Ichata Vahanamulu Nilupa Radu: ఇచ్చట వాహనములు నిలుప రాదు ఓటిటి రిలీజ్ డీటేల్స్

Ichata Vahanamulu Nilupa Radu OTT release date : సుశాంత్ (Sushanth), మీనాక్షి చౌదరి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఇచ్చట వాహనములు నిలుప రాదు మూవీని ఎస్ దర్శన్ డైరెక్ట్ చేశాడు.

Written by - ZH Telugu Desk | Last Updated : Sep 7, 2021, 08:44 PM IST
  • ఇచ్చట వాహనములు నిలుప రాదు సినిమా డిజిటల్ రిలీజ్ డేట్ ఎప్పుడు
  • ఓటిటి విడుదలకు డీల్ కుదుర్చుకున్న మేకర్స్ ?
  • సుశాంత్, మీనాక్షి చౌదరి ప్రధాన పాత్రల్లో ఇచ్చట వాహనములు నిలుప రాదు మూవీ.
Ichata Vahanamulu Nilupa Radu: ఇచ్చట వాహనములు నిలుప రాదు ఓటిటి రిలీజ్ డీటేల్స్

Ichata Vahanamulu Nilupa Radu OTT release date: ఇచ్చట వాహనములు నిలుప రాదు సినిమా ఆగస్టు 27నే థియేటర్లలోకొచ్చిన సంగతి తెలిసిందే. యాక్షన్ కామెడీ నేపథ్యంతో తెరకెక్కిన ఈ సినిమా త్వరలోనే ఓటిటిలోనూ విడుదల కానుంది. థియేట్రికల్ రైట్స్‌తో వచ్చే ఆదాయం ఒక ఎత్తయితే.. ఓటిటి లేదా యూట్యూబ్‌లో విడుదల చేసేందుకు ఇచ్చే డిజిటల్ రైట్స్‌తో లభించే ఆదాయం మరో ఎత్తు కావడంతో ప్రస్తుతం అన్ని సినిమాలు థియేట్రికల్ రైట్స్‌తో పాటే డిజిటల్ రైట్స్ (Digital rights) కూడా అమ్ముకుంటున్నాయి. 

అందులో భాగంగానే ఇప్పటికే ఆహా (Aha) ఓటిటి ప్లాట్‌ఫామ్‌తో డీల్ కుదుర్చుకున్న మేకర్స్.. సెప్టెంబర్ 17న సినిమాను ఆహాలో విడుదల చేయాలని నిర్ణయంచుకున్నట్టు తెలుస్తోంది. ఈ విషయంలో త్వరలోనే ఇచ్చట వాహనములు నిలుప రాదు మూవీ (IVNR movie) యూనిట్ నుంచి ఓ ప్రకటన వెలువడనుంది. 

Also read : Bigg Boss Telugu season 5: బిగ్‌బాస్‌ హౌజ్‌లో నుంచి ఫస్ట్ బయటికి వచ్చేది నువ్వే అంటూ బిగ్‌బాస్‌ సీజన్‌ 2 విన్నర్ కౌశల్ కామెంట్స్

సుశాంత్ (Sushanth), మీనాక్షి చౌదరి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఇచ్చట వాహనములు నిలుప రాదు మూవీని (Ichata Vahanamulu Nilupa Radu) ఎస్ దర్శన్ డైరెక్ట్ చేశాడు. యదార్థ ఘటనల ఆధారంగా తెరకెక్కించిన ఈ సినిమాను రవిశంకర్ శాస్త్రి, ఏక్తా శాస్త్రి, హరీష్ కోయలగుండ్ల సంయుక్తంగా నిర్మించారు.

Also read : Bigg Boss Telugu season 5: బిగ్ బాస్ తెలుగు 5 నామినేషన్స్‌.. తొలి రోజే Vishwa vs Jessi, VJ Sunny vs Sarayu

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News