Vijay - Samantha : అమ్మాయిల డ్రీమ్ బాయ్, అబ్బాయిల డ్రీమ్ గర్ల్.. ఎప్పుడైనా ఈ విషయం గమనించారా?

Vijay Devarakonda-  Samantha in Kushi: అమ్మాయిల డ్రీమ్ బాయ్, అబ్బాయిల డ్రీమ్ గర్ల్ హీరో హీరోయిన్లుగా ఖుషీ సినిమా తెరకెక్కుతోంది, ఈ సినిమా కంటే ముందు ఈ విషయం ఎవరైనా గమనించారా?

Last Updated : Dec 20, 2022, 03:23 PM IST
Vijay - Samantha : అమ్మాయిల డ్రీమ్ బాయ్, అబ్బాయిల డ్రీమ్ గర్ల్.. ఎప్పుడైనా ఈ విషయం గమనించారా?

Girls Dream Boy Vijay Devarakonda- Boys Dream Girl Samantha in Kushi: సినిమాలు జీవితంలో ఒక భాగమైపోయిన నేపథ్యంలో యువత ఏదైనా సినిమాలతోనే పోల్చుకుంటూ వస్తున్నారు. అందుకే వరైనా అమ్మాయిని డ్రీమ్ బాయ్ ఎలా ఉండాలి అని అడిగితే కచ్చితంగా గీతగోవిందం సినిమాలో విజయ్ దేవరకొండలా ఉండాలని అందరూ ముక్తకంఠంతో చెబుతారు. విజయ్ అనే కుర్రాడి పాత్రలో గీత గోవిందం సినిమాలో విజయ్ దేవరకొండ నటన అత్యద్భుతం, తన రియల్ బిహేవియర్ కి పూర్తి భిన్నంగా దేవరకొండ ఈ పాత్ర చేశాడని చెప్పాలి.

తనకు ఇష్టమైన అమ్మాయి కోసం ఆమెను బతిమిలాడుకుంటూ ఆమె ఏం చెబితే అది చేస్తూ ఉండే అబ్బాయిగా ఈ సినిమాలో విజయ్ దేవరకొండ కనిపిస్తాడు. తాను ప్రేమించిన అమ్మాయిని దక్కించుకోవడం కోసం పెళ్లి ఆపడానికి అవసరమైతే తన బావ కాళ్ళ మీద పడటానికి కూడా కూడా ఏమాత్రం సందేహించడు. తాను ప్రేమించిన అమ్మాయిని కాపాడుకోవడం కోసం ఎంత దూరమైనా వెళుతూ ఉండే పాత్రలో విజయ్ దేవరకొండ కనిపిస్తాడు. అలాగే అబ్బాయిల డ్రీమ్ పాత్ర అనగానే కచ్చితంగా మజిలీ సినిమాలో సమంత పాత్ర గుర్తుకొస్తుంది.

పెద్దలు కుదిరిచిన పెళ్లి అయినా సరే తన భర్తను అమితంగా ప్రేమించే పాత్రలో సమంత నటించింది.  నాగచైతన్యను కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉండే పాత్రలో ఆమె కనిపిస్తుంది. భర్త తాగి ఇంటికి వచ్చినా తాను మాత్రం పల్లెత్తు మాట అనకుండా తాను ఉద్యోగం చేసి భర్తను పోషిస్తూ భర్త తాగుడికి డబ్బులు ఇస్తూ ఆయన్ని ప్రేమిస్తూ ఉండే పాత్రలో సమంత నటించింది. అందుకే అబ్బాయిల డ్రీమ్ గర్ల్ ఎవరు అంటే మజిలీ సినిమాలో సమంత అని, అమ్మాయిల డ్రీమ్ బాయ్ ఎవరూ అంటే గీత గోవిందం సినిమాలో విజయ్ దేవరకొండ అని చెప్పక తప్పదు.

అలాంటి ఈ ఇద్దరు కలిసి ఇప్పుడు ఖుషి అనే ఒక లవ్ స్టోరీ సినిమా చేస్తున్నారు. గతంలో వీరిద్దరూ కలిసి మహానటి అనే సినిమాలో చిన్న పాత్రలలో కనిపించారు కానీ పూర్తిస్థాయి సినిమా మాత్రం ఖుషి అనే చెప్పాలి. విజయ్ దేవరకొండ హీరోగా సమంత హీరోయిన్గా రూపొందుతున్న ఈ సినిమాని షైన్ స్క్రీన్స్ సంస్థ నిర్మిస్తోంది.

సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని శివ నిర్వాణ తెరకెక్కిస్తున్నారు. సమంత అనారోగ్యం రీత్యా ఈ సినిమా షూటింగ్ అయితే వాయిదా పడింది. ఆమె పూర్తిస్థాయిలో కోలుకుని షూట్ కి హాజరైతే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. కాశ్మీర్ నేపథ్యంలో సాగుతున్న ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుంది అనేది చూడాల్సి ఉంది.

Also Read: Samantha Losing Chances: సమంతను ఆ నిర్మాతలు అందుకే పక్కన పెడుతున్నారా ?

Also Read: Rangasthalam Auditions: ఆరోజు అనుపమ వాళ్ల అమ్మ అక్కడ లేకుంటే సమంత ప్లేస్ అనుపమదే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook.

 

Trending News