Ram Pothineni: విరాట్ కోహ్లీ బయోపిక్‍పై రామ్ ఆసక్తికర వ్యాఖ్యలు

Skanda Movie: ఎనర్జిటిక్ స్టార్‍  రామ్ పోతినేని హీరోగా నటిస్తున్న సినిమా స్కంద. ఈ మూవీ రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్ షురూ చేసింది చిత్రయూనిట్. ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూలో విరాట్ కోహ్లీ బయోపిక్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు హీరో రామ్.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Sep 24, 2023, 02:32 PM IST
Ram Pothineni: విరాట్ కోహ్లీ బయోపిక్‍పై రామ్ ఆసక్తికర వ్యాఖ్యలు

Ram Pothineni Comments On Virat Kohli Biopic: మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను-ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని కాంబోలో తెరకెక్కిన సినిమా స్కంద  (Skanda Movie). ఇందులో శ్రీలీల, సాయి మంజ్రేకర్ హీరోయిన్లుగా నటించారు. హై ఓల్టేజ్ యాక్షన్ అండ్ మాస్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీ సెప్టెంబరు 28న వరల్డ్ వైడ్‍గా రిలీజ్ కానుంది. ఈ సినిమాను తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేయనున్నారు. 'అఖండ 'లాంటి భారీ బ్లాక్ బాస్టర్ హిట్ తర్వాత బోయపాటి నుంచి వస్తున్న సినిమా కావడంతో స్కందపై వీర లెవల్లో అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే రిలీజైన సాంగ్స్, టీజర్, ట్రైలర్ మూవీపై వీర లెవల్లో అంచనాలను పెంచేశాయి. ఈ మూవీ రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో.. మూవీ ప్రమోషన్స్ ను షురూ చేసింది చిత్రయూనిట్. 

ఈ క్రమంలో రామ్‍ను ప్రముఖ వాయిస్ ఆర్టిస్ట్ సంకేత్ మాత్రే (Sanket Mhatre) ఇంటర్వ్యూ చేశారు. ఇంటర్వ్యూలో సంకేత్, రామ్ మధ్యలో విరాట్ కోహ్లీ ప్రస్తావన వచ్చింది. "మీరు విరాట్ కోహ్లీలా ఉన్నారని నెట్టింట చాలా మంది చెబుతూ ఉంటారు. ఒకవేళ ఆయన బయోపిక్‍లో నటించే అవకాశం వస్తే చేస్తారా?" అని సంకేత్ అడిగారు. ''ఒకవేళ కోహ్లీ బయోపిక్ లో ఛాన్స్ వస్తే తప్పుకుండా చేస్తా. దాని కోసం క్రికెట్ కూడా నేర్చుకుంటాను" అని రామ్ పోతినేని ఆసక్తికరంగా తన మనసులో మాట బయటపెట్టారు. ఇదే సమయంలో మీకు ఇష్టమైన బాలీవుడ్ హీరో ఎవరని రామ ను ప్రశ్నించగా.. షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్, ఆమీర్ ఖాన్, హృతిక్ రోషన్ అంటే చాలా ఇష్టమని.. ఈ తరం హీరోల్లో రణ్‍బీర్ కపూర్ నచ్చుతాడని రామ్ చెప్పుకొచ్చారు. రీసెంట్ గా జవాన్ షూటింగ్ స మయంలో షారుక్‍ను కలిసినట్లు తెలిపాడు. 

Also Read: BB 7 Telugu Updates: సందీప్, అమర్, రతికలను ఓ రేంజ్ లో ఏకిపారేసిన కింగ్.. ప్రిన్స్ పై ప్రశంసలు జల్లు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News