Janhvi Kapoor - Dinesh Karthik: జాన్వీ కపూర్‌కి పాఠాలు నేర్పుతోన్న టీమిండియా క్రికెటర్.. ఎందుకోసమో తెలుసా?

Janhvi Kapoor trains under Dinesh Karthik: టీమిండియా వెటరన్ క్రికెటర్ దినేష్ కార్తీక్ వద్ద జాన్వీ కపూర్ ప్రత్యేకంగా క్రికెట్ పాఠాలు నేర్చుకుంటున్నారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 27, 2022, 10:05 AM IST
  • జాన్వీ కపూర్‌కి క్రికెట్ పాఠాలు
  • జాన్వీ కపూర్‌కి పాఠాలు నేర్పుతోన్న టీమిండియా క్రికెటర్
  • కీలక పాత్రలో రాజ్ కుమార్ రావ్
Janhvi Kapoor - Dinesh Karthik: జాన్వీ కపూర్‌కి పాఠాలు నేర్పుతోన్న టీమిండియా క్రికెటర్.. ఎందుకోసమో తెలుసా?

Janhvi Kapoor trains under Dinesh Karthik: అతిలోక సుందరి శ్రీదేవి (Sridevi) నట వారసురాలిగా బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన జాన్వీ కపూర్ (Janhvi Kapoor).. మొదటి సినిమా ధడక్‌తోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత 'గుంజన్ సక్సేనా: ది కార్గిల్ గర్ల్'తో తనలోని నటిని పరిచయం చేశారు. ప్రస్తుతం జాన్వీ వైవిధ్యమైన సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. జాన్వీ నటించిన  'గుడ్ లక్ జెర్రీ', 'మిలి', 'దోస్తానా 2' సినిమాలు తుది దశకు చేరుకున్నాయి. ఇక జాన్వీ నటిస్తోన్న మరో  చిత్రం 'మిస్టర్ అండ్ మిసెస్ మహీ' (Mr and Mrs Mahi).

క్రికెట్ నేపథ్యంలో తెరకెక్కుతోన్న  'మిస్టర్ అండ్ మిసెస్ మహీ' సినిమాలో జాన్వీ కపూర్, రాజ్ కుమార్ రావ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సినిమాలో ఇద్దరూ క్రికెటర్లుగానే కనిపించనున్నారని సమాచారం. అందుకే టీమిండియా వెటరన్ క్రికెటర్ దినేష్ కార్తీక్ (Dinesh Karthik) వద్ద జాన్వీ ప్రత్యేకంగా క్రికెట్ పాఠాలు నేర్చుకుంటున్నారు. డీకే వద్ద ప్రస్తుతం జాన్వీ బ్యాటింగ్ మెలకువలు తీసుకుంటున్నారు. ఇందుకోసం ఓ ప్రత్యేక క్యాంపు కూడా చిత్రబృదం ఏర్పాటు చేసిందట.

Also Read: Ram Charan - Keerthy Suresh: కీర్తి సురేష్‌కి పడిపోయిన మెగా హీరో.. నాటునాటు మాములుగా లేదుగా!!

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Janhvi Kapoor (@janhvikapoor)

తన క్రికెట్ ట్రైనింగ్‌కు సంబంధించిన ఫొటోలను 'క్రికెట్ క్యాంప్ అట్ మిస్టర్ అండ్  మిసెస్ మహీ' అని సోషల్ మీడియాలో జాన్వీ కపూర్ షేర్ చేశారు. ఓ ఫొటోలో హెల్మెట్ పెట్టుకుని జాన్వీ బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తుండగా.. మరో ఫొటోలో దినేష్ కార్తీక్ బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. మరొక దాంట్లో చిత్ర బృందంతో డీకే సరదాగా ముచ్చటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. శరన్ శర్మ (Sharan Sharma) తెరకెక్కిస్తోన్న ఈ చిత్రం అక్టోబర్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. 

Also Read: India Corona Update: దేశంలో కొనసాగుతున్న కరోనా కల్లోలం..19.59 శాతానికి చేరిన పాజిటివిటీ రేటు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News