Jathi Ratnalu Photos: తిరుమలలో సందడి చేసిన జాతిరత్నాలు నవీన్ పొలిశెట్టి, ఫరియా అబ్దుల్లా

Jathi Ratnalu Movie Team Visits Tirumala Temple | తాజాగా ఫరియా అబ్దుల్లా ఫొటోలు సైతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్నాయి. చిట్టి నా బుల్ బుల్ చిట్టి పాట చాలా పాపులర్ అయింది. ఫరియా అబ్దుల్లా ఈ పాటతో టాలీవుడ్ ప్రేక్షకుల్లో క్రేజ్ సంపాదించుకుంది. 

Written by - Shankar Dukanam | Last Updated : Mar 18, 2021, 05:42 PM IST
  • సినిమా ప్రపంచం అంటే పైకి రంగులు, హంగులు కనిపిస్తాయి
  • కొందరికీ సినిమానే జీవితం, సక్సెస్ సాధించి తామేంటో నిరూపించుకుంటారు
  • జాతిరత్నాలుతో నవీన్ పొలిశెట్టి, ఫరియా అబ్దుల్లా విజయాన్ని అందుకున్నారు
Jathi Ratnalu Photos: తిరుమలలో సందడి చేసిన జాతిరత్నాలు నవీన్ పొలిశెట్టి, ఫరియా అబ్దుల్లా

లక్ బాగుంటే ఒక్క సినిమాతో స్టార్ అయిపోవచ్చు. లేకపోతే కొన్నేళ్లపాటు శ్రమించాల్సి వస్తోంది. సినిమా ప్రపంచం అంటే పైకి రంగులు, హంగులు కనిపిస్తాయి. కానీ కొందరికీ సినిమానే జీవితంగా జీవిస్తుంటారు. సక్సెస్ సాధించి తామేంటో నిరూపించుకుంటారు. ఇటీవల వచ్చిన జాతిరత్నాలు సినిమాతో నవీన్ పొలిశెట్టి, ఫరియా అబ్దుల్లా విజయాన్ని అందుకున్నారు. దీంతో వీరిద్దరికి ఆఫర్లు క్యూ కడుతున్నాయి. 

జాతిరత్నాలు సక్సెస్‌ను ఈ టాలీవుడ్(Tollywood) మూవీ యూనిట్ ఎంజాయ్ చేస్తుంది. అనుదీప్ తెరకెక్కించిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన రావడంతో బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురుస్తోంది. ఈ క్రమంలో మూవీ యూనిట్ తిరుమలలో సందడి చేసింది. నవీన్ పొలిశెట్టి, ఫరియా అబ్దుల్లా సహా మూవీ యూనిట్ సభ్యులు గురువారం శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం ఫ్యాన్స్ వీరితో సెల్ఫీలు తీసుకున్నారు.

Also Read: Nagarjuna Takes Corona Vaccine: కరోనా టీకా వేయించుకున్న టాలీవుడ్ అగ్రహీరో నాగార్జున, నెటిజన్లకు సందేశం

జాతిరత్నాలు సినిమాను స్వప్న సినిమాస్‌ పతాకంపై నాగ్‌ అశ్విన్ నిర్మించారు. రాహుల్‌ రామకృష్ణ, ప్రియదర్శి  కీల‌క పాత్రల్లో న‌టించి తమ పాత్రలకు న్యాయం చేశారు. Jathi Ratnalu సినిమా విజయం సాధించడంతో ఫరియా అబ్దుల్లాకు మంచి ఆఫర్లు వస్తున్నాయి. రవితేజ తరువాత సినిమాలో హీరోయిన్ ఛాన్స్ కొట్టేసింది. 

Also Read: 7th Pay Commission: ప్రభుత్వ ఉద్యోగులకు DA Hike మరియు డీఆర్ చెల్లింపులపై కీలక నిర్ణయం

ఇటీవల ఉప్పెన బ్యూటీ కృతిశెట్టి సైతం తొలి సినిమాతోనే మంచి మార్కులు అందుకుంది. తాజాగా ఫరియా అబ్దుల్లా ఫొటోలు సైతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్నాయి. చిట్టి నా బుల్ బుల్ చిట్టి పాట చాలా పాపులర్ అయింది. ఫరియా అబ్దుల్లా((Fariya Abdullah)) ఈ పాటతో టాలీవుడ్ ప్రేక్షకుల్లో క్రేజ్ సంపాదించుకుంది. మార్చ్ 11న ప్రేక్షకుల ముందుకొచ్చిన జాతిరత్నాలు బాక్సాఫీసు వద్ద వసూళ్లు సాధిస్తూ సక్సెస్ బాట పట్టింది.

Also Read: Telangana Budget 2021 Highlights: తెలంగాణ బడ్జెట్ 2021 లైవ్ అప్‌డేట్స్, ఆయా శాఖలకు నిధుల కేటాయింపులు ఇలా 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News