేజ్!! 

Also Read: Alia Bhatt Pakistan Fan: ఆలియా భట్ కోసం థియేటర్ మొత్తం బుక్ చేసిన పాకిస్థానీ యాక్టర్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News