Samantha Yashoda Movie: సమంత 'యశోద' సినిమాకు హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్!!

Hollywood stunt master for Samantha's Yashoda Movie. యశోద సినిమాలో భారీ యాక్షన్‌ పార్ట్‌ ఉందట. ఇందుకోసం హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ యానిక్ బెన్‌ను రంగంలోకి దించిది చిత్ర యూనిట్. యానిక్ బెన్‌.. యశోదలో యాక్షన్ సీక్వెన్స్ తీశారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 20, 2022, 08:42 AM IST
  • ఫుల్‌ బిజీగా సమంత
  • 'యశోద' సినిమాకు హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్
  • లేడీ ఓరియెంటెడ్ ఫిల్మ్స్‌కు డిఫరెంట్ సినిమా
Samantha Yashoda Movie: సమంత 'యశోద' సినిమాకు హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్!!

Hollywood stunt master Yannick Ben for Samantha's Yashoda Movie: ఇటీవలి కాలంలో సౌత్ స్టార్ హీరోయిన్‌ సమంత ఫుల్‌ బిజీగా ఉన్నారు. వరుస సినిమా ఆఫర్లు, స్పెషల్‌ సాంగ్స్‌తో పాటుగా కమర్షియల్‌ యాడ్స్‌ చేస్తూ దూసుకుపోతున్నారు. సామ్ ఓవైపు అగ్ర హీరోలతో నటిస్తూనే.. మరోవైపు లేడీ ఓరియెంటెడ్ సినిమాలు కూడా చేస్తున్నారు.  ఇటీవల సామ్ కమర్షియల్‌ విలువలతో పాటు కంటెంట్‌ ఉన్న సినిమాలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తున్నారు. కమర్షియల్‌ హంగులు, కంటెంట్‌ ఉన్న కథతో ఉన్న శ్రీదేవి మూవీస్‌ ప్రొడక్షన్ హౌస్‌ ఆమెను సంప్రదించగా.. సామ్‌ ఓకే చెప్పింది. ఆ మూవీనే 'యశోద'. సమంత ఇంతకు ముందు చేసిన లేడీ ఓరియెంటెడ్ ఫిల్మ్స్‌కు డిఫరెంట్ సినిమా ఇది. 

యశోద సినిమాలో భారీ యాక్షన్‌ పార్ట్‌ ఉందట. ఇందుకోసం హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ యానిక్ బెన్‌ను రంగంలోకి దించిది చిత్ర యూనిట్. యానిక్ బెన్‌.. యశోదలో యాక్షన్ సీక్వెన్స్ తీశారు. ఇటీవల హైదరాబాద్‌లో పది రోజుల పాటు యశోద యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కించారు. రూ. 3 కోట్ల భారీ వ్యయంతో ఆర్ట్‌ డైరెక్టర్‌ అశోక్‌ వేసిన సెట్స్‌లో ప్రస్తుతం షూటింగ్‌ చేస్తున్నారు. మరొ యాక్షన్‌ సీక్వెన్స్‌ కొడైకెనాల్‌లో ప్లాన్‌ చేసినట్లు సమాచారం. సామ్ ఈ యాక్షన్ సీక్వెన్స్ కోసం బాగా కష్టపడుతున్నారట. 

సమంత నటించిన 'ది ఫ్యామిలీ మ్యాన్‌ 2' వెబ్ సిరీస్‌లోని యాక్షన్‌ సన్నివేశాలను యానిక్‌ బెన్ డైరెక్ట్‌ చేశారు. సమంతతో యానిక్‌ బెన్‌కు 'యశోద' సినిమా సెకండ్ ప్రాజెక్ట్‌. హాలీవుడ్‌లో 'క్రిస్టోఫర్‌ నోలన్‌' సినిమాలకు స్టంట్‌ పర్ఫార్మర్‌గా కూడా బెనిక్‌ వర్క్ చేశారు. యానిక్ బెన్ నేతృత్వంలో తీసిన యాక్షన్ సీక్వెన్స్ గురించి శ్రీదేవి మూవీస్ అధినేత శివలెంక కృష్ణప్రసాద్ మాట్లాడుతూ.. 'సమంత, మిగతా వారు పది రోజుల పాటు సెట్స్‌లో షూటింగ్ చేశాం. సామ్ కష్టపడి యాక్షన్ సీన్స్ చేశారు. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునే థ్రిల్లర్ చిత్రమిది' అని తెలిపారు. 

'ట్రాన్స్‌పోర్టర్ 3', 'ప్రాజెక్ట్ 7', 'పారిస్ బై నైట్ ఆఫ్ లివింగ్ డెడ్', 'సిటీ హంటర్', 'ఇన్‌సెప్షన్', 'డన్‌కిర్క్' వంటి హాలీవుడ్ సినిమాలకు యానిక్‌ బెన్‌ యాక్షన్‌ సీక్వెన్స్‌ తెరకెక్కించారు. షారుఖ్ ఖాన్ 'రయీస్', సల్మాన్ ఖాన్ 'టైగర్ జిందా హై' బాలీవుడ్ చిత్రాలకు బెన్‌ కొరియోగ్రఫీ చేశారు. ఇక పవన్ కళ్యాణ్ 'అత్తారింటికి దారేది', మహేష్ బాబు '1 - నేనొక్కడిన్' సినిమాలకు యాక్షన్ కొరియోగ్రాఫర్‌గా అతడు పనిచేశాడు.

యశోద సినిమాకు హరి శంకర్‌, హరీష్‌ నారాయణ్‌ దర్శకత్వం వహిస్తునారు. శివలెంక కృష్ణప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాలో వరలక్ష్మీ శరత్‌ కుమార్, ఉ‍న్ని ముకుందన్‌, రావు రమేష్, మురళీ శర్మ, సంపత్‌ రాజ్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా సమంతకు మరో బ్రేక్ ఇస్తుందని ఫిల్మ్ నగర్ టాక్. సమంత ఇంతకుమందు చేసిన యూ టర్న్, ఓ బేబీ సినిమాలకు యశోద భిన్నంగా ఉంటుందట. 

Also Read: Today Horoscope March 20 2022: ఈరోజు రాశి ఫలాలు.. ఆ రాశుల వారు డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాలి!!

Also Read: RRR Movie Tickets: గ్యాస్ సిలిండర్ తీసుకుంటే.. ఉచితంగా ఆర్ఆర్ఆర్ మూవీ టిక్కెట్లు! ఎక్కడో తెలుసా?!!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News