Rebels of Thupakulagudem : హను రాఘవపూడి మెచ్చిన టీజర్

Hanu Raghavapudi-Rebels Of Thupakulagudem Teaser హను రాఘవపూడి ప్రస్తుతం ఫుల్ ట్రెండింగ్‌లో ఉన్నాడు. రెబల్స్ ఆఫ్ తుపాకుల గూడెం అనే టీజర్‌ను రిలీజ్ చేశాడు. ఈ టీజర్ కొత్తగా ఉండటంతో జనాలను ఆకట్టుకుంటోంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 27, 2022, 05:34 PM IST
  • రెబల్స్ ఆఫ్ తుపాకులగూడెం టీజర్
  • హను రాఘవపూడి చేతుల మీదుగా టీజర్
  • కొత్త కాన్సెప్ట్‌తో రాబోతోన్న కొత్త యూనిట్
Rebels of Thupakulagudem : హను రాఘవపూడి మెచ్చిన టీజర్

Rebels Of Thupakulagudem Teaser : చిన్న సినిమాలు పెద్ద సినిమాలు.. స్టార్ హీరోలు, కొత్త హీరోలు అన్నా తేడాలను ప్రేక్షకులు చూడటం లేదు. సినిమా బాగుంటే.. కొత్త కథ అయితే.. కంటెంట్ నచ్చితే సినిమాలు చూస్తున్నారు. ఇండస్ట్రీలో మేకింగ్ మారుతున్న ఈ సమయంలో కొత్త రకం కథలు వస్తున్నాయి. కొత్త వారు కొంగొత్త ప్రయోగాలు చేస్తున్నారు. ఈక్రమంలోనే వారధి క్రియేషన్స్ ప్రై.లి. బ్యానర్ ఓ సినిమాను నిర్మిస్తోంది. రెబల్స్ ఆఫ్‌ తుపాకులగూడెం అనే సినిమాను జైదీప్ విష్ణు తెరకెక్కిస్తున్నాడు.

తాజాగా ఈ మూవీ టీజర్‌ను సీతారామం డైరెక్టర్ హను రాఘవపూడి రిలీజ్ చేశాడు. టీజర్‌ను చూసిన హను రాఘవపూడి మెచ్చుకున్నాడు. సినిమా టీంకు కంగ్రాట్స్ తెలిపాడు. అయితే ఈ టీజర్‌లో మాత్రం జనాలకు ఇంట్రెస్ట్‌ కలిగించేలా ఎన్నో విషయాలున్నాయి. టీజర్ చూస్తే సినిమాకు సంబంధించిన ఎన్నో ప్రశ్నలు ఉత్పన్నమవుతుంటాయి.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News