HanuMan OTT: హనుమాన్ ఓటీటీ రిలీజ్.. ఎక్కడ.. ఎప్పుడో తెలుసా?

HanuMan OTT Release Date: సంక్రాంతికి విడుదల బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేసిన సినిమా హనుమాన్. స్టార్ హీరోల సినిమాలు సైతం వెనక్కి నెట్టేసి మరీ ఈ చిత్రం కలెక్షన్స్ సొంతం చేసుకోండి ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ చిత్ర ఓటీటీ డీటెయిల్స్ బయటకు వచ్చాయి..

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 29, 2024, 02:25 PM IST
HanuMan OTT: హనుమాన్ ఓటీటీ రిలీజ్.. ఎక్కడ.. ఎప్పుడో తెలుసా?

HanuMan Free Download: ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జ హీరోగా చేసిన సినిమా హనుమాన్. సంక్రాంతి సందర్భంగా జనవరి 12న విడుదలైన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇప్పటికే 250 కోట్ల పైగా కలెక్షన్ సాధించి 300 కోట్ల క్లబ్ వైపు దూసుకుపోతోంది

తాజాగా ఈ చిత్ర ఓటీటీపి డీటెయిల్స్ అధికారికంగా వెలువద్దాయి. ఈ సినిమా విడుదలకు ముందే ఈ చిత్ర డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని జీ సంస్థ సొంతం చేసుకోవడం వల్ల తక్కువ డబ్బులకే సొంతం చేసుకున్నారని చాలా రోజుల నుంచి వార్తలు వినిపిస్తూ వచ్చాయి. హనుమాన్ సినిమాను జీ5 సంస్థ మొత్తంగా రూ. 16 కోట్లకు కొనుగోలు చేసినట్లు సమాచారం. అందులో హనుమాన్ తెలుగు వెర్షన్‌కు రూ. 12 కోట్లు, హిందీ వెర్షన్‌కు రూ. 5 కోట్లు వెచ్చించినట్లు టాక్. కాగా ఇప్పుడు ఓటీటీ స్క్రీమింగ్ డేట్ పై కూడా అప్డేట్ వచ్చేసింది. 

ఈ చిత్రం జీ5 లో మార్చ్ మొదటి వారంలో స్క్రీమింగ్ కాబోతున్నట్లు తెలుస్తోంది. ముందు చేసుకున్న ఒప్పందం ప్రకారం ఈ చిత్రం విడుదలైన మూడు వారాలకే ఓటీటీలోకి రావాల్సి ఉంది. కానీ సినిమా ఇంకా కూడా థియేటర్స్ లో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న నేపథ్యంలో.. ఈ చిత్రాన్ని 55 రోజుల తరువాత ఓటీటీలోకి తీసుకురావడానికి సిద్ధమయ్యారు. దీన్ని బట్టి చూస్తే ఈ చిత్రం మార్చ్ మొదటి వారంలో జీ ఫైవ్ లో స్ట్రీమింగ్ కి సిద్ధమవుతోంది.

జనవరి 12న అంటే శుక్రవారం తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం, మరాఠీ, ఇంగ్లీష్, స్పానిష్, కొరియన్, చైనీస్, జపనీస్ భాషల్లో హనుమాన్ విడుదలైంది. విడుదలైన అన్ని భాషలలో కూడా ఈ సినిమా మంచి స్పందన తెచ్చుకుంది. కాగా హనుమాన్ మూవీని ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌పై కె నిరంజన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. హనుమాన్ చిత్రంలో తేజ సజ్జా హీరోగా, అమృత అయ్యర్ హీరోయిన్‌గా చేశారు. వీరితోపాటు సినిమాలో వినయ్ రాయ్, వరలక్ష్మీ శరత్ కుమార్, సముద్రఖని కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీకి రూ. 50 కోట్ల బడ్జెట్ అయినట్లు సమాచారం.

Also Read: India Vs Eng: ఉప్పల్‌లో భారత జట్టుకు తీవ్ర నిరాశ.. టామ్ హార్ట్‌లేకు హార్ట్‌ లేదబ్బా

Also Read: Bottole Thrash: 'బాటిల్‌' కోసం చెప్పుతో కొట్టిన ప్రముఖ గాయకుడు.. నెట్టింట్లో తీవ్ర దుమారం

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

 Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News