War 2: వార్ 2 గురించి బిగ్ అప్డేట్..ఎన్టీఆర్ తండ్రిగా సీనియర్ హీరో.. నిజమెంత?

Jr NTR: ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఎంతో పేరు తెచ్చుకున్నారు జూనియర్ ఎన్టీఆర్. అందుకే ప్రస్తుతం ఈ హీరో చేసే సినిమాల పైన ప్రపంచవ్యాప్తంగా ఎన్నో అంచనాలు నెలకొన్నాయి.. ఈ క్రమంలో దేవరా సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న ఈ హీరో త్వరలోనే వార్ 2 షూటింగ్ కూడా మొదలుపెట్టనున్నారు.

Written by - Vishnupriya Chowdhary | Last Updated : Apr 10, 2024, 10:44 AM IST
War 2: వార్ 2 గురించి బిగ్ అప్డేట్..ఎన్టీఆర్ తండ్రిగా సీనియర్ హీరో.. నిజమెంత?

War 2 Update: జూనియర్ ఎన్టీఆర్ అంటే ఒకప్పుడు తెలుగులో మాత్రమే సూపర్ హీరో అని పేరు ఉండేది. అద్భుతమైన నటన..అంతకుమించిన డాన్స్ ఆయన సొంతం. ఇక ధైర్యం డెలివరీలో అయితే ఎన్టీఆర్ ని ప్రస్తుత జనరేషన్ హీరోల్లో దాటే వారు ఎవరూ లేరని ఎంతోమంది ప్రముఖులు కూడా చెప్పారు. కాగా అలాంటి జూనియర్ ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా సూపర్ స్టార్ అయిపోయారు. వివిధ దేశాలలో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు.

ఈ క్రమంలో ఈ హీరో నుంచి రాబోతున్న తదుపరి సినిమాలపై అంచనాలు భారీగా నెలకొన్నాయి. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ తనకు జనతా గ్యారేజ్ లాంటి సూపర్ సక్సెస్ అందించిన కొరటాల శివతో దేవరా సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కుతుండగా మొదటి భాగం ఈ సంవత్సరం విడుదల కానుంది. ఇక ఈ సినిమాతో పాటు బాలీవుడ్ లో హృతిక్ రోషన్ హీరోగా చేస్తున్న వార్ 2 సినిమాలో కూడా ఎన్టీఆర్ కనిపించనున్నారు. అయితే ఈ సినిమాలో మన ఎన్టీఆర్ హీరోగా కనిపించనున్నారా లేదా విలన్ గా కనిపించనున్నారా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా గురించి ఒక వార్త తెగ వైరల్ అవుతుంది.

గత కొద్దిరోజులుగా ఈ వార్ 2 సినిమాలో ఎన్టీఆర్ పాత్రకి తండ్రిగా జగపతి బాబు కనిపించబోతున్నారని వార్తలు తెగ చెక్కర్లు చెయ్యగా ఈ విషయంపై ఫైనల్ గా స్పందించారు జగపతిబాబు. ఈమధ్య జరిగిన ఒక ఇంటర్వ్యూలో జగపతిబాబుకి ఇదే ప్రశ్న ఎదురవగా.. “ఈ రూమర్ ని నేను కూడా విన్నాను. కానీ నాకు వార్ 2 సినిమా బృందం నుంచి ఎలాంటి ఆఫర్ రాలేదు. ప్రస్తుతం అయితే ఇది రూమర్ మాత్రమే, నిజం కాదు” అంటూ తెలియజేశారు. కాగా ఈ సినిమాలో ఎన్టీఆర్ ఇండియన్ రా ఏజెంట్ గా కనిపించబోతున్నారు. మరి ఈ చిత్రం ఎన్టీఆర్ ని ఏ లెవెల్ కి తీసుకోబోతుందో వేచి చూడాలి.

ఇప్పటివరకు వై.ఆర్.ఎఫ్ స్పై యూనివర్స్ లో ‘టైగర్’గా సల్మాన్ ఖాన్, ‘పఠాన్’గా షారుఖ్ ఖాన్, ‘మేజర్ కబీర్‌’గా హృతిక్ రోషన్ ఆడియన్స్ ముందుకు వచ్చారు. ఇప్పుడు ఈ లిస్టులో మన తెలుగు హీరో జూనియర్ ఎన్టీఆర్ కూడా చేరడం విశేషం.

Also Read: Pawan Chiranjeevi Meet: పవన్‌ కల్యాణ్‌కు చిరంజీవి ఆశీర్వాదం.. రూ.5 కోట్ల విరాళంతో భరోసా ఇచ్చిన 'అన్నయ్య'

Also Read: Pawan Kalyan: జగన్‌లాంటి 'కోడిగుడ్డు' ప్రభుత్వం ఇంకా కావాలా? పవన్‌ కల్యాణ్‌

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News