Sooraj Pancholi : జియా ఖాన్ సూసైడ్ కేసు.. ఊపిరి పీల్చుకున్న బాలీవుడ్ నటుడు

jiah khan suicide case బాలీవుడ్ నటి జియా ఖాన్ కేసులో ఇన్నేళ్లకు నటుడు సూరజ్ పంచోలికి మోక్షం కలిగింది. అతను నిర్దోషి అంటూ సీబీఐ కోర్టు తీర్పునిచ్చింది. దీంతో పదేళ్ల తరువాత ఆయనకు ఈ కేసులో క్లీన్ చీట్ వచ్చినట్టు అయింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 28, 2023, 04:25 PM IST
  • జియా ఖాన్ సూసైడ్ కేస్‌లో కదలిక
  • పదేళ్ల తరువాత సూరజ్‌కు మోక్షం
  • జైలు నుంచి విడుదలైన సూరజ్ పంచోలి
Sooraj Pancholi : జియా ఖాన్ సూసైడ్ కేసు.. ఊపిరి పీల్చుకున్న బాలీవుడ్ నటుడు

Sooraj Pancholi Released బాలీవుడ్‌ నటి జియాఖాన్ సూసైడ్ కేసులో సీబీఐ కోర్టు ఇచ్చిన తీర్పు సంచలనంగా మారింది. దాదాపు పదేళ్ల తరువాత ఈ కేసులో తీర్పు వచ్చింది.  జియా ఖాన్‌ సూ కారణమయ్యాడని ఆరోపణలు ఎదుర్కొంటోన్న ప్రముఖ నటుడు ఆదిత్య పంచోలీ కుమారుడు సూరజ్ పంచోలీని నిర్దోషిగా ప్రకటించింది కోర్టు. 2013 జూన్‌లో జియా ఖాన్ తన ఇంట్లో సూసైడ్ చేసుకున్న సంగతి తెలిసిందే.

జియా ఖాన్‌ సూసైడ్ టైంలో ఆరు పేజీల ఆత్మహత్య లేఖ పోలీసుల చేతికి చిక్కింది. జియా ఖాన్ తల్లి కూడా సూరజ్ మీదే అనుమానాలు వ్యక్తం చేసింది. దీంతో ఈ కేసు అంతా కూడా సీబీఐ చేతికి వచ్చింది. పదేళ్ల తరువాత ఇప్పుడు సీబీఐ కోర్టు తీర్పునిచ్చింది. సూరజ్ కారణంగానే జియా ఖాన్‌ సూసైడ్‌కు పాల్పడిందన్న ఆరోపణలకు తగిన సాక్ష్యాధారాలు లేకపోవడంతో ఈ కేసులో సూరజ్ పంచోలిని నిర్దోషిగా ప్రకటించింది కోర్టు.

జియా ఖాన్ మృతికి ప్రియుడు సూరజ్ పంచోలీ కారణమని జియా తల్లి రబియా ఖాన్ ఆరోపించడం.. జియా రాసిన సూసైడ్ లేఖలో విషయాల ఆధారంగా సూరజ్‌ను పోలీసులు అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. 2013 అక్టోబరులో సీబీఐ విచారణ కోరుతూ జియా తల్లి బాంబే హైకోర్టును ఆశ్రయించచడంతో.. ఈ కేసును సీబీఐకి బదిలీ చేశారు.

Also Read: Samantha Birthday : సమంత బర్త్ డే.. ఐ లవ్యూ అంటూ ప్రీతమ్ పోస్ట్‌

ఈ సూసైడ్ కేసులో 22 మంది సాక్ష్యులను  విచారించారు. గత వారం సీబీఐ స్పెషల్ కోర్టులో ఇరుపక్షాల వాదనలు పూర్తవ్వడంతో సూరజ్‌ను నిర్దోషిగా ప్రకటిస్తూ తుది తీర్పును వెలువరించింది. అయితే ఈ తీర్పును జియాఖాన్‌ తల్ పై కోర్టులో అప్పీల్‌ చేసే అవకాశం ఉంది. ఇక జియా ఖాన్ సినీ కెరీర్ ఇలా ఉంది. బిగ్ బీ.. నిశబ్ధ్‌తో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆమిర్‌ ఖాన్‌ గజిని, హౌజ్‌ఫుల్‌ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాల్లో జియా ఖాన్ నటించింది.

Also Read:  Agent Twitter Review : ఏజెంట్ ట్విట్టర్ రివ్యూ.. హిట్ కొట్టిన అయ్యగారు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News