Liger : లైగర్ న్యూడ్ పోస్టర్ పై సమంత, రష్మిక హాట్ కామెంట్స్.. అనుష్క కూడా?

Heroines Hot comments on Vijay Devarakonda: లైగర్ చిత్రంలోని కొత్త పోస్టర్ రిలీజ్ చేసింది యూనిట్ . విజయ్ దేవరకొండ నగ్నంగా కనిపిస్తున్న ఈ పోస్టర్ మీద హీరోయిన్లు ఆసక్తికర కామెంట్లు చేస్తున్నారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Jul 2, 2022, 04:55 PM IST
Liger : లైగర్ న్యూడ్ పోస్టర్ పై సమంత, రష్మిక హాట్ కామెంట్స్.. అనుష్క కూడా?

Heroines Hot comments on Vijay Devarakonda's Liger Poster: చాలా ఫాస్ట్ గా సినిమాలు చేస్తారని పేరున్న పూరి జగన్నాధ్ దర్శకత్వంలో రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న తాజా చిత్రం 'లైగర్'. తెలుగు, తమిళ, కన్నడ, మళయాల, హిందీ బాషలలో ఈ సినిమా ఆగస్టు 25న విడుదల కాబోతోంది. త్వరలో రిలీజ్ అవుతున్న క్రమంలో ఈ సినిమా ప్రమోషన్స్ మొదలు పెట్టింది సినిమా యూనిట్. అందులో భాగంగా యూనిట్ లైగర్ చిత్రంలోని కొత్త పోస్టర్ రిలీజ్ చేసింది. ఈ పోస్టర్లో విజయ్ దేవరకొండ నగ్నంగా కనిపిస్తున్నాడు. మనతెలుగు హీరోలు ఇలాంటి ప్రయోగాలూ చేయడం కొత్త కావడంతో పోస్టర్ రిలీజ్ అయిన వెంటనే సోషల్ మీడియాలో వైరల్ అయింది. 

ఇక ఈ ఫోటో చూసిన స్టార్ హీరోయిన్లు సైతం విజయ్ దేవరకొండ బోల్డ్ లుక్ గురించి కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. సమంత, అనుష్క, జాన్వీ కపూర్, పూజా హెగ్డే, తమన్నా, రష్మిక మందన లాంటి వారు విజయ్ దేవరకొండ న్యూడ్ లుక్ కి ఫిదా అవుతూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ లుక్ ను తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ 'అతడికి రూల్స్ తెలుసు.. వాటిని బ్రేక్ చేయడం కూడా తెలుసు.. గట్స్ అండ్ గ్లోరీ' అంటూ విజయ్ దేవరకొండ న లుక్ పై సమంత కామెంట్స్ చేసింది. ఇక ఆయన వీరాభిమాని జాన్వీ కపూర్ ఇన్స్టా స్టోరీలో ' మనకి విజయ్ దేవరకొండ రూపంలో బాలీవుడ్ కి స్పెషల్ డెలివరీ రాబోతోంది. 

అది లైగర్ మూవీ' అంటూ కామెంట్ చేసింది. పూజా హెగ్డే గుడ్ లక్ మై జనగణమన గ్యాంగ్. లైగర్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా అని పోస్ట్ పెట్టండి. ఇక విజయ్ లవర్ అంటూ ప్రచారం జరుగతున్న రష్మిక ఏమో ఇప్పటి వరకు నీ ఇన్సిపిరేషన్ ఎవరని అడిగితే నేను ఎవరి పేరు చెప్పలేదు. ఇక నుంచి విజయ్ దేవరకొండ అని చెబుతా, లైగర్ నీకు మా ప్రేమ సపోర్ట్ ఉంది, ఈ దేశానికి నువ్వేంటో చూపించు' అంటూ వ్యాఖ్యలు చేసింది. 

అనుష్క ఈ పోస్టర్ని షేర్‌ చేస్తూ ‘లైగర్‌’ టీమ్‌కు ఆల్‌ ది బెస్ట్‌ చెప్పడమే కాక సినిమా ప్రతి ఒక్కరి హృదయాన్ని గెలుచుకోవాలని కోరుకుంటున్నానని పేర్కొంది. పూరీ సర్‌ మ్యాజిక్‌ చూసేందుకు ఆతృతగా ఎదురుచూస్తున్నా. విజయ్‌.. ఈ సినిమా నీ కెరీర్‌లో బెస్ట్‌ కావాలని, ఎన్నో విభిన్నమైన కథలు మాకందిస్తున్న ఛార్మి , ఆ కథలు తెరకెక్కించడంలో భాగమైన కరణ్‌జోహార్‌కు ధన్యవాదాలు’’ అంటూ పెద్ద మెసేజ్ రాసుకొచ్చారు. 
Also Read: RRR: తెలుగు సినిమాకు ఫిదా అయిన హాలీవుడ్ క్రిటిక్స్

Also Read: Pakka Commercial Collections: 'పక్కా కమర్షియల్‌' ఫస్ట్‌డే కలెక్షన్స్‌.. గోపీచంద్ కెరీర్‌లోనే హైయెస్ట్ ఓపెనింగ్స్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News