Special Poster from Radhe shyam: హ్యాపీ బర్త్ డే పూజ.. స్పెషల్ పోస్టర్ విడుదల చేసిన రాధేశ్యామ్

బుట్ట బొమ్మ బర్త్ డే సందర్భంగా 'రాధే శ్యామ్' సినిమా నిర్మిస్తున్న యూవీ క్రియేషన్స్ పోస్టర్ విడుదల చేస్తూ బర్త్ డే విషెస్ తెలిపింది. వైట్ డ్రెస్ లో ఉన్న పూజా లుక్స్ ఆకట్టుకుంటున్నాయి.

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 13, 2021, 12:14 PM IST
  • ఈ రోజు తెలుగు బుట్ట బొమ్మ బర్త్ డే
  • విషెస్ తెలుపుతూ పోస్టర్ విడుదల చేసిన రాధేశ్యామ్ టీమ్
  • వైట్ డ్రెస్ లో ఆకట్టుకుంటున్న పూజ హెగ్డే లుక్
Special Poster from Radhe shyam: హ్యాపీ బర్త్ డే పూజ.. స్పెషల్ పోస్టర్ విడుదల చేసిన రాధేశ్యామ్

Pooja Hegde Birthday Special Poster from Radhe Shyam: ప్రస్తుతం టాలీవుడ్ (Tollywood) లో టాప్ హీరోయిన్ ఎవరంటే ఏ మాత్రం ఆలస్యం చేయకండా నోట్లోకి వచ్చే పేరు 'పూజాహెగ్డే' (Pooja Hegde). తెలుగులో ఒక లైలా కోసం సినిమాలో నాగ చైతన్య (Nagachaitanya) తో జతకట్టిన ఈ సుందరి తక్కువ సమయంలోనే టాప్ హీరోయిన్ గా ఎదిగింది. వరుస సినిమాలతో బిజీగా మారిపోయిన పూజ.. తెలుగుతో (Telugu) పాటు తమిళ్ (Tamil), హిందీ (Hindi) భాషల్లోనూ సినిమాలు చేస్తూ తీరిక లేకుండా ఉంటుంది. 

తెలుగు బుట్ట బొమ్మగా (Butta Bomma) పాపులారిటీ పొందిన పూజ హెగ్డే ఈ రోజు బర్త్ డే కావడంతో సోషల్ మీడియాలో భారీగానే విషెస్ తెలుపుతున్నారు. ప్రస్తుతం తమిళ్ లో హీరో విజయ్ (Tamil Hero VIjay ) సరసన 'బీస్ట్' (Beast Movie) సినిమాలో హీరోయిన్ గా నటిస్తుండగా... తెలుగులో ప్రభాస్ (Prabhas) సరసన 'రాధే శ్యామ్' (Radhe Shyam Movie) సినిమాలో మరియు అక్కినేని అఖిల్‌కు (Akkineni Akhil) జోడీగా నటించిన 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' (Most Eligible Bachelor) సినిమాలో హీరోయిన్ గా నటించగా ఈ రెండు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.

Also Read: APPSC Notification Released: గుడ్ న్యూస్... ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన ఏపీపీఎస్సీ

ఇక రాధే శ్యామ్ విషయానికి వస్తే.. కె. రాధాకృష్ణకుమార్‌ (K. RadhaKrishna Kumar) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన హీరోయిన్ గా పూజా నటిస్తుంది. బుధవారం అనగా అక్టోబర్ 13 న పూజ హెగ్డే బర్త్ డే సందర్భంగా రాధేశ్యామ్ సినిమా యూనిట్ విషెస్ తెలుపుతూ ఒక పోస్టర్ ను విడుదల చేసింది. "ప్రతి ఒక్కరి హృదయాన్ని గెలిచిన మా యువరాణి 'ప్రేపణ'కి (Prearna) బర్త్ డే శుభాకాంక్షాలు అంటూ యూవీ క్రియేషన్స్‌ (UV Creations) తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్టర్ ను విడుదల చేసింది. ఈ పోస్టర్ లో వైట్ డ్రెస్ లో పూజా హెగ్డే నిజంగానే యువరాణిలా కనపడుతుంది. ఈ అద్భుతమైన పోస్టర్ తో అందరిని ఆకట్టుకుంది పూజా..

వచ్చే సంవత్సరం జనవరి 14 న విడుదల కానున్న రాధేశ్యామ్ సినిమాను గోపీ కృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ బ్యానర్ల మీద వంశీ, ప్రమోద్, ప్రసీద సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పాన్ ఇండీయా లెవల్ లో ఈ సినిమా రూపొందుతున్న సంగతి మన అందరికీ తెలిసిందే!

Also Read: Bigg Boss 5: హైపర్ ఆది క్రేజ్ మామూలుగా లేదుగా..! 25 నిమిషాలకే షాకింగ్ రెమ్యూనరేషన్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News