Jayam Ravi - Siren: జయం రవి నుంచి రాబోతున్న మరో సస్పెన్స్ థ్రిల్లర్ 'సైరన్'.. త్వరలో తెలుగులో విడుదల..

Jayam Ravi: జయం రవి.. తమిళంలో తనిఒరువన్, కొమాలి, పొన్నియన్ సెల్వన్ వంటి సినిమాలతో తమిళంలో పాటు తెలుగులో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. తాజాగా ఈయన నుంచి రాబోతున్న మరో సినిమా 'సైరన్'.

Last Updated : Feb 13, 2024, 10:28 AM IST
Jayam Ravi - Siren: జయం రవి నుంచి రాబోతున్న మరో సస్పెన్స్ థ్రిల్లర్ 'సైరన్'.. త్వరలో తెలుగులో విడుదల..

Jayam Ravi: ఇంట గెలిచి రచ్చ గెలవాలి అంటారు. కానీ జయం రవి.. కూడా అదే బాటలో సొంత భాష అయిన తెలుగులో కంటే తమిళంలో అగ్ర హీరోగా రాణిస్తున్నారు. ఈయన తెలుగు నిర్మాత ఎడిటర్ మోహన్ తనయుడుగా హీరోగా అడుగుపెట్టిన ఆ తర్వాత తన కంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నారు.ఈయన 'జయం' 'తని ఒరువన్', కొమాలి, 'పొన్నియన్ సెల్వన్' లాంటి సినిమాలో మంచి ఆదరణ పొందారు జయం రవి. త్వరలో ఈయన 'సైరన్‌' మూవీతో రాబోతున్నారు. ఇదో పూర్తి మాస్ ఎంటర్టేనర్. ఈ సినిమాకు ఆంథోని భాగ్యరాజ్ డైరెక్ట్ చేశారు. ఈ చిత్రాన్ని తెలుగులో గంగ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై మహేశ్వర్ రెడ్డి ఈ సినిమాను ఫిబ్రవరి 23 రిలీజ్ చేస్తున్నారు.

ఈ సినిమాలో జయం రవి సరసన కీర్తి సురేష్, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్లుగా కనిపించనున్నారు. ఈ సినిమా తెలుగు టీజర్ విడుదలై మంచి స్పందన లభిస్తోంది.

చిత్ర నిర్మాత సుజాత విజయకుమార్ మాట్లాడుతూ  'సైరన్' చిత్రాన్ని భారీ బడ్జెట్ తో ఫ్యామిలీ మరియు కమర్షియల్ ఎలిమెంట్స్ తెరకెక్కించిన్నట్టు చెప్పారు.  జయం రవి గతంలో మునుపెన్నడూ కనిపించని లుక్ మరియు పాత్రలో కనిపించనున్నారు. కీర్తి, అనుపమ తొలిసారి రవితో కలిసి నటించారు. ఫిబ్రవరి 23న తెలుగు ప్రేక్షకులు థియేటర్లలో ఈ చిత్రాన్ని ఆదరిస్తారనే ఆశాభావం వ్యక్తం చేశారు.

నటుడు సముద్రఖని మాట్లాడుతూ జయం రవి చాలా ప్రతిభ గల నటుడు. ఇంకో వంద చిత్రాలైన చెయ్యగల నేర్పు అతనిలో ఉంది. మేము ఇదివరకే కలిసి నటించాం. ఈ చిత్రంలో మా పాత్రలు అద్భుతంగా వచ్చాయన్నారు.  అన్ని వర్గాల ప్రేక్షకులకి నచ్చే చిత్రమన్నారు.

సంగీత దర్శకుడు జివి ప్రకాష్ మాట్లాడుతూ "జయం రవి  ఈ చిత్రంలో చాలా చక్కటి నటనను కనబరిచారు. ఈ చిత్రంలోని పాటలు నాకు చాలా స్పెషల్. నాకు ఈ యేడాది ఈ చిత్రంతో ప్రారంభం అవ్వడం చాలా సంతోషంగా ఉందన్నారు.

దర్శకుడు ఆంథోని భాగ్యరాజ్ మాట్లాడుతూ..  ఈ చిత్రం నాకొక కలలా జరిగిపోయింది. ఒక కొత్త దర్శకుడి మొదటి చిత్రం, అదీ పెద్ద హీరో తో అయినప్పుడు, కచ్చితంగా హిట్ అవ్వాలనుకుంటారు. ఆ బాధ్యత జయం రవి తీసుకున్నారు. జివి గారి మెలోడీస్ అంటే నాకు చాలా ఇష్టం. ఈ చిత్రానికి ఆయన దాదాపు 20 ట్యూన్లు ఇచ్చి ఎప్పటికప్పుడు నాలో స్ఫూర్తి నింపుతూనే ఉన్నారు. చిత్రం అద్భుతంగా వచ్చిందన్నారు. ఈ సినిమాతెలుగు ప్రేక్షకులకి నచ్చుతుందున్నారు.

హీరో జయం రవి మాట్లాడుతూ "ఈ చిత్రంలో ఎమోషన్స్ బాగా పండాయి. వాటికి జి.వి తన సంగీతం తో ప్రాణం పోసాడు. భారత్‌లో  ఉన్న అద్బుత సంగీత దర్శకుల్లో జి.వి.ప్రకాష్ ఒకరు. అలాగే ఈ చిత్రంలో ముఖ్యమైన లేడి పోలీస్ ఆఫీసర్ పాత్రలో కీర్తి సురేష్ అద్భుతమైన నటన కనబరిచారు. మా నమ్మకాన్ని తను పూర్తిగా నిలబెట్టిందన్నారు. ఆంథోనీ భాగ్యరాజ్ టాప్ డైరెక్టర్ స్థాయికి ఎదుగుతాడన్నారు. కొత్త దర్శకులతోనే చేస్తున్నందుకు నన్ను చాలా మంది హెచ్చరిస్తూ ఉంటారు.  కానీ ప్రతిభ గల దర్శకుడి కష్టంలోనే చిత్ర విజయం కనిపిస్తుంది నాకు. ఈ చిత్రంలో నేను రెండు విభిన్నమైన పాత్రలు పోషించాను. మా 'సైరన్' తమిళ - తెలుగు ప్రేక్షకులని ఖచ్చితంగా ఆకట్టుకుంటుందన్నారు.

Also Read: KTR Viral Tweet: శభాష్‌ బావ.. అసెంబ్లీలో దుమ్ము దులిపిన హరీశ్ రావుకు కేటీఆర్‌ ప్రశంసలు

Also Read: TN Assembly: తమిళనాడులో 'జనగణమన' రచ్చ.. అసెంబ్లీని బహిష్కరించిన గవర్నర్‌

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News