Gujarat Morbi Cable Bridge incident : ప్రధాని మోడిని పొగిడి అడ్డంగా బుక్కైన హీరో విశాల్.. అది కనపడలేదా?.. ఆడేసుకుంటున్న నెటిజన్లు

Morbi Cable Bridge incident గుజరాత్‌లో జరిగిన మోర్బీ కేబుల్ బ్రిడ్జ్ ఘటనలో ఇప్పటికే వందకు పైగా మంది మరణించిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఘటన ఇలా ఉంటే.. విశాల్ వేసిన ట్వీట్ మీద నెటిజన్లు మండి పడుతున్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 1, 2022, 04:48 PM IST
  • దేశ వ్యాప్తంగా మోర్బీ కేబుల్ బ్రిడ్జ్ ఘటన వైరల్
  • ప్రధాని మోడీని పొగిడిన హీరో విశాల్
  • హీరో మీద నెటిజన్ల కౌంటర్లు
Gujarat Morbi Cable Bridge incident : ప్రధాని మోడిని పొగిడి అడ్డంగా బుక్కైన హీరో విశాల్.. అది కనపడలేదా?.. ఆడేసుకుంటున్న నెటిజన్లు

Hero Vishal Praises PM Modi : ప్రధాని నరేంద్ర మోదీ మీద విశాల్ ప్రశంసలు కురిపించాడు. కాశీ ఎంతో బాగా ఉందని, గంగానది ఎంతో పవిత్రంగా మారిందని, ఎంతో సులభంగా అక్కడికి వెళ్లగలుగుతున్నాం.. ఇదంతా మీ వల్లే.. ఎంతో గొప్పగా డెవలప్ చేశారంటూ ఇలా విశాల్ ట్వీట్ వేశాడు. ఓ తమిళ హీరో ఇలా ట్వీట్ వేయడం, మోదీని పొగడటంలో నెటిజన్లలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఒకప్పుడు మోదీని తిట్టిన వారు ఇప్పుడు ఇలా పొగుతున్నారేంటని అంటున్నారు.

 

ఇక దేశం మొత్తం గుజరాత్‌ ఘటన గురించి మాట్లాడుకుంటున్నారు. మోర్బీ కేబుల్ బ్రిడ్జ్ ఘటనలో ఇప్పటికే వంద మందికి పైగా మృత్యువాత పడ్డారు. ఇంకా ఎంతో మంది గల్లంతయ్యారు. ఇది గుజరాత్‌లో జరగడంతో అందరూ ప్రధాని మోదీని విమర్శిస్తున్నారు.ఇక ప్రధాని వస్తున్నాడని రాత్రికి రాత్రి మోర్బీ ఆస్పత్రిని ప్రక్షాళన చేయడం మీద కూడా విమర్శలు వస్తున్నాయి

ఇలాంటి తరుణంలో మోదీని పొగుడుతూ విశాల్ ట్వీట్ వేయడంతో అందరూ ఆడేసుకుంటున్నారు. నీకు కాశీ, గంగానది కనిపిస్తోందా? అక్కడ గుజరాత్‌లో చనిపోయిన వ్యక్తులు, వారి కుటుంబాలు కనిపించడం లేదా? అక్కడి కేబుల్ బ్రిడ్జ్ తెగి అంత మంది చనిపోతే స్పందించలేదు గానీ వీటిపై ట్వీట్లు వేస్తున్నావా? అంటూ నెటిజన్లు దారుణంగా ఏకిపారేస్తున్నారు.

విశాల్ ఇక సినిమాల పరంగా చాలా వెనకపడిపోతోన్నాడు. కుప్పలు తెప్పలుగా సినిమాలతో వస్తున్నాడు. కానీ అందులో ఏ ఒక్కటి కూడా హిట్ అవ్వడం లేదు. వరుసగా సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయి. మూసధోరణిలో సినిమాలు తీస్తున్నాడంటూ నెటిజన్లు అనుకుంటున్నారు. చక్ర, ఖాకీ, ఎనిమీ ఇలా అన్ని సినిమాలు అంతగా ఆకట్టుకోలేకపోయాయి.

Also Read : Morbi Cable Bridge Collapse Video: కేబుల్ బ్రిడ్జ్‌పై భారీగా జనాలు.. ఎలా పడిపోతున్నారో చూడండి.. వీడియో వైరల్

Also Read : Manjima Mohan Lovestory : నా బతుకు అయిపోయిందన్న టైంలో వచ్చావ్!.. బాయ్ ఫ్రెండ్‌ను పరిచయం చేసిన మంజిమా మోహన్

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News