Maa lift ban on actress hema: నటి హేమపై డ్రగ్స్ ఆరోపణలు టాలీవుడ్ ను కుదిపేశాయని చెప్పుకోవచ్చు. బెంగళూరు రేవ్ పార్టీలో నటి హేమ ఉన్నారంటూ కూడా పోలీసులు పలు ఆరోపణలుచేశారు. నటిహేమకు నోటీసులు సైతం ఇచ్చారు. అయితే.. నటి హేమ రేవ్ పార్టీ ఘటనలో సినిమాల్లో మాదిరిగా ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లు చోటుచేసుకున్నాయి. బెంగళూరు రేవ్ పార్టీలో నటి హేమ ఉన్నారంటూ కూడా బెంగళూరు పోలీసులు ఆరోపించారు. బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో దాదాపు.. వంద మందికి పైగా పాల్గొన్నట్లు తెలుస్తోంది. దీనిలో టాలీవుడ్ నుంచి నటి హేమ కూడా ఉన్నారని బెంగళూరు పోలీసులు ఆరోపణలుచేశారు. 80 మందికిపైగా రేవ్ పార్టీలో ఉన్న వారిని.. తమ ముందు హజరు కావాలంటూనోటీసులు జారీచేశారు.
కానీ ఆమె మాత్రం తన ఫామ్ హౌస్ లో ఉన్నానని వీడియో రిలీజ్ చేశారు. తాను నేచర్ ను ఎంజాయ్ చేస్తు చిల్ అవుతున్నానని కూడా వీడియో రిలీజ్ చేసింది. ఈ క్రమంలో.. నటి హేమ బిర్యానీ చేస్తున్నట్లు మరో వీడియో రిలీజ్ చేశారు. పలుమార్లు బెంగళూరు పోలీసులు తమ ముందు హజరు కావాలంటూ కూడా నోటీసులు జారీ చేశారు. నటి హేమ బెంగళూరు పోలీసులకు ప్రతిసారి ఏదో ఒకకారణంతో తప్పించుకొవడానికి ప్రయత్నిస్తుండంతో ఏకంగా పోలీసుల హైదరాబాద్ కు వచ్చి మరీ నటిహేమను బెంగళూరు తీసుకెళ్లారు.
అంతేకాకుండా.. కోర్టులో హజరుపర్చిన ఆమెను.. హేమ పరప్పన అగ్రహార జైలులో కొన్నిరోజుల పాటు రిమాండ్ కూడా విధించారు. ఈ నేపథ్యంలో.. కొన్నినెలల క్రితం హేమ జైలు నుంచి బెయిల్ మీద విడుదలైంది. అయితే.. గతంలో డ్రగ్స్ తీసుకున్న ఆరోపణల నేపథ్యంలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నటి హేమకు మా నుంచి సస్పెండ్ చేస్తు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో తాజాగా, నటి హేమ.. తన శరీరంలో ఎక్కడ కూడా డ్రగ్స్ ఆనవాళ్లు లేవని అత్యున్నత ప్రమాణాలతో కూడిన ల్యాబ్ లో టెస్టులు చేసుకున్న ల్యాబ్ రిపోర్ట్ ను మా కు పంపింది.
నటి హేమ తాజాగా.. తాను.డ్రగ్స్ తీసుకున్నట్లు వచ్చిన ఆరోపణలన్ని పూర్తిగా అవాస్తవమని అన్నారు. అంతేకాకుండా.. తాను అత్యున్నత ప్రమాణాలతో కూడా ల్యాబ్ లో టెస్టులు చేయించుకున్నానని చెప్పారు . ల్యాబ్ రిపోర్ట్ సైతం బహిరంగంగా విడుదల చేశారు. ఏకంగా.. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ల అపాయింట్ కోసం వీడియోను సైతం విడుదల చేశారు.
ఇదిలా ఉండగా.. హేమ తన తన గోర్లు, వెంట్రుకలు, శరీరంలో ఏ భాగాల్లో కూడా డ్రగ్స్ సాంపుల్స్ లేవని అన్నారు. అంతేకాకుండా.. తన మెంబర్ షిప్ పునురుద్ధరించాలని రిక్వెస్ట్ చేశారు. దీనిపై సానుకూలంగా స్పందించిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ టీమ్.. నటి హేమ మీద ఉన్న నిషేధం ఎత్తివేస్తు కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో నటి హేమ మంచు విష్ణుకు ఎక్స్ వేదికగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. కొంత మంది కావాలని తనను వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారని హేమ ఆవేదన వ్యక్తం చేశారు. 35 ఏళ్లుగా తాను సంపాదించుకున్న తన ఫెమ్ ను కొన్ని ఛానెళ్లు.. అప్రతిష్టపాలు చేశారని నటిహేమ వాపోయారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook