Is Waltair Veerayya Freemake of Oosaravelli: మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో వాల్తేరు వీరయ్య అనే సినిమా తెరకెక్కి సంక్రాంతి సందర్భంగా జనవరి 13వ తేదీన విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రవితేజ ఒక కీలక పాత్రలో నటించాడు. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా మీద ముందు నుంచి భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలకు తగినట్లుగా విడుదలైన మొదటి ఆట నుంచి సినిమాకి మంచి పాజిటివ్ టాక్ వచ్చింది. ఈ సినిమాలో కేథరిన్ థెరిసా, శృతిహాసన్, ప్రదీప్ రావత్, బాబీ సింహా, ప్రకాష్ రాజ్, శ్రీనివాస్ రెడ్డి, షకలక శంకర్ వంటి వారు ఇతర కీలక పాత్రల్లో నటించారు.
ఇక ఈ సినిమా కలెక్షన్స్ విషయంలో కూడా మొదటి రోజు భారీ వసూళ్లు సాధించగా ఇప్పుడు నేటిజన్లు మాత్రం సినిమా మీద ఒక కొత్త రకమైన ట్రోలింగ్ మొదలుపెట్టారు. అదేమిటంటే ఈ సినిమాకి జూనియర్ ఎన్టీఆర్ నటించిన ఊసరవెల్లి సినిమాతో పోలికలు ఉన్నాయంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. వాస్తవానికి వాల్తేరు వీరయ్య సినిమా కథ విషయానికి వస్తే మెగాస్టార్ చిరంజీవి తమ్ముడు పాత్రలో నటించిన రవితేజ పోలీస్ ఆఫీసర్ కాగా అనుకోకుండా చేయని తప్పుకు డిపార్ట్మెంట్ దృష్టిలో విలన్ గా ముద్ర వేయించుకుంటాడు.
19 years ke NTR movie tho U**a poyichadu 1 week movie postpone cheskunnav ippudu Emo direct ga NTR Movie freemake chesi thigh slaps needi oka bathukena Bossu Thu 💦💦 pic.twitter.com/65x5Vj7hMX
— Mr Perfect (@kantri_munna09) January 13, 2023
చనిపోయిన తర్వాత ప్రభుత్వ లాంఛనాలతో కర్మకాండలు చేయరు సరికదా ఒక దేశద్రోహి అన్నట్లుగా ముద్ర వేస్తారు. దానికి కారణం ప్రకాష్ రాజ్. అయితే దీనికి చిరంజీవి కారణమని భావించి రవితేజ భార్య కేథరిన్ చిరంజీవిని ముఖం జీవితంలో చూపించొద్దు అని చెప్పి విదేశాలకు వెళ్లి సెటిల్ అవుతుంది. అయితే చివరికి చిరంజీవి ఎక్కడో మలేషియాలో ఉన్న ప్రకాష్ రాజ్ ని భారతదేశం తీసుకొచ్చి ఎలా రవితేజ మరణానికి న్యాయం చేశాడు? పోలీస్ డిపార్ట్మెంట్ దృష్టిలో రవితేజ వీర మరణం పొందినట్లు ఎలా చేశాడు? అన్నట్లుగా కథ సాగుతుంది.
అయితే ఈ కథ మొత్తం జూనియర్ ఎన్టీఆర్ నటించిన ఊసరవెల్లి సినిమా కథ లాగా ఉందని కొందరు కామెంట్ చేస్తున్నారు ఊసరవెల్లి సినిమాలో కూడా ఎన్టీఆర్ డబ్బు కోసం ఏ పని చేయడానికి అయినా సిద్ధమయ్యే రౌడీలా కనిపిస్తాడు. ఈ సినిమాలో తమన్నా సోదరుడు కిక్ శ్యాం ప్రకాష్ రాజ్ అనే ఒక డాన్ దగ్గర అండర్ కవర్ ఆపరేషన్ చేసి దొరికిపోయి అతని చేతిలో చనిపోతాడు. అతను పోలీసులకు ద్రోహం చేశాడని భావించిన పోలీస్ డిపార్ట్మెంట్ అతన్ని ద్రోహిగా ప్రకటిస్తుంది. ఎలాంటి ప్రభుత్వ లాంఛనాలు లేకుండా అతని కర్మకాండలు చేయిస్తారు. ఒక సందర్భంలో తనను కలిసిన ఎన్టీఆర్కు తమన్నా ఈ విషయం అంతా చెప్పి తన పగ తీర్చమని అడుగుతుంది. అందుకోసం ఎన్టీఆర్ చాలా దూరమైనా వెళతాడు విద్యుత్ జమ్వాల్ ను అడ్డం పెట్టుకొని అతని సోదరుడు ప్రకాష్ రాజుని రప్పించి అతన్ని చంపేస్తాడు.
వాల్తేరు వీరయ్య సినిమాలో కూడా బాబీ సింహాన్ని అడ్డుపెట్టుకుని ప్రకాష్ రాజును చంపినట్లుగా చూపించారు. అలాగే ఎన్టీఆర్ సినిమాలో మందేసినప్పుడు ఎలా అయితే తండ్రి పాత్రలో నటించిన షాయాజీ షిండే ఆత్మ కనిపిస్తుందో వీరయ్యకు మందేసినప్పుడల్లా తన తండ్రి సత్యరాజు ఆత్మా కనిపిస్తూ ఉంటుంది. అలా కథపరంగా ఒకటి కాకపోయినా లైన్ ఒక్కటే ఉందంటూ ఇది ఆ సినిమాకు ఇది ఫ్రీ మేక్ అంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ లో తెలుపండి.
Also Read: Chiranjeevi Emotional: మీ అందరి అకుంటిత కృషే వాల్తేరు వీరయ్య విజయానికి కారణం..చిరు ఎమోషనల్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి