Pawan Kalyan తో కలిసి పనిచేసేందుకు ఎదురుచూస్తున్న Jacqueline Fernandez

Jacqueline Fernandez's role in Pawan Kalyan film: పవన్ కల్యాణ్‌తో సినిమా చేసేందుకు బాలీవుడ్ బ్యూటీ, శ్రీలంక బ్యూటీ క్వీన్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తోంది. క్రిష్ దర్శకత్వంలో పవన్ కల్యాణ్ చేస్తున్న హరి హర వీరమల్లు అనే పీరియాడిక్ డ్రామా మూవీలో పవన్ కల్యాణ్ సరసన ఇద్దరు హీరోయిన్స్‌కి స్కోప్ ఉండగా అందులో ఒక పాత్ర కోసం జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌ని ఎంపిక చేసుకున్నట్టు తెలుస్తోంది.

Written by - ZH Telugu Desk | Last Updated : May 18, 2021, 02:43 AM IST
Pawan Kalyan తో కలిసి పనిచేసేందుకు ఎదురుచూస్తున్న Jacqueline Fernandez

Jacqueline Fernandez's role in Pawan Kalyan film: పవన్ కల్యాణ్‌తో సినిమా చేసేందుకు బాలీవుడ్ బ్యూటీ, శ్రీలంక బ్యూటీ క్వీన్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తోంది. క్రిష్ దర్శకత్వంలో పవన్ కల్యాణ్ చేస్తున్న హరి హర వీరమల్లు అనే పీరియాడిక్ డ్రామా మూవీలో పవన్ కల్యాణ్ సరసన ఇద్దరు హీరోయిన్స్‌కి స్కోప్ ఉండగా అందులో ఒక పాత్ర కోసం జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌ని ఎంపిక చేసుకున్నట్టు తెలుస్తోంది. కాకపోతే ఈ విషయంలో నిర్మాతలు సీక్రసీ మెయింటెన్ చేస్తున్నారు. 

అయితే, ఇటీవలే ఓ బాలీవుడ్ మీడియా హౌజ్‌కి ఇంటర్వ్యూ ఇచ్చిన జాక్వెలిన్ ఫెర్నాండెజ్ మాత్రం తన తదుపరి ప్రాజెక్ట్స్ గురించి మాట్లాడుతూ.. క్రిష్ నుంచి కాల్ కోసం ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్నానని చెప్పుకొచ్చింది. దీంతో హరి హర వీరమల్లు సినిమాలో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ పాత్ర ఖాయమైనట్టేనని టాలీవుడ్ సినీవర్గాలు భావిస్తున్నాయి.

Also read : Mahesh Babu సినిమాలో శిల్పా శెట్టి పాత్ర ఏంటి ?

హరి హర వీర మల్లు సినిమాలో (Hari Hara Veeramallu) జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఓ యువరాణి పాత్ర పోషించనున్నట్టు టాలీవుడ్ టాక్. ఇక ఇదే సినిమాలో మరో పాత్ర కోసం అందాల నిధి నిధి అగర్వాల్‌ని (Niddhi Agerwal) ఎంపిక చేసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. హరి హర వీరమల్లు సినిమాకు సంబంధించి చాలా వరకు షూటింగ్ పూర్తి కాగా హీరోయిన్స్‌కి సంబంధించిన సీన్స్ షూటింగ్ పార్ట్ పెండింగ్‌లో ఉన్నట్టు సమాచారం.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News