Hero Srikanth Son : హీరో శ్రీకాంత్ కొడుకు బర్త్ డే.. రోషన్ నెక్ట్స్ అప్డేట్ ఏంటంటే?

Happy Birthday Roshan Meka హీరో శ్రీకాంత్‌ ఫ్యామిలీకి సంబంధించిన విషయాలు ఎప్పుడూ కూడా బయటకు రావు. శ్రీకాంత్ తనయుడు రోషన్ బాలనటుడిగానూ ప్రయత్నించాడు. హీరోగానూ ట్రై చేశాడు. ఇప్పుడు తన కొత్త సినిమాలతో అల్లరి చేసేందుకు రెడీగా ఉన్నాడు.

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 13, 2023, 03:46 PM IST
  • తెరపై హీరోగా శ్రీకాంత్ తనయుడు
  • పెళ్లి సందడితో సందడి చేసిన రోషన్
  • బర్త్ డే స్పెషల్‌గా రోషన్ పోస్టర్
Hero Srikanth Son : హీరో శ్రీకాంత్ కొడుకు బర్త్ డే.. రోషన్ నెక్ట్స్ అప్డేట్ ఏంటంటే?

Happy Birthday Roshan Meka శ్రీకాంత్‌కు హీరోగా, నటుడిగా ఉన్న క్రేజ్ అందరికీ తెలిసిందే. ఇప్పుడు విలన్‌గానూ మెప్పించేశాడు. అలా అన్ని రకాలుగా శ్రీకాంత్‌ ఇప్పుడు దూసుకుపోతోన్నాడు. శ్రీకాంత్ తనయుడిగా రోషన్‌ ఇది వరకు తెరపై తన అదృష్టాన్ని ఎన్నో సార్లు పరీక్షించుకున్నాడు. రుద్రమ దేవి సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఎంట్రీ ఇచ్చాడు. ఆ తరువాత నిర్మలా కాన్వెంట్ అనే సినిమాలో స్కూల్, కాలేజ్ ఏజ్ కారెక్టర్‌ చేశాడు. తన వయసుకు తగ్గ పాత్రలో మెప్పించాడు.

ఇక పెళ్లి సందడి సినిమాతో హీరోగా రోషన్ ఎంట్రీ ఇచ్చాడు. అందులో శ్రీలీలతో కలిసి రోషన్ మెప్పించాడు. దర్శకేంద్రులు కే రాఘవేంద్రరావు పర్యవేక్షణలో గౌరీ రోణంకి డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమా అటు రోషన్‌కు, ఇటు శ్రీలీలకు బాగానే కలిసి వచ్చింది. హీరోగా రోషన్ లుక్స్, అప్పియరెన్స్, డ్యాన్సులు ఇలా అన్ని కూడా అందరినీ ఆకట్టుకున్నాయి.

ఇప్పుడు తన నెక్ట్స్ సినిమాకు సంబంధించిన అప్డేట్ ఇచ్చాడు రోషన్. ఈ మేరకు తన పుట్టిన రోజు స్పెషల్‌గా కొన్ని పోస్టర్లను కూడా వదిలారు. వైజయంతీ మూవీస్, వేదాంస్ పిక్చర్స్ ప్రొడక్షన్స్‌లో  కూడా తన తదుపరి సినిమాలతో రాబోతోన్నాయని రోషన్ చెప్పుకొచ్చాడు. అంటే వరుస పెట్టి సినిమాలను ఓకే చేస్తోన్నట్టుగా తెలుస్తోంది. ఈ ఏడాది మరోసారి హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతోన్నాడు రోషన్.

ఇక రోషన్‌కు ఫుల్ లెంగ్త్ కమర్షియల్ సినిమా ఒకటి పడితే గానీ ఇండస్ట్రీలో తన మార్క్ వేసుకోలేడు. ఇప్పుడు అయితే రోషన్ తన ఫోకస్ అంతా కూడా లవ్ స్టోరీల మీద పెట్టినట్టుగా తెలుస్తోంది. రోషన్‌కు ఎలాగూ తండ్రి క్లాస్ మాస్ ఆడియెన్స్‌ అభిమానుల సపోర్ట్, తల్లి ఊహ అభిమానుల అండ కూడా ఉంటుందని తెలిసిందే.

Also Read:  Oscars 2023 Live Updates: ఆస్కార్ విజేతల జాబితా, ఎవరెవరికి ఏ అవార్డులు

Also Read: Oscars 2023: తెలుగోడి సత్తాచాటిన 'నాటు నాటు'. Naatu Naatu పాటను వరించిన ఆస్కార్ అవార్డు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News