Happy Bday Allu Arjun Best Movies from Pushpa to Gangotri: ఒకప్పటి టాలీవుడ్ టాప్ కమెడియన్ అల్లు రామలింగయ్య మనవడుగా మెగాస్టార్ చిరంజీవి అల్లుడిగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. అల్లు అర్జున్ మొదటి సినిమానే అప్పటికే సూపర్హిట్లు అందించిన డైరెక్టర్ రాఘవేంద్రరావు దర్శకత్వంలో చేసి మొదటి సినిమాతోనే హిట్ అందుకున్నాడు అల్లు అర్జున్. ఇక స్టైలిష్ స్టార్ గా పేరు తెచ్చుకున్న ఆయన పుష్ప సినిమా దెబ్బతో ఐకాన్ స్టార్ గా అవతరించాడు.
ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ కెరీర్ లో టాప్ టెన్ సినిమాలేమిటి? ఏఏ సినిమాలను మీరు మిస్ అవ్వకుండా చూడాలి అనే లిస్టు మీ ముందుకు తీసుకొస్తున్నాం. ఈ రోజు ఆయన బర్త్‌డే స్పెషల్ గా తీసుకొస్తున్నాము ఈ ఆర్టికల్ చూసేయండి మరి. ముందుగా ఆయన కెరీర్ లో చెప్పుకోదగ్గ సినిమాల్లో పుష్ప ఒకటి.
అప్పటివరకు ఒక లెక్క పుష్ప తర్వాత ఒక లెక్క అన్నట్టుగా అల్లు అర్జున్ కెరీర్ ని ఈ సినిమా మార్చేసింది. సుకుమార్ డైరెక్షన్లో రూపొందిన సినిమా అల్లు అర్జున్ కెరియర్ లోనే అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాగా నిలిచింది. ఈ సినిమాకు ఐఎండీబీ రేటింగ్ 7.6 గా ఉండగా సినిమా ప్రస్తుతానికి అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది. ఇక హ్యాపీ సినిమా కూడా ఆయన బెస్ట్ సినిమాల జాబితాలో ఉంటుంది. అల్లు అర్జున్ కెరీర్ మొదట్లో వచ్చిన ఈ సినిమా దాదాపు 7.1 ఐఎండీబీ రేటింగ్ దక్కించుకుంది.
Also Read: Telugu OTT Releases This Week: 2 కోట్లు పెడితే 50 కోట్లు కలెక్ట్ చేసిన సినిమా ఎందులో అంటే?
ఈ సినిమా ప్రస్తుతానికి యూట్యూబ్ లో అందుబాటులో ఉంది ఇక అల్లు అర్జున్ కెరీర్లో తప్పక చూడాల్సిన మూడో సినిమాగా అల వైకుంఠపురంలో సినిమా ఉంది. త్రివిక్రమ్ డైరెక్షన్లో రూపొందిన ఈ సినిమా 2020లో రిలీజ్ అయింది. ఈ సినిమాకి ఐఎండీబీ లో 7.3 రేటింగ్ ఉంది. ప్రస్తుతానికి ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది. ఇక సన్నాఫ్ సత్యమూర్తి సినిమాకి 7. 0 రేటింగ్ రాగా ప్రస్తుతానికి యూట్యూబ్‌లో అందుబాటులో ఉంది . ఇక అల్లు అర్జున్ కెరియర్ లో 5వ టాప్ సినిమాగా జులాయి నిలుస్తోంది.
ఐఎండీబీలో 7.2 రేటింగ్ దక్కించుకున్న ఈ సినిమా ప్రస్తుతానికి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సహా ఎంఎక్స్ ప్లేయర్ లో అందుబాటులో ఉంది. ఇక అల్లు అర్జున్ కెరీర్ లో ఆరవ సినిమాగా రేసుగుర్రం ఉంది. సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో రూపొందిన ఈ సినిమాకి ఐఎండీబీలో 7.2 రేటింగ్ ఉంది. సోనీ లీవ్, అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమా అందుబాటులో ఉంది. ఇక వేదం సినిమా అల్లు అర్జున్ టాప్ టెన్ సినిమాలు జాబితాలో ఏడో స్థానం దక్కించుకుంది ఈ సినిమాకి ఐఎండిబి లో అత్యధికంగా 8.1 రేటింగ్ ఉంది.
ప్రస్తుతానికి ఆహా ఎంఎక్స్ ప్లేయర్ లో ఈ సినిమా అందుబాటులో ఉంది. ఇక అల్లు అర్జున్ కెరీర్ లో పరుగు సినిమా ఈ జాబితాలో ఎనిమిదో స్థానం దక్కించుకుంది. ఐఎండిబి రేటింగ్ లో 7.1 రేటింగ్ దక్కించుకున్న ఈ సినిమా ప్రస్తుతం ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇక అల్లు అర్జున్ టాప్ టెన్ బెస్ట్ మూవీస్ జాబితాలో దేశముదురు, గంగోత్రి సినిమాలు కూడా నిలిచాయి. దేశముదురు సినిమా ఐఎండీబీ రేటింగ్ లో 6.1 తెచ్చుకుంటే గంగోత్రి సినిమా మాత్రం ఐఎండీబీ జాబితాలో రేటింగ్ దక్కించుకోలేకపోయింది. కానీ అల్లు అర్జున్ బెస్ట్ సినిమాస్‌లో కచ్చితంగా చోటు దక్కించుకుంది.
Also Read: Telugu OTT Releases This Week: 2 కోట్లు పెడితే 50 కోట్లు కలెక్ట్ చేసిన సినిమా ఎందులో అంటే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook