చెన్నై: కోలీవుడ్ చిత్ర పరిశ్రమలో బుధవారం రాత్రి (#Indian2Mishap) విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తోన్న ‘భారతీయుడు 2’ సినిమా షూటింగ్ సెట్లో క్రేన్ తెగి పడటంతో ముగ్గురు చనిపోయిన విషయం తెలిసిందే. ఆ సమయంలో షూటింగ్ సెట్లో హీరో కమల్ హాసన్ ఉన్నారు. ఈ విషాదంపై ఆయన స్పందించారు. ముగ్గురు వ్యక్తులు చనిపోవడంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సినిమా యూనిట్ కన్నా చనిపోయిన వారి కుటుంబాలు పడే బాధ ఎన్నో రెట్లు ఎక్కువ అంటూ ఈ మేరకు రెండు ట్వీట్లు చేశారు.
மருத்துவமனையில் விபத்தில் சிக்கியவர்களை பார்த்து மருத்துவர்களிடம் பேசியுள்ளேன்.
முதலுதவி வழங்கப்பட்டு உரிய சிகிச்சைக்கான வேலைகள் நடக்கிறது.
இவர்கள் விரைவாக உடல் நலம் பெற்றிடுவார்கள் என்ற நம்பிக்கையுடனே இந்த இரவு விடியட்டும்.
— Kamal Haasan (@ikamalhaasan) February 19, 2020
‘ప్రస్తుతం జరిగిన ప్రమాదం అత్యంత భయంకరమైనది. ఈ ఘటన కారణంగా నేను ముగ్గురు సహోద్యోగులను కోల్పోయాను. నా బాధ కంటే ఆ ముగ్గురు వ్యక్తులను కోల్పోయిన కుటుంబం బాధను మాటల్లో చెప్పలేం. వారి కష్టాలలో నేను పాలు పంచుకుంటాను. ఆ ముగ్గురి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.
Also Read: భారతీయుడు 2 షూటింగ్లో ప్రమాదం.. క్రేన్ కూలి ముగ్గురి దుర్మరణం
எத்தனையோ விபத்துக்களை சந்தித்து, கடந்திருந்தாலும் இன்றைய விபத்து மிகக் கொடூரமானது. மூன்று சகாக்களை இழந்து நிற்கிறேன்.எனது வலியை விட
அவர்களை இழந்த குடும்பத்தினரின் துயரம் பன்மடங்கு இருக்கும். அவர்களில் ஒருவனாக அவர்களின் துயரத்தில் பங்கேற்கிறேன்.அவர்களுக்கு என் ஆழ்ந்த அனுதாபங்கள்— Kamal Haasan (@ikamalhaasan) February 19, 2020
గాయపడ్డ మరికొంత మంది మూవీ యూనిట్ సభ్యులకు చికిత్స అందిస్తున్న డాక్లర్లతో మాట్లాడాను. వారికి వైద్యులు ప్రాథమిక చికిత్స అందిస్తున్నారు. గాయపడ్డ మా భారతీయుడు 2 సభ్యులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నానని’ కమల్ హాసన్ వరుస ట్వీట్లు చేశారు.
Also Read: నటి టాప్లెస్ ఫొటోకు ఫ్యాన్స్ షాక్!
చెన్నై శివారులోని ఈవీపీ ఫిల్మ్ సిటీలో బుధవారం భారతీయుడు 2 సినిమా షూటింగ్ జరిగింది. అయితే ప్రమాదవశాత్తూ సెట్లో 150 అడుగుల భారీ క్రేన్ తెగిపడిన ఘటనలో అసిస్టెంట్ డైరెక్టర్ కృష్ణ (34), ఆర్ట్ అసిస్టెంట్ చంద్రన్, డైరెక్టర్ శంకర్ పర్సనల్ అసిస్టెంట్ మధు (29) మృతిచెందారు. దాదాపు పది మంది మూవీ యూనిట్ సభ్యులు గాయపడ్డారని సమాచారం.