Ginna - Ori Devuda : మంచు విష్ణు, విశ్వక్ సేన్, శివ కార్తికేయన్, కార్తీ ఇలా హీరోలంతా కూడా ఒకే వారంలో బరిలోకి దిగబోతోన్నారు. ఈ వారం అంటే అక్టోబర్ 21న నాలుగు చిత్రాలు సందడి చేయబోతోన్నాయి. ప్రతీ సినిమా మీద బజ్ ఉంది. ఇందులో ఏ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తుందో..ఏ చిత్రం బరిలో నిలబడుతుందో అన్నది చూడాల్సిందే. కార్తీ, శివ కార్తీకేయన్ తమిళ, తెలుగు భాషల్లో రాబోతోన్నారు.
శివ కార్తికేయన్ ప్రిన్స్ సినిమాకు తెలుగులోనూ మంచి క్రేజ్ ఏర్పడింది. జాతి రత్నాలు ఫేమ్ అనుదీప్ ఈ సినిమాను తెరకెక్కించడంతో ప్రిన్స్ చిత్రం మీద క్రేజ్ నెలకొంది. జాతి రత్నాలు రేంజ్‌లో ఫన్‌ను ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు జనాలు. ఇక కార్తీ సర్దార్ సినిమా మీద కూడా మంచి అంచనాలే ఉన్నాయి. కార్తీ గెటప్స్ చూస్తుంటే సినిమాలోని స్టోరీ మీద అందరికీ ఇంట్రెస్ట్ ఏర్పడింది.
ఇక తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్ అయిన ఓ మై కడవలే సినిమాను తెలుగులో ఓరి దేవుడా అంటూ రీమేక్ చేశారు. ఇందులో విశ్వక్ సేన్ నటించాడు. అశోక వనంలో అర్జునకళ్యాణం వంటి కూల్ హిట్ తరువాత విశ్వక్ సేన్ రాబోతోన్న చిత్రమిదే. అందుకే ఈ సినిమా మీద కూడా మంచి అంచనాలే ఉన్నాయి.
మంచు విష్ణు చాలా రోజుల తరువాత జిన్నా చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతోన్నాడు. ఇందులో పాయల్ రాజ్‌పుత్, సన్నీ లియోన్ స్పెషల్ అట్రాక్షన్ కాబోతోన్నారు. మరి ఈ సినిమా ఫలితం ఎలా ఉంటుందో చూడాలి. మా ప్రెసిడెంట్ మంచు విష్ణు.. బాక్సాఫీస్ బరిలోనూ గెలుస్తాడా? అన్నది చూడాలి. కానీ కాంతారా ఎఫెక్ట్ మాత్రం ఈ చిత్రాలన్నింటి మీద ఉండబోతోన్నట్టుగా కనిపిస్తోంది.
Also Read : Kantara Movie IMDB rank : దటీజ్ కాంతారా.. దేశంలో నెంబర్ వన్
Also Read : Renu Desai Divorce : మళ్లీ దొరికిపోయిన పవన్ కళ్యాణ్.. భరణంపై రేణూ దేశాయ్ అలా.. పవర్ స్టార్ ఇలా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook