Prasanth Varma: ప్రశాంత్ వర్మ సూపర్ ఉమెన్ సినిమాకి హీరోయిన్ ఫిక్స్.. ఆశ్చర్యపోతున్న నెటిజన్స్..

HanuMan Collections: హనుమాన్ సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేశారు యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ. కాగా ఈ దర్శకుడు తన తడుపరి ప్రాజెక్టు వివరాలు కూడా ఈ మధ్యనే తెలియజేశాడు. ఇందులో ముఖ్యంగా తను ఒక సూపర్ ఉమెన్ సినిమా కూడా చేయబోతున్నానని ప్రకటించి అందరి దృష్టిని ఆకట్టుకున్నారు..  

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 24, 2024, 07:17 PM IST
Prasanth Varma: ప్రశాంత్ వర్మ సూపర్ ఉమెన్ సినిమాకి హీరోయిన్ ఫిక్స్.. ఆశ్చర్యపోతున్న నెటిజన్స్..

Prasanth Varma Female Oriented Film: సంక్రాంతికి ఎంతోమంది స్టార్ హీరోల సినిమాలు విడుదలైన ..సెన్సేషనల్ హిట్ సొంతం చేసుకుంది మాత్రం ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వచ్చిన హనుమాన్ చిత్రం. తేజ సజ్జ హీరోగా నటించిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్స్ పరంగా దూసుకుపోతోంది. 

ఈ సినిమాతో తెలుగులోనే పాన్ ఇండియా పరంగా మంచి పేరు తెచ్చుకున్నారు దర్శకుడు ప్రశాంత్ వర్మ. తక్కువ ఖర్చులో మంచి అవుట్ పుట్ ఇచ్చి హనుమాన్ సినిమాతో అందర్నీ మెప్పించాడు. ఈ నేపథ్యంలో ఈ దర్శకుడి తదుపరి సినిమాల పైన కూడా అంచనాలు భారీగా ఏర్పడుతున్నాయి. 

హనుమాన్ సీక్వెల్ గా వస్తున్న జై హనుమాన్ సినిమాకి ప్రీ ప్రొడక్షన్ పనులు ఆల్రెడీ మొదలు పెట్టేసారు ఈ దర్శకుడు.  ఇక దీంతో పాటు దాదాపు 12 సూపర్ హీరో సినిమాలు తీస్తానని, ఆల్రెడీ ఆరు సినిమాలకు రైటింగ్ వర్క్ జరుగుతుందని, ఒక సినిమా షూటింగ్ లో ఉందని, అందులో ఓ ఫిమేల్ సెంట్రిక్ సూపర్ హీరోయిన్ సినిమా కూడా ఉంటుందని ఈ మధ్యనే ఒక ఇంటర్వ్యూలో తెలియజేశారు.

కాగా ఇప్పుడు ఈ ఫిమేల్ ఓరియంటెడ్ సినిమాలో హీరోయిన్ గా ఎవరు చేయబోతున్నారు అనే వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ ఫిమేల్  సెంట్రిక్ సూపర్ హీరోయిన్ సినిమాలో చేసేది జ్ఞానేశ్వరి కాండ్రేగులతో అని సమాచారం. ఈ విషయాన్ని స్వయంగా జ్ఞానేశ్వరి ఓ ఇంటర్వ్యూలో చెప్పడం విశేషం. 

పెళ్లిచూపులు అనే షోతో ఫేమ్ తెచ్చుకున్న జ్ఞానేశ్వరి ఆ తర్వాత చాలా తెలుగు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, చిన్న సినిమాల్లో హీరోయిన్ గా చేసింది. ఇటీవల మంత్ ఆఫ్ మధు సినిమాలో ముఖ్య పాత్రలో కనిపించి మెప్పించింది. ఆల్రెడీ పలు సినిమాల్లో బోల్డ్ పాత్రలు సైతం చేసి మంచి ఫాలోయింగ్ కూడా తెచ్చుకుంది. 

ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ హీరోయిన్ ని ప్రశాంత్ వర్మ తన ఫిమేల్ ఓరియెంటెడ్ చిత్రానికి తీసుకున్నారట. కానీ ఈ విషయం తెలిసి నెటిజన్స్ మాత్రం ఆశ్చర్యపోతున్నారు. ప్రశాంత్ వర్మ ఇంత పాపులారిటీ వచ్చాక కూడా.. ఎందుకు చిన్న హీరోయిన్ ని అంత పెద్ద ప్రాజెక్టుకి తీసుకోవాలి అనుకుంటున్నారు అని సందేహం వ్యక్తం చేస్తున్నారు. అయితే కొంతమంది మాత్రం హనుమాన్ సినిమాలో తేజాన్ని తీసుకున్నప్పుడు కూడా ఇలానే అన్నారని.. అయితే ప్రశాంత్ వర్మ.. ఎప్పుడు తక్కువ బడ్జెట్ తో హై క్వాలిటీ సినిమాలు ఇవ్వాలి అని ఆలోచనలోనే ఉంటారని సపోర్ట్ చేస్తూ వస్తున్నారు. మరి ఈ హీరోయిన్ గురించి అధికారిక ప్రకటన రావాలి అంటే మరి కొద్ది రోజులు వేచి చూడాలి.

Read: Ayodhya Crown: అయోధ్య రాముడికి స్వర్ణ కిరీటం.. వజ్రాలు, విలువైన రాళ్లు పొదిగినది ఎన్ని కోట్లు అంటే?

Also Read: BRS Party MLAS Meet Revanth: బీఆర్‌ఎస్‌ పార్టీలో కలకలం.. సీఎం రేవంత్‌ను కలిసిన నలుగురు ఎమ్మెల్యేలు

 

 

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 

Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News