Keerthy Suresh Birthday : కీర్తి సురేశ్‌ పుట్టినరోజున పోస్టర్స్ హంగామా..

Bhola shankar Sarkaru Vaari Paata teams releases Keerthi Sureshs birthday poster: మహానటి సినిమాతో ఉత్తమ నటిగా జాతీయ అవార్డును సొంతం చేసుకున్న కీర్తి.. ప్రస్తుతం తెలుగులో భోళా శంకర్‌, సర్కారు వారి పాట, గుడ్‌లక్‌ సఖి చిత్రాల్లో నటిస్తోంది ఈ ముద్దుగుమ్ము. నేడు (అక్టోబర్‌ 17, ఆదివారం) కీర్తి సురేశ్‌ పుట్టినరోజు. ఇక కీర్తి నటిస్తోన్న సినిమాల నుంచి కీర్తి బర్త్‌డే సందర్భంగా ఫుల్ అప్‌డేట్స్.. పోస్టర్స్ రిలీజ్‌ అయ్యాయి.

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 17, 2021, 01:41 PM IST
  • నేడు (అక్టోబర్‌ 17, ఆదివారం) కీర్తి సురేశ్‌ పుట్టినరోజు
  • తెలుగులో భోళా శంకర్‌, సర్కారు వారి పాట, గుడ్‌లక్‌ సఖి చిత్రాల్లో నటిస్తోన్న కీర్తి సురేశ్‌
  • కీర్తి బర్త్‌డే సందర్భంగా ఫుల్ అప్‌డేట్స్.. పోస్టర్స్ రిలీజ్‌
Keerthy Suresh Birthday : కీర్తి సురేశ్‌ పుట్టినరోజున పోస్టర్స్ హంగామా..

Happy Birthday Keerthy Suresh: Bhola shankar Sarkaru Vaari Paata teams releases Keerthi Sureshs birthday poster: ప్రస్తుతం సౌత్‌ ఇండ‌స్ట్రీలో టాప్‌ హీరోయిన్‌గా కొనసాగుతోంది కీర్తి సురేశ్‌ (Keerthy Suresh). అందం, అభినయంతో ప్రేక్షకుల మదిలో ప్రత్యేక స్థానం సంపాదించింది కీర్తి. మహానటి సినిమాతో ఉత్తమ నటిగా జాతీయ అవార్డును సొంతం చేసుకున్న కీర్తి.. ప్రస్తుతం తెలుగులో భోళా శంకర్‌, (Bhola shankar) సర్కారు వారి పాట, (Sarkaru Vaari Paata) గుడ్‌లక్‌ సఖి చిత్రాల్లో నటిస్తోంది ఈ ముద్దుగుమ్ము. నేడు (అక్టోబర్‌ 17, ఆదివారం) కీర్తి సురేశ్‌ పుట్టినరోజు. ఇక కీర్తి నటిస్తోన్న సినిమాల నుంచి కీర్తి బర్త్‌డే సందర్భంగా ఫుల్ అప్‌డేట్స్.. పోస్టర్స్ రిలీజ్‌ అయ్యాయి. 

మెగాస్టార్‌ చిరంజీవి (Megastar Chiranjeevi) హీరోగా మెహ‌ర్ ర‌మేశ్‌ దర్శకత్వంలో ‘భోళా శంకర్‌’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. తమిళ సూపర్‌హిట్‌ 'వేదాళం' చిత్రానికి రీమేక్‌ ఇది. ఈ మూవీలో మెగాస్టార్‌‌కు చెల్లెలిగా హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ నటిస్తున్నారు. నేషనల్‌ అవార్డ్‌ విన్నర్‌.. టాలెంటెడ్‌ కీర్తి సురేశ్‌కు జన్మదిన శుభాకాంక్షలు (Keerthy Suresh birthday wishes) మూవీ యూనిట్ ట్వీట్‌ చేసింది.

 

Also Read : Alai Balai: అలయ్‌ బలయ్‌లో సందడి చేసిన సినీ, రాజకీయ ప్రముఖులు, ఒకే వేదికపై పవన్‌, విష్ణు

ఇక సర్కారు వారి పాట (Sarkaru Vaari Paata) చిత్రంలో సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబుకు జోడీగా కీర్తి సురేశ్‌ నటిస్తోంది. ఈ మూవీ పరశురాం దర్శకత్వంలో తెరకెక్కుతోంది. క్యూటీ బ్యూటీ కీర్తి (Keerthy) పుట్టినరోజు సందర్భంగా మూవీ యూనిట్‌.. ఆమెకు బర్త్‌డే విషెస్‌ తెలిపింది. కీర్తి సురేశ్‌కు బర్త్‌డే విషెస్‌ తెలుపుతూ.. మూవీ టీం ట్వీట్‌ చేసింది. సర్కారు వారి పాట మూవీ నుంచి కీర్తి బర్త్‌డే పోస్టర్‌ను మేకర్స్‌ రిలీజ్‌ చేశారు. మైత్రీ మూవీ మేకర్స్‌, జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, 14 ప్లస్‌ రీల్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న సర్కారు వారి పాట మూవీ వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది.

అలాగే ఈ మోస్ట్‌ బ్యూటిఫుల్‌ అండ్‌ టాలెంటెడ్‌ హీరోయిన్‌ కీర్తి సురేశ్.. జాతీయ అవార్డు గ్రహీత నగేశ్ కుకునూర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న గుడ్ లక్ సఖి.. (good luck sakhi) మూవీలో రైఫిల్ షూటర్‌గా కనిపించనుంది. ఆది పినిశెట్టి కీర్తికి జోడీగా నటించనుంది. పల్లెటూరి అమ్మాయి నుంచి జాతీయస్థాయి రైఫిల్ షూటర్‌గా ఎలా మారిందనే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ మూవీ యూనిట్‌ కూడా.. కీర్తి సురేశ్‌కు (Keerthy Suresh)విషెస్ తెలుపుతూ పోస్టర్‌‌ రిలీజ్ చేసింది. నవంబర్‌లో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. 

Also Read : AHA OTT: ఆహాలో 'లవ్​స్టోరి'.. ఎప్పటి నుండో తెలుసా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News