Pushpa 2 Collections: ప్రపంచవ్యాప్తంగా.. పుష్ప సినిమాపై ఎంతటి అంచనాలు నెలకొన్నాయి అన్న విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దానికి తోడు..అక్కడ , ఇక్కడ అని తేడా లేకుండా అన్ని ఏరియాలలో కూడా ప్రమోషన్స్ జోరుగా సాగించారు సినిమా యూనిట్. ఇవన్నీ ఒక వైపు అయితే..మరోవైపు ఈ సినిమా టికెట్ ధరలు అందరినీ ఆశ్చర్యానికి గురి చేసి.. కలెక్షన్స్ పై కూడా అంచనాలు ఆకాశాన్ని అంతేగా చేశాయి. ఇక దానికి తగ్గట్టుగానే.. మొదటి రోజు బాక్సాఫీస్ రికార్డులు బ్రేక్ చేసేలా కలెక్షన్స్ వసూలు చేసింది.. ఈ సినిమా.
మొదటిరోజు పాజిటివ్ టాక్ రావడంతో రెండవ రోజు కూడా అంతకుమించి ఉంటుందని అందరూ అంచనా వేశారు. కానీ పుష్పరాజ్ కు షాక్ ఇచ్చేలా కలెక్షన్స్ ఉన్నాయని వార్త తెరపైకి వచ్చింది. మొదటి రోజు భారీగా ఓపెనింగ్ జరిగాయి. కానీ రెండవ రోజు పూర్తిగా తగ్గిపోయాయి. బుకింగ్స్ సగానికి పైగా పడిపోవడంతో అసలు కారణాలేంటి.. అని నెటిజన్స్ కూడా ఆరాధిస్తున్నారు.
ఇకపోతే దీనికి ముఖ్య కారణం అత్యాశకు పోయి.. మరీ పెంచేసిన టికెట్టు ధరలు అందరూ అనుకుంటున్నారు. ఇది మొదటి కారణమైతే.. రెండవది ట్రైలర్లో, టీజర్ లో భారీ హైప్ ను పెంచిన కొన్ని సీన్లను సినిమాలో లేపేసారనే వార్త తెరపైకి వచ్చింది. మేజర్ సీన్స్ లేపేసారని.. దానివల్ల రెండో రోజు బుకింగ్స్ కూడా దారుణంగా పడిపోయాయని సోషల్ మీడియాలో తెగ కామెంట్లు పెడుతున్నాడు.
ఒకవేళ ఈ సినిమా టికెట్ రేట్లు.. మామూలు సినిమాల లాగే ఉండింటే.. తప్పకుండా ఈ చిత్రానికి వచ్చిన టాక్ కి.. వచ్చే మంగళవారం వరకు హౌస్ ఫుల్ బోర్డ్స్ పడి ఉంటాయి. కానీ ఈ టికెట్ ధరలతో.. ఇప్పుడు ఏకంగా రెండోవ రోజే ఈ సినిమా ఎన్నో థియేటర్స్ లో హౌస్ఫుల్ లేకుండా ఖాళీగా ఉంది. ఇకనైనా నిర్మాతలు ఇంత అత్యాశకు పోకుండా ఉండడం మంచిది అని.. ఎంతోమంది తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు.. టికెట్ ధరలు ఇష్టం వచ్చినట్టు పెంచితే.. సినిమా ఎంత బాగుందో..ప్రేక్షకులు థియేటర్స్ కి వెళ్లడానికి కూడా ఆసక్తి చూపివ్వరు.. అనేడానికి పుష్ప సినిమా నిదర్శనం అని అంటున్నారు.
కాగా రేపు శనివారం, ఎల్లుండి ఆదివారం కాబట్టి.. కొంతలో కొంత..ఈ రెండు రోజులను.. పుష్పా సినిమా కొంచెం క్యాష్ చేసుకునే అవకాశాలు లేకపోలేదు. ముఖ్యంగా ఉద్యోగాలు చేసే చాలామంది..ఈరోజు కూడా లీవ్ పెట్టడం కుదరదు కాబట్టి ఈరోజు టికెట్ బుకింగ్ చేసుకోలేదని, ఇక రేపు, ఎల్లుండి టికెట్ బుకింగ్ అయ్యే అవకాశం ఉందని థియేటర్స్ యాజమాన్యం భావిస్తోంది.
మొత్తానికైతే వీకెండ్స్ మరి ఏ మేరకు పుష్ప -2 కి కలిసి వస్తాయో చూడాలి. ప్రస్తుతం రూ. 1000 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగింది ఈ సినిమా. మరి అంత రాబడుతుందా లేదా అన్నది చూడాలి. అత్యాశకు పోయిన పుష్ప -2 కి ఇది పెద్ద గుణపాఠం అని చెప్పవచ్చు.
Also Read: Nara Lokesh: లోకేశ్‌ను కలిసిన దేవర 'డ్యాన్సర్'.. తనను ఆదుకున్నందుకు కృతజ్ఞతలు
Also Read: Naga Babu: అల్లు అర్జున్ కోసం రంగంలోకి నాగబాబు.. వెనక్కి తగ్గిన జనసేన పార్టీ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.