Hero Sunil: ‘వేదాంతం రాఘవయ్య’గా సునీల్

టాలీవుడ్‌లో ఇటీవల కాలంలో కమెడియన్ నుంచి హీరో స్థాయికి ఎదిగిన నటుడు ఎవరంటే.. వెంటనే మనకు సునీల్ (Sunil) పేరే గుర్తుకు వస్తుంది. అయితే కమెడియన్‌గా ప్రేక్షకాభిమానులను అలరించిన సునీల్‌.. హీరోగా మాత్రం అంతగా ఆకట్టుకోలేకపోయడు.

Last Updated : Aug 31, 2020, 05:58 PM IST
Hero Sunil: ‘వేదాంతం రాఘవయ్య’గా సునీల్

Harish shankar's presents a story for Sunil: టాలీవుడ్‌లో ఇటీవల కాలంలో కమెడియన్ నుంచి హీరో స్థాయికి ఎదిగిన నటుడు ఎవరంటే.. వెంటనే మనకు సునీల్ (Sunil) పేరే గుర్తుకు వస్తుంది. అయితే కమెడియన్‌గా ప్రేక్షకాభిమానులను అలరించిన సునీల్‌.. హీరోగా మాత్రం అంతగా ఆకట్టుకోలేకపోయడు. హీరోగా ఎంట్రీ ఇచ్చిన నాటి నుంచి ఆయనకు అంతగా అదృష్టం కలిసిరాలేదు. అయితే.. ఈ మధ్య కాలంలో ఆయన మరలా కమెడియన్‌గా.. నెగిటివ్ రోల్‌లో నటించి మళ్లీ ఆకట్టుకుంటున్నాడు. మళ్లీ త్వ‌ర‌లోనే హీరోగా వెండితెర‌పై సంద‌డి చేయ‌డానికి సిద్ధ‌మ‌య్యాడు సునీల్. మాస్, ఫ్యామిలీ ప‌ల్స్ తెలిసిన డైన‌మిక్ డైరెక్ట‌ర్ హ‌రీష్ శంక‌ర్ ( Harish shankar) ఈ చిత్రానికి సమర్పకులుగా వ్యవహరించనున్నారు. 

సునీల్ ప్రధాన పాత్ర‌లో ‘వేదాంతం రాఘ‌వ‌య్య‌’ చిత్రాన్ని అధికారికంగా ప్ర‌క‌టించారు ప్ర‌ముఖ దర్శ‌కుడు హ‌రీశ్ శంక‌ర్. ఈ చిత్రానికి శంకర్ స‌మ‌ర్ప‌కులుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. 14 రీల్స్ ప్ల‌స్ బ్యాన‌ర్‌పై రామ్ ఆచంట‌, గోపీచంద్ ఆచంట ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. త్వ‌ర‌లోనే సినిమాలో న‌టించ‌బోయే న‌టీన‌టులు, ద‌ర్శ‌కుడు స‌హా ఇత‌ర‌ సాంకేతిక నిపుణుల వివ‌రాల‌ను ప్ర‌టిస్తామ‌ని చిత్ర యూనిట్ సోమవారం తెలిపింది. ఈ మేరకు హరీష్ శంకర్, హీరో సునీల్, నిర్మాతలు, తదితరులు వేదాంతం రాఘవయ్య అనే పోస్టర్‌ను పలు సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలల్లో పంచుకున్నారు. Also read:Acharya దర్శకుడి సంస్కారానికి నమస్కారం: హరీష్ శంకర్

గ‌ద్ద‌ల‌కొండ గ‌ణేష్ చిత్రంతో ప్రేక్ష‌కుల‌ని అలరించిన హ‌రీష్ శంక‌ర్ ప్ర‌స్తుతం ఈ సినిమాకు క‌థ‌, మాటలు అందించి ఒక కొత్త దర్శకుడిని పరిచయం చేస్తారని సినీ ఇండస్ట్రీలో టాక్. ఏదీఏమైనప్పటికీ సునీల్‌కు మళ్లీ పాత రోజులు వస్తాయని అభిమానులు భావిస్తున్నారు. అయితే ఈ సినిమా గురించి మరిన్ని వివరాలు తెలియాలంటే.. మరికొన్ని రోజులు ఆగక తప్పదు. Also read: Maadhavi Latha: డ్రగ్స్ మత్తులో టాలీవుడ్‌.. సార్లు ఓ కన్నేయండి

Trending News