Indian Idol: సీజన్‌-12 విజేత పవన్‌దీప్‌ రాజన్‌..ఆరోస్థానంలో షణ్ముఖప్రియ

Indian idol 12: ఇండియన్ ఐడల్ 12వ సీజన్ విజేతగా పవన్‌దీప్‌ రాజన్‌ నిలిచారు. అరుణిత కంజిలాల్‌ రన్నరప్‌గా, తెలుగమ్మాయి షణ్ముఖ ప్రియ ఆరోస్థానంలో నిలిచింది.   

Edited by - ZH Telugu Desk | Last Updated : Aug 16, 2021, 10:29 AM IST
  • ఇండియన్‌ ఐడల్‌ 12 విజేత పవన్‌ దీప్ రాజన్
  • విజేతకు రూ. 25 లక్షల చెక్‌, ట్రోఫీ బహుకరణ
  • ఆరో స్థానంలో తెలుగుతేజం షణ్ముఖ ప్రియ
Indian Idol: సీజన్‌-12 విజేత పవన్‌దీప్‌ రాజన్‌..ఆరోస్థానంలో షణ్ముఖప్రియ

Indian idol 12: పాపులర్‌ మ్యూజికల్‌ రియాలిటీ షో ఇండియన్‌ ఐడల్‌ సీజన్‌ 12 విజేతగా పవన్‌దీప్‌ రాజన్‌ నిలిచారు. తొలి రన్నరప్‌గా అరుణిత కంజిలాల్‌, మూడో స్థానంలో సేలీ కంబ్లే, నాలుగో స్థానంలో మహ్మద్‌ దనిష్‌, ఐదో స్థానంలో నిహల్‌, మన తెలుగు అమ్మాయి షణ్ముఖ ప్రియ ఆరో స్థానంలో నిలిచింది. ఎన్నో ఆశలతో ఫైనల్‌ పోరుకు చేరిన షణ్ముఖప్రియకు నిరాశే తప్పలేదు.

తన గానమాధుర్యంతో సంగీత ప్రపంచాన్ని మెప్పించిన ఫైనల్‌ విజేత పవన్‌దీప్‌ రాజన్‌( Pawandeep Rajan )కు రూ. 25 లక్షల చెక్‌ను అందజేశారు. 12 గంటల పాటు నిర్విరామంగా జరిగిన ఈ ఫైనల్‌ పోటీ ఆద్యంతం తీవ్ర ఉత్కంఠ రేపింది. మధ్యాహ్నం 12 గంటల నుంచి ప్రారంభమైన ఈ ఫైనల్‌ షో అర్ధరాత్రి వరకు సాగింది. మొదటి నుంచి అద్భుత గానంతో అలరించి దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించి  ఫైనల్‌ బరిలో మన తెలుగుతేజం షణ్ముఖ ప్రియ (Shanmukha Priya)తో సహా పవన్‌దీప్‌ రాజన్‌, అరుణిత కంజిలాల్‌(arunita kanjilal), నిహల్‌(nihal tauro), సేలీ కంబ్లే(sayli kamble), మహ్మద్‌ దనిష్‌(mohd danish) నిలిచారు.  ఫైనల్‌ విజేతగా పవన్‌దీప్‌ను ప్రకటించడంతో అంతటా హర్షాతిరేకాలు వ్యక్తం అయ్యాయి. అనంతరం పవన్‌దీప్‌ మాట్లాడుతూ.. ‘‘నేను టైటిల్‌ గెలిచానని నమ్మలేకపోతున్నాను. కలలగా  అనిపిస్తోంది. ఇది నాకు లభించిన గొప్ప గౌరవమని అన్నారు. పవన్‌దీప్‌ రాజన్‌ది ఉత్తరాఖండ్‌లోని చంపావత్‌ జిల్లా. 2015లో పవన్‌దీప్‌ వాయిస్‌ ఇండియా షో(Voice ndia)లో విజేతగా నిలిచాడు. 

Also Read:Evaru Meelo Koteeswarulu: తారక్ వచ్చేస్తున్నాడు...గెస్ట్ ఎవరో తెలుసా?

షణ్ముఖ ప్రియకు విజయ్ విషెస్..
ఈ ఫైనల్ పోరు జరుగుతుండగా..మన తెలుగు అమ్మాయి షణ్ముఖ ప్రియ(Shanmukha Priya)కు హీరో విజయ్ దేవరకొండ(Vijay deavarakonda) వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విషెస్ తెలియజేశారు. అంతేకాకుండా తన సినిమాలో పాటను పాడే అవకాశం కూడా ఇవ్వడం విశేషం. 2020 నవంబర్‌ 28న ప్రారంభమైన ఈ షో 9 నెలల పాటు సంగీత ప్రియులను అలరించింది.

ఇండియన్‌ ఐడల్‌ 12 సీజన్‌కు ఆదిత్య నారాయణ్‌(Aditya Narayan) హోస్ట్‌గా, హిమేశ్‌ రేష్మియా, అను మాలిక్‌, సోను కక్కర్‌ జడ్జిలుగా వ్యవహరించారు. గ్రాండ్‌ ఫినాలేకు జావెద్‌ అలీ, సుఖ్విందర్‌ సింగ్‌, రాఘవ్‌ సచార్‌, మికా సింగ్‌, సాధన సర్గమ్‌, అన్ను కపూర్‌, షేర్షా జంట సిద్ధార్థ్‌ మల్హోత్రా(Siddharth Malhotra), కియారా అడ్వాణీ(Kiara Advani), ఉదిత్‌ నారాయణ్‌, అల్కా యజ్ఞిక్‌, వరల్డ్‌ రెజ్లింగ్‌ ఎంటర్‌టైన్‌ ఫేం గ్రేట్‌ కాళీ తదితరులు అతిథులుగా వచ్చారు. 

Also Read: Pawan Kalyan: 'భీమ్లా నాయక్‌'గా పవన్ లుక్స్ అదుర్స్...పవర్ ప్యాక్డ్ గ్లింప్స్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News