iBomma One More Shock: మళ్లీ షాకిచ్చిన ఐబొమ్మ.. ఇక అలా చూడడం కుదరదట!

iBomma gives One More Shock to its Users: ఐబొమ్మ వెబ్ సైట్ తన యూజర్లకు మరోమారు షాక్ ఇచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే

Written by - Chaganti Bhargav | Last Updated : Sep 4, 2022, 01:27 PM IST
iBomma One More Shock: మళ్లీ షాకిచ్చిన ఐబొమ్మ.. ఇక అలా చూడడం కుదరదట!

iBomma gives One More Shock to its Users: తెలుగు సినీ ప్రేమికులకు ఐ బొమ్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఓటీటీలో విడుదల అయిన అన్ని సినిమాలను డబ్బులు వెచ్చించి చూడలేని వారికి హై క్వాలిటీలో ఉచితంగా సినిమాలను స్ట్రీమ్ చేసుకుని లేదా డౌన్లోడ్ చేసుకుని చూసే అవకాశాన్ని ఐ బొమ్మ కల్పిస్తోంది. చాలామంది నెటిజన్లు డబ్బులు వృధా చేయడం ఎందుకని భావిస్తూ ఈ వెబ్సైట్లో నచ్చిన సినిమా డౌన్లోడ్ చేసుకుని మరీ చూస్తున్నారు.

అయితే ఇప్పుడు ఆ అవకాశం లేదని తెలుస్తోంది. ఎందుకంటే ఇటీవలే తెలుగు సినీ ప్రియులకు వరుసగా షాకలిస్తున్న ఐ బొమ్మ వెబ్సైట్ ఇప్పుడు మరో షాక్ ఇచ్చింది. అదేమిటంటే తమ వెబ్సైట్ నుంచి సినిమాలను డౌన్లోడ్ చేసే ఆప్షన్ ను శాశ్వతంగా నిలిపివేశామని అయితే కేవలంలో ఆన్లైన్లో మాత్రమే నచ్చిన సినిమాలను స్ట్రీమ్ చేసుకుని చూడ వచ్చు అని ఐ బొమ్మ టీం తమ వెబ్సైట్లో ఒక ప్రకటన ద్వారా వెల్లడించింది. ఇక కొద్ది రోజుల క్రితమే ఐ బొమ్మ తన ఇండియన్ యూజర్లకు షాక్ ఇచ్చింది.

అదేమిటంటే వెబ్సైట్లో అప్లోడ్ చేసిన చివరి 30 సినిమాలు మాత్రమే చూడవచ్చని, ఇక మీదట సినిమాలు వెతుక్కుని చూసే అవకాశం లేదని క్లారిటీ ఇచ్చింది. ఈ క్రమంలోనే కేవలం లేటెస్ట్ 30 సినిమాలు మాత్రమే కనిపిస్తున్నాయి. ఇక అంతకుముందు కూడా తాము ఎలాంటి లాభాపేక్ష లేకుండా తెలుగు ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేస్తుంటే తామేదో వ్యాపారం చేస్తున్నామంటూ కొందరు దుష్ప్రచారం చేస్తున్న క్రమంలో పూర్తిగా ఐవమ్మ వెబ్సైట్ నిలిపివేయడానికి కూడా సిద్ధం అయ్యారు. అయితే చివరికి అభిమానుల విజ్ఞప్తి మేరకు ఐబొమ్మ మళ్లీ వెనక్కి తగ్గింది. ఇక తాజా నిర్ణయం కూడా ఒక వర్గం ప్రేక్షకులకు షాక్ అనే చెప్పాలి. 

Also Read: Charmi Kaur Social Media Break: బతకండి, బతకనివ్వండి.. మళ్ళీ బలంగా వస్తాం.. కీలక ప్రకటన చేసిన ఛార్మీ!

Also Read: Deverakonda Returns Remuneration: విజయ్ దేవరకొండ ఛార్మీకి ఆ డబ్బు తిరిగిచ్చేశాడా ?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 

Trending News