Prabhas: టాలీవుడ్‌కు దూరం కానున్న ప్రభాస్, ముంబైలోనే మకాం

Prabhas: హీరో ప్రభాస్ ఇప్పుడిక తెలుగు పరిశ్రమకు దూరమైపోతున్నట్టే కన్పిస్తోంది. నిజమే. బాహుబలి, సాహోలతో బాలీవుడ్ హీరోగా మారిపోయిన ప్రభాస్..మకాం కూడా మంబైకు మార్చేస్తున్నట్టు తెలుస్తోంది.   

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 3, 2021, 03:21 PM IST
Prabhas: టాలీవుడ్‌కు దూరం కానున్న ప్రభాస్, ముంబైలోనే మకాం

Prabhas: హీరో ప్రభాస్ ఇప్పుడిక తెలుగు పరిశ్రమకు దూరమైపోతున్నట్టే కన్పిస్తోంది. నిజమే. బాహుబలి, సాహోలతో బాలీవుడ్ హీరోగా మారిపోయిన ప్రభాస్..మకాం కూడా మంబైకు మార్చేస్తున్నట్టు తెలుస్తోంది. 

బాహుబలి (Bahubali)సాధించిన భారీ హిట్‌తో ప్రభాస్(Prabhas)రేంజ్ అమాంతం పెరిగిపోయింది. అనంతరం సాహో తెలుగులో ఫ్లాప్ అయినా హిందీలో 150 కోట్లకు పైగా సాధించడంతో ఇక తిరుగులేకుండా పోయింది. ఆ తరువాత వరుసగా పాన్ ఇండియా సినిమాల్లో బిజీ అయిపోయాడు. ఇక టాలీవుడ్‌కు క్రమంగా దూరమవుతున్నట్టు కన్పిస్తోంది. ఈ నేపధ్యంలో మకాం కూడా ముంబైకు మార్చాలని ప్లాన్ చేసుకున్నాడు బాహుబలి ప్రభాస్. వరుస పాన్ ఇండియా సినిమా(Pan india movies)లతో ప్రభాస్ షెడ్యూల్ బిజీగా ఉంది. దర్శకులు కూడా పాన్ ఇండియా కధలు సిద్ధం చేస్తున్నారు. ఈ క్రమంలోనే కేజీఎఫ్( KGF) దర్శకుడు ప్రశాంత్ నీల్‌( Prasanth neel)తో సలార్ సినిమా( Salar movie) చేస్తున్నాడు.మరోవైపు ఓం రౌవత్ దర్శకత్వంలో ఆదిపురుష్, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ సినిమా ఇలా బిజీగా మారిపోయాడు. ఒక్కో సినిమాకు పారితోషికం కూడా వంద కోట్లు తీసుకుంటున్నాడు. ఇండియాలో వంద కోట్లు తీసుకుంటున్న హీరో కూడా ప్రభాసే కావడం విశేషం. తెలుగులో కొనసాగేందుకు కూడా ప్రభాస్ ఇష్టపడటం లేదని సమాచారం. అందుకే ఇక బాలీవుడ్‌లో స్థిరపడే ఉద్దేశ్యంతో ముంబై ( Mumbai) కు మకాం మార్చేందుకు ప్లానింగ్ చేసుకున్నాడట.

ప్రస్తుతం ఆదిపురుష్( Adipurush) షూటింగ్ అంతా ముంబైలోనే జరగనుంది. సలార్ కధ కూడా ముంబైలో ఉండనుంది. ముంబైలో ఇంటి బాధ్యతలు ఆదిపురుష్ నిర్మాతల్లో ఒకరైన భూషణ్ కుమార్‌కు అప్పజెప్పినట్టు సమాచారం. ఇంటికి 50 కోట్ల వరకూ బడ్జెట్ కేటాయించనున్నాడు. సో ఓవరాల్‌గా ప్రభాస్ కేరాఫ్ అడ్రస్ ఇక ముంబైకు మారిపోతుందనడంలో ఏ మాత్రం సందేహం లేదనే తెలుస్తోంది. 

Also read: Prabhas house in Mumbai: ముంబై బీచ్ ఒడ్డున ప్రభాస్ ఇల్లు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News