Vijay Deverakonda New Movie: సుకుమార్ కంటే ముందే పవన్ డైరెక్టర్ తో విజయ్ దేవరకొండ?

Harish Shankar to direct Vijay Deverakonda Before Sukumar Movie: లైగర్ డిజాస్టర్ తరువాత విజయ్ తదుపరి సినిమాల మీద ద్రుష్టి పెట్టారు. ఆ వివరాల్లోకి వెళితే

Written by - Chaganti Bhargav | Last Updated : Sep 5, 2022, 09:48 AM IST
Vijay Deverakonda New Movie: సుకుమార్ కంటే ముందే పవన్ డైరెక్టర్ తో విజయ్ దేవరకొండ?

Harish Shankar to direct Vijay Deverakonda Before Sukumar Movie: పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో విజయ్ దేవరకొండ హీరోగా అనన్య పాండే హీరోయిన్ గా రూపొందిన తాజా చిత్రం లైగర్ సినిమా దారుణమైన ఫలితాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఈ దెబ్బతో చార్మి సోషల్ మీడియాకు బ్రేక్ ప్రకటించగా విజయ్ దేవరకొండ మాత్రం తన తదుపరి సినిమాల మీద దృష్టి పెట్టారు. లైగర్ సినిమా విడుదలైన రోజే విజయ్ దేవరకొండ ఫలితంతో సంబంధం లేకుండా జిమ్ లో కసరత్తులు చేస్తున్న వీడియోని విజయ్ దేవరకొండ టీం షేర్ చేసింది.

దీంతో ఇప్పుడు విజయ్ దేవరకొండ తన తదుపరి సినిమాల మీద దృష్టి పెట్టాడని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే విజయ్ దేవరకొండ శివ నిర్వాణ దర్శకత్వంలో ఖుషీ అనే సినిమా చేస్తున్నాడు. సమంతా రూత్ ప్రభు హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకి సంబంధించి 70% షూటింగ్ పూర్తయింది. ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ మీద రూపొందిస్తున్నారు. విజయ్ దేవరకొండ సుకుమార్ డైరెక్షన్లో ఒక సినిమా చేయాల్సి ఉంది. అయితే సుకుమార్ ఇంకా పుష్ప సీక్వెల్ సినిమా ప్రారంభించలేదు.

ఆ సినిమా పూర్తి చేసిన తర్వాతే విజయ్ దేవరకొండతో సుకుమార్ సినిమా చేసే అవకాశం ఉంది. అయితే ఈ క్రమంలో విజయ్ దేవరకొండ గతంలో దిల్ రాజుకు దగ్గర తీసుకున్న అడ్వాన్సుకు గాను ఆయనతో ఒక సినిమా చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దిల్ రాజు తన బ్యానర్ లో సినిమాలు చేసే దర్శకులకే ఎక్కువ అవకాశాలు ఇస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ డేట్స్ కోసం ఎదురుచూస్తున్న హరీష్ శంకర్ తో విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో ఒక సినిమా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.

హరీష్ శంకర్ ప్రస్తుతానికి ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ సిద్ధం చేసే పనిలో ఉన్నారని స్క్రిప్ట్ సిద్ధమైన తర్వాత ఖుషి సినిమా షూటింగ్ పూర్తయిన వెంటనే విజయ్ దేవరకొండ హరీష్ శంకర్ కాంబినేషన్ సినిమా ప్రారంభమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఖుషి సినిమాతో ఎలా అయినా హిట్ కొడతారని విజయ్ దేవరకొండ అభిమానులు నమ్మకం పెట్టుకున్నారు. శివ నిర్వాణ లవ్ స్టోరీస్ తీర్చిదిద్దడంలో సిద్ధ హస్తుడు కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేకుండా హిట్టు కొట్టవచ్చు అని వారు నమ్ముతున్నారు. చూడాలి మరి ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అని.

Also Read: Bigg Boss Telugu 6: కామన్ మ్యాన్ లను దారుణంగా మోసం చేసిన బిగ్ బాస్ యాజమాన్యం!

Also Read: Warangal Srinu on Liger: విజయ్ దేవరకొండ అతి నమ్మకం... లైగర్ రిజల్ట్ పై వరంగల్ శ్రీను కామెంట్స్ వైరల్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News