ఉత్తమ నటిగా RRR భామ.. అవార్డులు కొల్లగొట్టిన ‘గల్లీ బాయ్’

65వ ఫిల్మ్ ఫేర్ అవార్డుల్లో ఒక్క సినిమా రికార్డు స్థాయిలో 13 అవార్డులను సొంతం చేసుకుంది. అవార్డుల ప్రదానోత్సవ వేడుక ఘనంగా జరిగింది.

Last Updated : Feb 16, 2020, 01:11 PM IST
ఉత్తమ నటిగా RRR భామ.. అవార్డులు కొల్లగొట్టిన ‘గల్లీ బాయ్’

రణ్‌వీర్ సింగ్, అలియా భట్ జంటగా నటించిన బాలీవుడ్ సినిమా ‘గల్లీ బాయ్’ అవార్డుల పంట పండించింది. 65వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్‌లో ‘గల్లీ బాయ్’ రికార్డు స్థాయిలో 13 అవార్డులను కొల్లగొట్టింది.  రణ్‌వీర్ సింగ్ ఉత్తమ నటుడిగా, అలియా ఉత్తమ నటి అవార్డులను సొంతం చేసుకున్నారు. ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఫిల్మ్ ఫేర్ అవార్డుల వేడుకను అసోం రాజధాని గువాహటిలోని ఇందిరా గాంధీ అథ్లెటిక్ స్టేడియంలో ఘనంగా నిర్వహించారు. 

Also Read: సినిమా షూటింగ్‌ కాదు.. బెజవాడలో పెళ్లిసందడి

గతేడాది బాలీవుడ్‌లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచినవారికి 65వ ఫిల్మ్‌ఫేర్ అవార్డులను ప్రధానం చేశారు.  దర్శకనిర్మాత కరణ్ జోహర్, నటుడు విక్కీ కౌశల్ హోస్ట్‌లుగా వ్యవహరించి అవార్డుల కార్యక్రమాన్ని సాఫీగా సాగిపోయేలా చేశారు. ‘గల్లీ బాయ్’ ఉత్తమ చిత్రం పురస్కారంతో పాటు ఉత్తమ నటుడు, ఉత్తమ నటి, బెస్ట్ డైరెక్టర్ అవార్డును జోయా అక్తర్ సొంతం చేసుకున్నారు.  ఆల్ టైమ్ గ్రేట్ మూవీ ‘షోలే’ తెరకెక్కించిన దర్శకుడు రమేష్ సిప్పీని జీవితకాల సాఫల్య పురస్కారం (లైఫ్‌టైమ్ అచీవ్ మెంట్ అవార్డు)తో సత్కరించారు.

తాప్సీ పన్ను, భూమి ఫడ్నేకర్‌లు సంయుక్తంగా ఉత్తమ నటి (విమర్శకులు) అవార్డు కైవసం చేసుకున్నారు. ఆలోచింపజేసే సినిమాలు ‘సోంచిరియా’, ‘ఆర్టికల్ 15’ సినిమాలు ఉత్తమ చిత్రం (విమర్శకులు) అవార్డును అందుకున్నాయి. సీనియర్ నటుగు గోవింద ఎక్స్‌లెన్స్ అవార్డును ప్రదానం చేశారు.

Also Read; ఆ హీరోయిన్ వచ్చిన వేళా విశేషం.. నితిన్‌కు పెళ్లి! 

అవార్డుల జాబితా:

  • ఉత్తమ చిత్రం - గల్లీ బాయ్
  • ఉత్తమ నటుడు - రణ్‌వీర్ సింగ్ (గల్లీ బాయ్)
  • ఉత్తమ నటి - అలియా భట్ (గల్లీ బాయ్)
  • బెస్ట్ డైరెక్టర్ - జోయా అక్తర్ (గల్లీ బాయ్)
  • ఉత్తమ సహాయ నటుడు - సిద్ధాంత్ చతుర్వేది (గల్లీ బాయ్)
  • ఉత్తమ సహాయనటి - అమృతా సుభాష్ (గల్లీ బాయ్)
  • ఉత్తమ చిత్రం (విమర్శకులు) - ఆర్టికల్ 15, సోంచిరియా
  • ఉత్తమ నటుడు (విమర్శకులు) - ఆయుష్మాన్ ఖురానా (ఆర్టికల్ 15)
  • ఉత్తమ నటి (విమర్శకులు) - తాప్సీ, భూమి ఫడ్నేకర్ (సాంద్ కి ఆంఖ్)
  • ఉత్తమ దర్శకుడు (తొలి పరిచయం) - ఆదిత్య ధార్ (ఉరి: ద సర్జికల్ స్ట్రైక్)
  • ఉత్తమ నటుడు (తొలి పరిచయం) - అభిమన్యు దస్సాని (మర్ద్ కో దర్ద్ నహీ హోతా)
  • ఉత్తమ నటి (తొలిపరిచయం) - అనన్య పాండే (స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2)
  • బెస్ట్ స్క్రీన్‌ప్లే - రీమా కగ్తి, జోయా అక్తర్
  • ఉత్తమ మాటల రచయిత - విజయ్ మౌర్య (గల్లీ బాయ్)
  • ఉత్తమ సాహిత్యం - డివైన్, అంకుర్ తివారి (గల్లీ బాయ్, సాంగ్: అప్నా టైమ్ ఆయేగా)
  • బెస్ట్ కాస్టూమ్ - దివ్య గంభీర్, నిధి గంభీర్ (సోంచిరియా)
  • బెస్ట్ సౌండ్ డిజైన్ - విశ్వదీప్ ఛటర్జీ, నిహార్ రంజన్ సామల్ (ఉరి: ద సర్జికల్ స్ట్రైక్)
  • బెస్ట్ ఎడిటింగ్ - శివకుమార్ పనికెర్ (ఉరి: ద సర్జికల్ స్ట్రైక్)
  • బెస్ట్ వీఎఫ్ఎక్స్ - షెర్రీ బార్దా, విశాల్ ఆనంద్ (వార్)
  • బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్ - సుజాన్నే కప్లాన్ మేర్వాన్‌జి (గల్లీ బాయ్)
  • బెస్ట్ మ్యూజిక్ ఆల్బమ్ - గల్లీ బాయ్, కబీర్ సింగ్
  • బెస్ట్ బ్యాక్‌ గ్రౌండ్ మ్యూజిక్ - కర్ష్ కాలే, ది సాల్వేజ్ ఆడియో కలెక్టివ్ (గల్లీ బాయ్)
  • బెస్ట్ సింగర్ (ఫిమేల్) - శిల్పా రావ్ (వార్, సాంగ్ : ఘుంగ్రూ)
  • ఉత్తమ సింగర్ (మేల్) - అరిజిత్ సింగ్ (కలంక్, సాంగ్: కలంక్ నహి)
  • బెస్ట్ కొరియోగ్రాఫర్ - రెమో డిసౌజా (కలంక్, సాంగ్: ఘర్ మోరే పర్దేశియా)
  • బెస్ట్ సినిమాటోగ్రాఫర్ - జాయ్ ఓజా (గల్లీ బాయ్)

జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Trending News