Allu arjun talk show: త్వరలో హోస్ట్​గా అల్లు అర్జున్- ఇక తగ్గేదేలే!

Allu arjun show: అల్లు అర్జున్​ను సిల్వర్​ స్క్రీన్​పై చూసి విజిల్స్​ వేసే ఫ్యాన్స్​కు గడ్​ న్యూస్​. త్వరలో బుల్లి తెరపైనా బన్ని సందడి చేయనున్నాడట!

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Jan 22, 2022, 02:09 PM IST
  • హోస్ట్​గా మారనున్న అల్లు అర్జున్​
  • త్వరలో ఓ కొత్త షో ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం
  • పాన్​ ఇండియా లెవల్లో షో ప్లాన్​!
Allu arjun talk show: త్వరలో హోస్ట్​గా అల్లు అర్జున్- ఇక తగ్గేదేలే!

Allu arjun show: ఐకాన్ స్టార్ అల్లు అర్జన్​.. తీసే ప్రతి సినిమాతో తనను తాను కొత్తగా నిరూపించుకుంటూ ముందుకు (Allu Arjun movies) సాగుతున్నారు. ఇక గత ఏడాది డిసెంబర్​లో పాన్​ ఇండియా లెవెల్లో విడుదలైన 'పుష్ప' సినిమాలో తన నటనలో కొత్త కోణాన్ని (Allu Arjun in Pushpa Movie) ఆవిష్కరించారు. ఈ సినిమా విజయంతో పాన్ ఇండియా స్టార్​గా కూడా గుర్తింపు తెచ్చుకున్నారు బన్ని.

ప్రస్తుతం పుష్ప-2 సినిమా పనుల్లో బిజీగా ఉన్న అల్లు అర్జున్​.. మరో క్రేజీ ప్రాజెక్ట్​ కోసం సిద్ధమవుతున్నాడట. అయితే ఇది సినిమా ప్రాజెక్ట్​ కాదు. ఓ టాక్​ షో అని (Talk Show with Allu Arjun) తెలుస్తోంది.

అల్లు ఫ్యామిలీ అధ్వర్యంలో నడుస్తున్న ఓటీటీ ప్లాట్​ఫామ్​లో ఈ టాక్​షోను ప్లాన్​ చేస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. అయితే అల్లు అర్జున్​కు ప్రస్తుతమున్న క్రేజ్​ను దృష్టిలో ఉంచుకుని పాన్​ ఇండియా లెవల్లో ఈ టాక్​ షోను ప్లాన్​ చేస్తున్నట్లు (Aha new Talk Show) సమాచారం.

కొత్త టాక్ షో అందుకేనా..

ఆహాలో తొలుత సమంత హోస్ట్​గా 'సామ్ జామ్​' టాక్​ షో సందడి చేసింది. ఆ షో తొలి సీజన్​కు మంచి మార్కులే (Samantha talk show) పడ్డాయి.

ప్రస్తుతం నందమూరి నట సింహం బాలకృష్ణతో 'అన్ స్టాపబుల్ విత్ ఎన్​బీకే' టాక్​ షో రికార్డులు తిరగరాస్తూ ముందుకు (Unstoppable with NBK) సాగుతోంది. అయితే ఈ షో తొలి సీజన్​ త్వరలోనే ముగియనున్నట్లు తెలుస్తోంది.

దీనితో ఈ సారి అల్లు అర్జున్ హోస్ట్​గా కొత్త టాక్​ షోను రెడీ చేస్తున్నట్లు సమాచారం. ఆహా తమ సొంత ఓటీటీ కావడంతో ఇప్పటికే.. దాని ప్రమోషన్స్​లో చురుగ్గా పాల్గొంటున్నారు అల్లు అర్జున్​. ఇదిలా ఉండగా.. త్వరలో తమిళంలోనూ ఆహా ఓటీటీ ప్లాట్​ఫామ్​ను ఆవిష్కరించేందుకు అల్లు అరవింద్ ప్లాన్ (Aha OTT for Tamil)​ చేస్తున్నారు. ఈ విషయంపై అధికారిక ప్రకటన కూడా వెలువడింది.

దీనితో ఆహా బ్రాండ్ ఇమేజ్​ను పాన్​ ఇండియా లెవల్​కు తీసుకువెళ్లేందుకు కొత్త కొత్త షోలు, వెబ్​ సిరీస్​ల వంటివి ప్లాన్​ చేస్తున్నారట (Aha new Shows) నిర్వహకులు.

Also read: Akhanda Roar On Hotstar: బాలయ్య బాబునా మజాకా.. థియేటర్లలోనే కాదు ఇళ్లల్లో కూడా మాస్ జాతరే!!

Also read: Prabhas Maruthi Combo: బంపరాఫర్ కొట్టేసిన డైరెక్టర్ మారుతి... ప్రభాస్‌తో కొత్త సినిమా.. టైటిల్ రివీల్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News