Rama Banam Collection : సినిమా సినిమాకీ పడిపోతోన్న గోపీచంద్.. దారుణంగా రామబాణం కలెక్షన్స్

Rama Banam Movie Day 1 Collection రామబాణం గోపీచంద్ సినిమా దారుణాతి దారుణంగా బోల్తా పడింది. ఈ సినిమా కలెక్షన్లు చూసి అంతా షాక్ అవుతున్నారు. ఈ సినిమాకు నెగెటివ్ టాక్ వచ్చింది. రొటీన్ రొడ్డ కొట్టుడు అని తేల్చి పడేశారు. దీంతో కలెక్షన్లు తేలిపోయాయి.

Written by - ZH Telugu Desk | Last Updated : May 7, 2023, 03:19 PM IST
  • బాక్సాఫీస్ వద్ద కనిపించని సందడి
  • బోల్తా పడ్డ గోపీచంద్ రామబాణం
  • పూర్ ఓపెనింగ్ కలెక్షన్స్
Rama Banam Collection : సినిమా సినిమాకీ పడిపోతోన్న గోపీచంద్.. దారుణంగా రామబాణం కలెక్షన్స్

Rama Banam Movie Day 1 Collection గోపీచంద్ సినిమాలు వరుసగా బాక్సాఫీస్ వద్ద ఘోరంగా బోల్తా పడుతున్నాయి. గౌతమ్ నందా, ఆక్సిజన్, పంతం, చాణక్య, సీటీమార్, పక్కా కమర్షియల్ ఇలా ప్రతీ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ అవుతూనే వచ్చింది. పక్కా కమర్షియల్ కాస్త హిట్ అవుతుందని అంతా అనుకున్నారు. కానీ ఆ సినిమాతో మారుతి మళ్లీ రొటీన్ రొడ్డ కొట్టుడు సినిమాను తీసి నిరుత్సాహపరిచాడు. అలా గోపీచంద్ ఫ్లాపుల పరంపర కొనసాగుతూనే వచ్చింది.

ఇప్పుడు రామబాణం సినిమా అయినా గోపీచంద్‌ను గట్టెక్కిస్తుందని అంతా అనుకున్నారు. కానీ రామబాణం నిండా ముంచేసింది. ఈ సినిమా ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద కొట్టుమిట్టాడుతూ ఉంది. కనీసం బ్రేక్ ఈవెన్ వరకు అయినా వెళ్తుందా? లేదా? అన్నది తెలియడం లేదు. ఈ సినిమా దాదాపు పద్నాలుగు కోట్ల మేర బిజినెస్ చేయగా.. పదిహేను కోట్లతో బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను పెట్టుకుంది. అయితే ఈ రేంజ్‌లో వసూళ్లు వస్తాయా? లేదా? అన్నది తెలియడం లేదు.

ఈ సినిమాకు ఓపెనింగ్‌ రోజున 1.17 కోట్ల షేర్ మాత్రమే వచ్చింది. అయితే పక్కా కమర్షియల్‌కు 2.62, సీటీమార్‌కు 2.98, పంతం 2.82, గౌతమ్ నందాకు 3.29 కోట్ల షేర్ మొదటి రోజే వచ్చాయి. అలా నానాటికీ గోపీచంద్ గ్రాఫ్ పడిపోతూనే వస్తోంది. ఇలా గోపీచంద్ తన ఇమేజ్‌ను తానే తగ్గించుకుంటున్నట్టుంది. సౌమ్యుడు, మంచివాడు అంటూ ఇండస్ట్రీలో పేరున్న గోపీచంద్‌కు మాత్రం ఒక్క హిట్ పడటం లేదు.

Also Read:  Ananya Nagalla : అనన్య తడి అందాలు.. చూస్తే వామ్మో అనాల్సిందే.. అందరి ఫోకస్ అక్కడే

ఇక గోపీచంద్ సినిమా కెరీర్ కూడా ఈ రామబాణంతో అయోమయంలో పడ్డట్టు అయింది. ఒకప్పుడు విలన్‌గా అయినా గోపీచంద్‌ ప్రేక్షకులను మెప్పించాడు. ఇప్పుడు హీరోగా అయితే వరుస డిజాస్టర్లతో నిరుత్సాహపరుస్తున్నాడు. ఇక గోపీచంద్ తదుపరి సినిమా పరిస్థితి ఏంటో ఎవ్వరికీ అర్థం కావడం లేదు. ఈ రామబాణం అయితే డిజాస్టర్‌గా నిలిచే చాన్స్ కనిపిస్తోంది. రామబాణంతో వచ్చిన ఉగ్రం కూడా ఓ మోస్తరు కలెక్షన్లే రాబడుతున్నట్టుగా తెలుస్తోంది.

Also Read:  Naga Chaitanya : పోతుందని తెలిసి కూడా ప్రమోషన్స్ చేయడం కష్టం!.. థాంక్యూపై నాగ చైతన్య

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News