Allu Arjun: తగ్గేదే లే.. అల్లు అర్జున్ వ్యానిటీ వ్యాన్‌ అదిరిపోయింది! ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

Allu Arjun Birthday. షూటింగ్‌ సమయంలో ఉపయోగించుకోవడానికి సకల సౌకర్యాలతో ఓ వ్యానిటీ వ్యాన్‌ను స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తయారు చేయించుకున్నాడు. దానికి ఫాల్కన్‌ అని పేరు పెట్టుకున్నాడు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 8, 2022, 09:28 PM IST
  • ఏప్రిల్‌ 8న బన్నీ బర్త్‌డే
  • తగ్గేదే లే.. అల్లు అర్జున్ వ్యానిటీ వ్యాన్‌ అదిరిపోయింది
  • వ్యానిటీ వ్యాన్‌ ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
Allu Arjun: తగ్గేదే లే.. అల్లు అర్జున్ వ్యానిటీ వ్యాన్‌ అదిరిపోయింది! ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

Happy Birthday Allu Arjun: Pushpa Movie star have Rs 7 crore vanity van: ఏ ముహూర్తాన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, లెక్కల మాస్టారు సుకుమార్ జతకట్టారో కానీ.. బన్నీ లైఫ్ ఒక్కసారిగా టర్న్ అయిపొయింది. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన 'ఆర్య' సినిమాతో మంచి హిట్ కొట్టిన అల్లు అర్జున్.. 'ఆర్య 2'తో మరో స్థాయికి చేరుకున్నాడు. ఇక 'పుష్ప' సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా మారాడు. కరోనా పాండమిక్ సమయంలో కూడా ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా బాక్స్ ఆఫీస్‌ను షేక్ చేసింది. దక్షణాది అన్ని బాషల కంటే హిందీ ప్రేక్షకులు ఈ సినిమాకి బ్రహ్మరధం పట్టారు. దాంతో దేశవ్యాప్తంగా అల్లు అర్జున్ పేరు మార్మోగిపోతోంది. 

అల్లు అర్జున్‌ ఇప్పుడు పాన్‌ ఇండియా స్టార్‌.. తన లైఫ్‌ స్టైల్‌ కూడా 'తగ్గేదే లే' అన్నట్టుగా ఎంతో విలాసవంతంగా ఉంటుంది. తన ఇల్లు, గ్యారేజ్ సహా వ్యానిటీ వ్యాన్‌ కూడా విలాసవంతంగా ఉంటుంది. నలుపు రంగు ఇష్టపడే బన్నీ.. ఇంటిని మాత్రం తెల్లని రంగుతో తీర్చిదిద్దుకున్నాడు. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో ఉండే తన ఇల్లుకు 'బ్లెస్సింగ్‌' అని పేరు పెట్టుకున్నాడు. ఇందులో స్విమ్మింగ్‌ పూల్‌, జిమ్‌, హోం థియేటర్‌, ఆటస్థలం ఇలా సకల సౌకర్యాలు ఉన్నాయి. 

ఇక అల్లు అర్జున్ గ్యారేజీ కూడా లగ్జరీ వాహనాలతో నిండి ఉంటుంది. రేంజ్‌ రోవర్‌ వోగ్‌, హమ్మర్‌ హెచ్‌2, మెర్సిడెస్‌ 200 సీడీఐ, జాగ్వార్​ ఎక్స్ జే​ఎల్, వోల్వో ఎక్స్ సీ90 టీ8 ఎక్సలెన్స్ లాంటి లగ్జరీ వాహనాలు ఉన్నాయి. ఇక షూటింగ్‌ సమయంలో ఉపయోగించుకోవడానికి సకల సౌకర్యాలతో ఓ వ్యానిటీ వ్యాన్‌ను బన్నీ తయారు చేయించుకున్నాడు. దానికి ఫాల్కన్‌ అని పేరు పెట్టుకున్నాడు. అందులో ఎక్కడ చూసినా ఏఏ అక్షరాలు ఉంటాయి. ఈ  వ్యాన్‌లో పెద్ద తెరతో కూడిన టీవీ సెట్‌, రిఫ్రిజిరేటర్‌, అడ్డం, విలాసవంతమైన సోఫా, బెడ్ ఇలాంటి వసతులెన్నో ఉన్నాయి. ఈ వ్యానిటీ ఖరీదు రూ.7 కోట్లు. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Allu Arjun (@alluarjunonline)

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్.. శుక్రవారం తన 40వ పుట్టిన రోజు జరుపుకుంటున్నాడు. ఏప్రిల్‌ 8న బన్నీ బర్త్‌డే సందర్భంగా సోషల్‌ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి. అభిమానులు, సెలబ్రెటీలు బన్నీకి స్పెషల్‌ విషెస్‌ తెలుపుతున్నారు. దాంతో బన్నీ పేరు ట్విట్టర్‌లో ట్రెండ్ అవుతోంది. ప్రస్తుతం పుష్ప సినిమా ఇచ్చిన విజయంను బన్నీ ఎంజాయ్ చేస్తున్నారు. త్వరలోనే పుష్ప 2 షూటింగ్‌లో పాల్గొననున్నారు.  

Also Read: RGV: రామ్ గోపాల్ వర్మని ముద్దుల్లో ముంచెత్తిన ప్రముఖ హీరోయిన్.. వీడియో చూస్తే మతిపోవాల్సిందే!

Also Read: Yami Gautam: ఇప్పటివరకూ మీ పోర్టల్‌ని ఫాలో అయ్యేదాన్ని.. ఇకపై కాను! రివ్యూపై యామీ గౌతమ్ ఆగ్రహం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News