Jawan Box Office Collection day 5: బాక్సాఫీస్ వద్ద కొనసాగుతున్న షారుక్ దండయాత్ర.. రూ.500 కోట్ల క్లబ్ లో జవాన్..

Jawan Day 5 Box Office Collection: బాలీవుడ్ బాద్​షా షారుక్​ ఖాన్ నటించిన జవాన్ సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది. ఐదో రోజైనా సరే వసూళ్లు సునామీ ఆగలేదు. షారుఖ్ దూకుడుకు రికార్డులన్నీ గల్లంతవుతున్నాయి. ఐదో రోజుల్లో ఈ మూవీ ఎంత కలెక్ట్ చేసిందంటే?  

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Sep 12, 2023, 12:42 PM IST
Jawan Box Office Collection day 5: బాక్సాఫీస్ వద్ద కొనసాగుతున్న షారుక్ దండయాత్ర.. రూ.500 కోట్ల క్లబ్ లో జవాన్..

Jawan Box Office Collection day 5: బాలీవుడ్ బాద్​ షారుక్ జవాన్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తుంది. ఫస్ట్ డే నుంచి రికార్డు స్థాయి కలెక్షన్లతో దూసుకుపోతుంది. ఇప్పటికీ థియేటర్లన్నీ హౌస్ పుల్ బోర్డులతో నిండిపోయాయి. షారుక్ ధాటికి రికార్డులన్నీ బద్దలువుతున్నాయి. సెప్టెంబరు 07న గ్రాండ్ గా రిలీజైన ఈ సినిమా ఇప్పటికీ సక్సెస్ పుల్ గా రన్ అవుతోంది. తొలి రోజే ఈ మూవీ రూ.75 కోట్లు వసూలు చేసింది. ఐదో రోజుల్లో ఈ మూవీ రూ. 500 కోట్లకుపైగా గ్రాస్ ను సాధించింది. 

ఇక ఐదో రోజు ఈ చిత్రం ఇండియాలో రూ. 30 కోట్ల నెట్ కలెక్షన్లను అందుకుంది. దీంతో ఈ చిత్రం భారతదేశంలో రూ. 316 కోట్లు వసూల్లు రాబట్టినట్లయింది. ఓవర్సీస్ లో కూడా ఊహించని కలెక్షన్లతో దూసుకుపోతుంది జవాన్. మెుత్తానికి ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ ఐదో రోజుల్లో రూ.550 కోట్లను క్రాస్ చేసినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ ఏడాది ఇండియాలో రూ. 300 కోట్ల మార్కును అందుకున్న మూడో బాలీవుడ్ చిత్రంగా జవాన్ నిలిచింది. దీంతో కింగ్ ఖాన్ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. 

షారుక్ హీరోగా నటించిన జవాన్ సినిమాకు కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వం వహించారు. నయనతార హీరోయిన్ గా, విజయ్ సేతుపతి విలన్ గా నటించారు. దీపికా పదుకొనె, సంజయ్ దత్ గెస్ట్ రోల్స్ లో మెరిశారు. ప్రియమణి, సాన్యా మల్హోత్రా, యోగిబాబు, సునీల్ గ్రోవర్ కీలకపాత్రల్లో నటించారు. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందించారు. రెడ్ చిల్లీస్ ఎంటర్ టైనమెంట్ బ్యానర్ పై గౌరీ ఖాన్ ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రంలో షారుక్ డ్యూయల్ రోల్ లో నటించారు. 

Also read:  Pushpa 2 Release Date: పుష్ప-2 రిలీజ్ డేట్ ఫిక్స్.. ఆగస్టులో ఆటాడుకోనున్న బన్నీ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News