Tamannaah: లిప్‌లాక్.. ఆ హీరోతో అయితే ఓకే

మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా ( Tamannaah ).. చలాకీతనం గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన 15 ఏళ్ల సినీ కెరీర్‌లో టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్‌లో టాప్ హీరోల సరసన నటించి ప్రేక్షకులందరినీ మెప్పించింది.

Last Updated : Dec 11, 2020, 07:49 AM IST
Tamannaah: లిప్‌లాక్.. ఆ హీరోతో అయితే ఓకే

Actress Tamannaah says kiss was okay with that hero: మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా ( Tamannaah ).. చలాకీతనం గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన 15 ఏళ్ల సినీ కెరీర్‌లో టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్‌లో టాప్ హీరోల సరసన నటించి ప్రేక్షకులందరినీ మెప్పించింది. అయితే గ్లామర్‌ షో విషయంలో ఎప్పుడూ వెనుకాడని తమన్నా.. లిప్‌లాక్‌‌కు మాత్రం కాస్త దూరంగా ఉంటూ వస్తోంది. సమంత హోస్ట్‌గా ఆహాలో ప్రసారమమవుతున్న ‘సామ్ జామ్ షో’ ( sam jam show ) కు వచ్చిన మిల్కీ బ్యూటీ తమన్నా.. రౌడీ హీరోతో అయితే లిప్‌లాక్ ఓకేనంటూ కొంటెగా సమాధానమిచ్చి ఆశ్చర్యానికి గురిచేసింది.

తాజాగా ఈ షోకు సంబంధించిన ప్రోమో విడుదలయింది.  ఈ ప్రోమోలో సమంత (Samantha Akkineni) అడిగిన కొంటె ప్రశ్నలకు.. తమన్నా చెప్పిన సరదా సమాధానాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఎవరితో కిస్ అంటే ఇష్టమో తెల్చి చెప్పింది తమన్నా. ఇందులో.. నో కిస్సింగ్‌ ఆన్‌ స్ర్కీన్‌ రూల్‌ బ్రేక్‌ చేస్తే.. ఎవరితో కిస్‌ చేయడానికి ఇష్టపడతావు.. అని తమన్నాని సమంత ప్రశ్నించగా.. దీనికి తమన్నా ఐ లైక్‌ టు కిస్‌.. విజయ్‌ దేవరకొండ ( Vijay Deverakonda ).. అని చెప్పడంతో షోలో ఈలలు, గోలలతో సందడి నెలకొంది. Also read: Tamannaah: మిల్కీ బ్యూటీ తమన్నా లేటెస్ట్ ఫొటోషూట్

అఖిల్ మీ కంటే చిన్నవాడు అని సమంతా ప్రశ్నించగా.. ప్రేమకు వయసుతో సంబంధం లేదని తమన్నా చెప్పింది.. మీరు కోరుకుంటే నేను అఖిల్ నాన్నతో మాట్లాడి స్వయంగా మీటింగ్ ఏర్పాటు చేస్తానని సమంత పేర్కొంది. అయితే ఈ సరదా సంభాషణ టీజర్ నెట్టింట వైరల్ అవుతోంది. 

Also read: F2 Movie: ‘ఎఫ్ 2’ సినిమాకు జాతీయ అవార్డు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Trending News