Nidhi Agarwal: ఎవరితో డేటింగ్ చేయడం లేదు

Nidhi Agarwal  About Dating | నిధి అగర్వాల్ ( Nidhi Agarwal )... చేసినవి తక్కువ సినిమాలే అయినా వార్తల్లో ఎక్కువగా నిలుస్తూ ఉంటుంది. తెలుగులో అక్కినేని నాగచైతన్యతో ( Naga Chaitanya ) సవ్యసాచి చిత్రంలో కనిపించింది ఈ చిన్నది. 

Last Updated : Oct 23, 2020, 04:26 PM IST
    • నిధి అగర్వాల్ చేసినవి తక్కువ సినిమాలే అయినా వార్తల్లో ఎక్కువగా నిలుస్తూ ఉంటుంది.
    • రామ్ పోతినేనితో ఇస్మార్ట్ శంకర్ మూవీలో కనిపించి టాలీవుడ్ లో తొలి విజయాన్ని కైవసం చేసుకుంది.
    • తెలుగులోనే కాదు పలు హిందీ, తమిళ చిత్రాల్లో కూడా నటించి మెప్పించింది ఈ ఇస్మార్ట్ బ్యూటీ.
Nidhi Agarwal: ఎవరితో డేటింగ్ చేయడం లేదు

నిధి అగర్వాల్ ( Nidhi Agarwal )... చేసినవి తక్కువ సినిమాలే అయినా వార్తల్లో ఎక్కువగా నిలుస్తూ ఉంటుంది. తెలుగులో అక్కినేని నాగచైతన్యతో ( Naga Chaitanya ) సవ్యసాచి చిత్రంలో కనిపించింది ఈ చిన్నది. దాంతో పాటు మిస్టర్ మజ్నూలో మరో అక్కినేని ఫ్యామిలీ హీరో అఖిల్ తో నటించింది. తరువాత రామ్ పోతినేనితో ఇస్మార్ట్ శంకర్ మూవీలో కనిపించి టాలీవుడ్ లో తొలి విజయాన్ని కైవసం చేసుకుంది. తెలుగులోనే కాదు పలు హిందీ, తమిళ చిత్రాల్లో కూడా నటించి మెప్పించింది ఈ ఇస్మార్ట్ బ్యూటీ.

Also Read | NEET Results 2020: ఆరు మార్కులు వచ్చాయని... విద్యార్థిని ఆత్మహత్య

అయితే ఇప్పుడు నిధీ అగర్వాల్ గురించి సినిమా రిలేటెడ్ అంశం కాకుండా మరో టాపిక్ బాగా వైరల్ అవుతోంది. మొన్నటి వరకు ఒక క్రికెటర్ తో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతోంది అని వార్తలు గుప్పుమన్నాయి. తాజాగా ఒక తెలుగు సినీ పరిశ్రమకు చెందిన కథానాయకుడితో లవ్ స్టోరీ నడుతుపుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. 

Watch: Video: బౌలర్ గా ధోనీ తిసిన ఒకే ఒక వికెట్ ఎవరిదో తెలుసా ? 

తనపై వస్తున్న వార్తలపై ఎక్కువగా స్పందించని ఈ చక్కని చుక్క.. ఇలా వదిలేస్తే ఇక తన గురించి ఎన్ని వార్తలు వస్తాయో అనుకుందో ఏమో కానీ ఇటీవలే ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా స్పందించింది. తను ప్రస్తుతం ఎవరితో డేటింగ్ చేయడం లేదు అని తెలిపింది నిధి. ప్రస్తుతం సింగిల్ అని క్లారిటీ ఇచ్చింది.

A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే  ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

IOS Link - https://apple.co/3loQYeR

Trending News